Adusumilli jayaprakash
-
అడుసుమిల్లి కుటుంబసభ్యులకు జగన్ పరామర్శ
-
అడుసుమిల్లి కుటుంబానికి జగన్ పరామర్శ
గుంటూరు, సాక్షి: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు.జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్‌తో శనివారం వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ శాసనసభ్యులుగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్రవేసుకున్నారని జగన్ అన్నారు. జయప్రకాష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.అడుసుమిల్లి జయప్రకాశ్(72) ఊపిరితిత్తుల సమస్యతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను1952లో ఈయన జన్మించారు. భార్య పద్మ, కుమారుడు శ్రీతిరుమలేష్, కుమార్తె సాయినందన ఉన్నారు. 1983-1985 మధ్య విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా అడుసుమిల్లి కొనసాగారు. రాష్ట్రవిభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. -
మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: మాజీ ఎమ్మెల్యే, రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి జయప్రకాశ్ మరణంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జై ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారని వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు. కాగా, గత కొంత కాలంగా అస్వస్థతగా ఉన్న అడుసుమిల్లి జయప్రకాశ్ హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం విజయవాడలోని మొగల్రాజపురంలో జరగనున్నాయి. మాజీ శాసనసభ్యులు, రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి జయప్రకాశ్ మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు @ysjagan సంతాపం వ్యక్తం చేశారు.జై ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారని వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు. జయప్రకాశ్ కుటుంబ స…— YSR Congress Party (@YSRCParty) September 20, 2024 -
అవాకులు చవాకులే వారికి వార్తలా?
ఇష్టమైన పార్టీనో, నేతలనో పైకి ఎత్తడం, పాఠకు లను పక్కదారి పట్టించడం యెల్లో మీడియాకు పెన్నుతో పెట్టిన విద్య అని చెప్పాలి. వార్తల వెనుక ఉండే నిజాలతో వారికి పనిలేదు. వార్తల ప్రయో జనాలు వారికి అవసరం లేదు. స్వలాభాపేక్ష ఒక్కటే లక్ష్యం. ఇసుక తవ్వకాలు, విక్రయాలపై కొందరు నాయకుల అక్రమాలు ప్రచురిస్తున్నట్లు కనిపించినా... ఆ వంకతో, తమకు అనుకూలమైన వారికి ‘ఈనాడు’ ఎటువంటి ప్రయోజనాలు కల్పించిందో రాస్తే అదో భారతం అవుతుంది. ఆ మధ్య మిచ్న్ తుఫాను వచ్చినప్పుడు... ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురియడంతో పల్లపు ప్రాంతాలలో కొంత మేర ముంపునకు గురయ్యాయి. కానీ ప్రభుత్వమే ఆ పంటలను ముంచేసినట్లు చిత్రీకరిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై ఎన్నో అభాండాలను ప్రచురించింది. గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా ఆధునీకరణ నిధులు ఏమయ్యాయి? వాటిని గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఎటు మళ్ళించింది అనే వాస్తవాలను పక్కన పెట్టి పంటల ముంపు బాధ్యత ప్రభుత్వానిదే అన్నట్లు ప్రచురించింది. కృష్ణా డెల్టా ఆధునీకరణకు కేటాయించిన రూ. 175 కోట్లు కృష్ణ కరకట్టపై తాను అక్రమంగా నివాసం ఉంటున్న భవనం ప్రాంతాన్ని సుందరీకరణకు చంద్రబాబు వినియోగించారనే వాస్తవాన్ని యెల్లో పత్రికలు ఎందుకు ప్రచురించవు? గోదావరి ఆధునీకరణ నిధులను కూడా దాదాపు రూ.150 కోట్లు పుష్కరాల నెపంతో ‘పచ్చ’ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. ఈ వాస్తవాన్ని ఈ పత్రికలు కాదనగలవా? ఒక ప్రభుత్వం చేస్తే సామాజిక న్యాయం, మరో ప్రభుత్వం చేస్తే సమాజ వ్యతిరేకం అవుతుందా? చంద్రబాబు పాలనలో బీసీలకు ఎనిమిది మంత్రి పదవులివ్వగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 11 మంత్రి పదవులు బీసీలకు లభించాయి? మరి ఏది సామాజిక న్యాయం అని చెప్పాలి! చంద్రబాబు ఎస్సీలకు రెండు మాత్రమే మంత్రి పదవులు ఇస్తే జగన్ ఐదుగురికి ఇచ్చారు. మరి ఎవరిది సామాజిక న్యాయం? రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజును కౌన్సిల్ ఛైర్మన్‌గా జగన్ చేశారు. టీడీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 18 ఎమ్మెల్సీ పదవులు ఇవ్వగా, జగన్ 29 పదవులు (69 శాతం) ఇచ్చి సామాజిక న్యాయానికి బ్రహ్మరథం పట్టారు. ఈ వాస్తవాలు కనబడవా? చంద్రబాబు హయాంలో ఏటా సగటున 324 మండలాల్లో కరువు తాండవించినా రైతులను కనికరించిన దాఖలాలు లేవు. జరిగిన పంట నష్టానికి సంబంధించి పరిహారాన్ని ఆ సీజన్ కాదుకదా, కనీసం ఆ ఏడాది ముగిసేలోగానైనా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ వాస్తవాన్ని వదిలేసి జగన్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించలేదంటూ వార్తలు ప్రచురించడాన్ని ఏమనుకోవాలి? ప్రాథమిక పంట నష్టం అంచనాలు, తుది లెక్కలకు వ్యత్యాసం ఉంటుంది. దానిని వదిలేసి, పంట నష్టం లెక్కలను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తున్నదంటూ అన్నదాతలను పక్కదారి పట్టించడం జర్నలిజంలో నైతిక ప్రమాణాలను మింగివేయడం కాదా? బడి పిల్లలకు తగిన విద్యా బుద్ధులతో పాటు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది వైసీసీ ప్రభుత్వం. నిత్యం సగటున 34.90 లక్షల మంది బడి పిల్లలకు ‘గోరుముద్ద’ అందుతుండగా, దానిలో ఆరు రోజులకు 16 రకాల వంటకాలను విద్యార్థులు రుచి చూస్తున్నారు. ఈ భోజనానికి బాబు హయాంలో ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేయగా, జగన్ ప్రభుత్వంలో ఏటా సగటున రూ.1,450 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయినా బడిపిల్లలకు సరైన పౌష్టికాహారమే లభించడం లేదంటూ వార్తలు ప్రచురించడాన్ని ఏమనాలి? చంద్రబాబు హయాంలో 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు వామికొండ వద్ద, 1999 ఎన్నికలకు ముందు గండికోట వద్ద మరోసారి గాలేరు–నగరికి శంకు స్థాపన చేశారు. కానీ ఆ తొమ్మిదేళ్ళలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తరువాత గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని జల యజ్ఞంలో భాగంగా చేపట్టి 2009 నాటికే చాలావరకు పూర్తి చేశారు. గండికోట రిజ ర్వాయర్, పైడిపాలెం, వామికొండ, సర్వారాయ సాగర్ జలాశయాలతోపాటు ఈ ప్రాజెక్టు పనులు చాలావరకు 2009 నాటికి పూర్తి చేశారు. తర్వాత చంద్రబాబు వచ్చాక ప్రాజెక్టు మిగిలిన పనులు పడకేశాయి. అటుపై జగన్ అధికారంలోకి వచ్చాకే పెండింగ్ పనులకు కదలిక వచ్చింది. 2020–21 నుండి గండికోటలో ఏటా పూర్తి సామర్థ్యం మేరకు 28.85 టీఎంసీలను నిలువ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వగా, దానిలో 1.5 లక్షలు అప్పుల కింద జమవేసుకొనేవారు. మిగిలిన మొత్తాన్ని డిపాజిట్ చేసి దాని వడ్డీని మాత్రమే ఆ రైతు కుటుంబానికి ఇచ్చేవారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ పరిహారాన్ని 7 లక్షల రూపాయలకు పెంచడమే కాక, ఎలాంటి సమస్య లేకుండా ఆ రైతు ఖాతాలోనే నేరుగా పరిహారం మొత్తాన్ని జమచేస్తున్నారు. విద్యార్థుల చేతుల్లో ట్యాబులు కళకళలాడుతుంటే, వారి వద్ద పలకలు కూడా లేవంటూ ప్రచారం! విద్యార్థుల ఫీజులు రీయింబర్స్ చేస్తూ రకరకాల సంక్షేమ పథకాల కింద వారి ఖాతాలకే జమ చేస్తుంటే బడి మానేసే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందంటూ ఇంకో యెల్లో పత్రిక కథనాలు! 2022– 23లో జగన్ ప్రభుత్వం 3.32 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించిందని ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించగా ఆ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించడానికి మనసురాక అప్పులు పెరిగి పోతున్నాయంటూ గగ్గోలు! వార్తల్ని మింగేస్తున్న పత్రికలు ఇక సమాజాన్ని ఏం ఉద్ధరిస్తాయి? అడుసుమిల్లి జయప్రకాశ్ వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే ‘ 98481 28844 -
‘అందువల్లే చంద్రబాబుకు ఈనాడు, జ్యోతి భజన చేస్తున్నాయి’
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు కళ్లు బైర్లు కమ్మే వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్. కేవలం కమ్మ కులంలోనే కొందరు మాత్రమే చంద్రబాబుకు సపోర్టు ఇస్తున్నారని అన్నారు. అలాగే, బాబును భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ కమ్మ కులానికి చెందినవారివేనని, అందుకే వీరంతా చంద్రబాబు ఏం చేసినా మద్దతిస్తూ డప్పులు వాయిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు.. విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. "నేను కమ్మ కులస్థుడినే. మా కులం వారు మిగతా కులం నుంచి దూరమై ఒంటరైపోయారు. చంద్రబాబు అరెస్ట్ జరిగిన తర్వాత ఆయనకు మద్దతు ఇస్తున్న వారు కేవలం మా కులానికి చెందినవారే. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు. ఇప్పటిదాకా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. చంద్రబాబు ఐటీ ఇండస్ట్రీని తెచ్చాడు అనేది కేవలం మా కమ్మోళ్ల ప్రచారం మాత్రమే. ఇప్పటివరకు ఐటీకి బాబు చేసిందేమీ లేదు. లోకేష్‌ది పాదయాత్ర కాదు.. డబ్బు యాత్ర.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి తీసుకువస్తుంటే పట్టించుకున్న వ్యక్తి ఒక్కరు కూడా లేరు. అమరావతిలో రాజధాని ఉద్యమం లేదు.. ఏమీ లేదు. కేవలం మూడు, నాలుగు ఊర్లలోనే కొందరు అల్లరి చేస్తున్నారు. అమరావతిలో పచ్చని భూములను చంద్రబాబు నాశనం చేశాడు. నారా లోకేశ్ యాత్ర అంతా డబ్బులతోనే నడిచింది. టీడీపీకి మద్దతు ఇచ్చే స్థితిలో ప్రజలెవ్వరూ లేరు. ప్రజల మద్దతు సీఎం జగన్‌కే.. వైఎస్సార్సీపీని ఏ పార్టీ ఏమీ చేయలేదు. ఏపీలో టీడీపీ, జనసేన కలిసినా వైఎస్సార్సీపీకి ఫుల్ మెజార్టీ వస్తుందని నా దగ్గరున్న సర్వేలు చెబుతున్నాయి. మా కులం వాళ్లు తప్పిస్తే మిగతా కులాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పూర్తి మద్దతు ఉంది. సీఎం జగన్ మాట మీద నిలబడతారు. నిజాయతీ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ‘స్కిల్’ స్కామ్ కేసు: ప్రజాధనాన్ని లూటీ చేశారు -
ఆ విమర్శలన్నీ అక్కసుతోనే!
‘యు కెనాట్ రీచ్ యువర్ గోల్ ఇఫ్ యు కీప్ త్రోయింగ్ స్టోన్స్ ఆన్ ఎవ్రీ బార్కింగ్ డాగ్’ – విన్స్టన్ చర్చిల్. ఈ కొటేషన్ ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అతికినట్లు సరిపోతుంది. 2019 మేలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన విమర్శలను పట్టించుకోవడం మానేశారు. తాను చేయదలచుకున్నది చేసుకుంటూ పోతున్నారు. హామీలను పక్కాగా అమలు చేస్తున్నారు. ‘నవరత్నాలు’ దీనికి మంచి ఉదాహరణ. ప్రతి కుటుంబానికీ ఏడాదికి రెండు లక్షల రూపాయలు వివిధ పథకాల రూపంలో అందాయని ముఖ్యమంత్రి జగన్ చెబుతుంటారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు. ప్రతిపక్షం మొత్తం... ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జగన్ పాలనపై విషం కక్కుతోంది. ఆయన పాలన ప్రారంభించిన రోజు నుంచీ అడుగడుగునా న్యాయపరమైన చిక్కులు కల్పిస్తూనే ఉంది. మూడు రాజధానుల ప్రకటన నుంచి... శాసన మండలి రద్దు వరకూ ఏదీ టీడీపీ విమర్శకు మినహాయింపు కాదు. పోలవరం ప్రాజెక్టును తన హయాంలో పూర్తిచేయక పోగా... చంద్రబాబు అండ్ కో నిర్మించిన డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వేస్తుండడం హాస్యాస్పదం. ఉద్యోగాల అంశంలోనూ టీడీపీ, దానికి వత్తాసు పాడే పత్రికలూ అబద్ధాలను చిలవలు పలవలుగా ప్రచారం చేస్తు న్నాయి. వలంటీర్ల రూపంలో సుమారు 4 లక్షల ఉద్యో గాలను కల్పించారు. వలంటీర్ల జీతాలు తక్కువనీ, తక్కువ జీతాలుంటే వారికి పెళ్ళిళ్ళెలా అవుతాయనీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేసిన అంశం ఎవరి దృష్టీ దాటిపోలేదు. కానీ అన్ని ఉద్యోగాల మాదిరిగానే వలంటీర్లకూ జీతాల పెంపుదల ఉంటుందని జగన్ రుజువుచేశారు. అలాగే 1998 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసేందుకూ జగన్ నడుం బిగించారు. సంబంధిత ఫైల్‌పై ఆయన సంతకం చేసి దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపారు. పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం ఏటీఎమ్‌గా మలచుకుంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ, దాన్ని పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉంచేశారు. ఇప్పుడు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి వైఎస్ జగన్ ప్రభుత్వమే కారణమని నెపం మోపుతున్నారు. అంటే ఆ వాల్ ఎప్పుడు నిర్మించారో కూడా చంద్రబాబుకు గుర్తు లేదనుకోవాలా? ఇప్పుడు వేగంగా జరుగుతున్న పనులను చూసి, కుళ్ళుకుంటు న్నారని అనుకోవాలా? గ్రావిటీతో కాల్వలకు నీళ్ళిస్తామని చెప్పి, అభాసుపాలైన చంద్రబాబుకు ఇది గుర్తుంటుందనుకోవడం భ్రమే కాగలదు. మూడేళ్ళ తరవాత దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలకు ఏపీ తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరవ్వడం... లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు మార్గం తెరుచుకోవడం జరిగి పోయింది. ఇది బాబులో మరింత అసహనాన్ని రగిల్చింది. అందుకే దావోస్‌కు జగన్ విహారయాత్రలా వెడుతున్నారంటూ తన బాకా పత్రికలు, మీడియాతో ప్రచారానికి దిగారు. జగన్ బృందం కృషి కారణంగానే గౌతమ్ అదానీ, నవీన్ మిట్టల్, గ్రీన్ కో, అరబిందో లాంటి సంస్థలతో ఏపీ ప్రభుత్వానికి పెద్దపెద్ద ఒప్పందాలు కుదిరాయి. కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడ్డాయి. (క్లిక్: విమర్శే ప్రతిపక్షం పనా?) ఓ వ్యక్తికైనా... వ్యవస్థను నడిపే నాయకునికైనా సంయమనం అవసరం. రాష్ట్రాధినేతకు ఇది మరింత అత్యవసరం. అందుకే చీటికీ మాటికీ ప్రధాని లేదా ఉన్నత స్థానాలలో ఉన్న వారిపై విమర్శలకు జగన్ మొగ్గు చూపడం లేదు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సంయమనం పాటిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు చేస్తున్న విమర్శలు ఆయా రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. జగన్ మాత్రం ఆచితూచి మాట్లాడుతూ, స్థితప్రజ్ఞత కనబరుస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఇది ప్రతిపక్ష నాయకుడిని మరింత ఉడికిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు. (క్లిక్: ఏడుపే ఏడుపనే ప్రత్యేక కథనాలు) - అడుసుమిల్లి జయప్రకాశ్ మాజీ శాసన సభ్యుడు -
‘అమరావతి’ కలేనా!
విశ్లేషణ రాజధాని కోసం సేకరించిన భూమి మొత్తాన్ని చంద్రబాబు తన గుప్పెట్లో పెట్టుకుని భవిష్యత్ రాజకీయాలకు ఆ భూమినే ఆర్థిక పెట్టుబడిగా మలచుకోబోతున్నారు. విజయా వారి విజయవంతమై న సినిమా ‘మాయాబజార్’లో ఘటోత్కచుడు కౌరవులకు విడి ది కోసం ఒక నగరం నిర్మించా లనుకుంటాడు. అప్పటి కప్పుడు గురువు చిన్నమయ్య కాగితం మీద గీతలు గీస్తాడు. ఆ గీతలకు అర్థం తెలియక శిష్యులు ఆశ్చర్య పోతుంటే రకరకాల మంత్రాలు చదివేసరికి వెనువెంటనే ఒక మహానగరం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. సరిగ్గా అదేవిధంగా నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక మహా రాజధాని నగరం నిర్మించాలనుకున్నాడు. చిన్నమయ్య పాత్రను సింగపూర్ కంపెనీ పోషించి గీతలు గీసింది. ఆ గీతల మీద నగరం నిర్మించడానికి నాటి ఘటోత్కచుడికి ఉన్న మంత్ర శక్తి చంద్రబాబునాయుడికి లేదు. పైగా తొలి నుంచి రాజ ధానిపై అన్ని వర్గాల ప్రజల్లో ప్రబలంగా ఉన్న అనుమా నాలను అధిగమించి తాను కోరుకున్న విధంగా అమరా వతి నగరాన్ని నిర్మించాలంటే సామాన్య ప్రజలకు తన పథ కం మీద నమ్మకం కలిగించాలి. వార్తాపత్రికల్లో వచ్చిన సింగపూర్ కంపెనీ గీసిన గీతల మతలబు అంతుపట్టక పలు ప్రశ్నలతో సతమతమవుతున్న వారికి ప్రభుత్వం వివరణ ఇవ్వడం అవసరం. చంద్రబాబు ప్రతిపాదిత అమరావతిలో ఆస్తి మొత్తం ప్రభుత్వం చేతిలోనే. ఏ ప్రాంతంలో ఏమి ఉండాలో సింగ పూర్ పథకమే నిర్ణయించింది. మాల్స్ ఎక్కడ రావాలి, సిని మా హాల్స్ ఎక్కడ ఉండాలో కూడా వారు చూపించారు. మాల్స్ కట్టేవారికి, సినిమా హాల్స్ నిర్మించేవారికి భూము లు ఎవరు ఇస్తారు, ఏ పద్ధతిలో ఇస్తారు? ఇది అత్యంత గోప్యంగా ఉంచబడిన సమాచారం. పండ్లు, పూలు, పం టలు పండించుకుంటున్న దాదాపు 50 వేల మందికి హఠా త్తుగా ఉపాధిని కోల్పోయేలా చేసింది రాజధాని ప్రతిపా దన. వీరు వ్యవసాయానికి బదులుగా చిరువ్యాపారం చేసుకుందామంటే అమరావతిలో అలాంటి అవకాశమే లేనట్లుగా ఉంది సింగపూర్ పథకం. ఒక పట్టణ నగర జీవితంలో పచారీ షాపులు, ఇతర ప్రైవేట్ సంస్థలు ఎన్ని కోట్ల రూపాయలను రుణంగా ఇస్తుంటాయో ఎవరూ ఊహించలేరు. ప్రభుత్వ ఉద్యోగుల మొదలు, సామాన్యుల వరకు నెలవారీ సరుకులను ఖాతా గా తెచ్చుకుంటారు. నెల మొదటి వారంలో డబ్బు చెల్లించి తిరిగి అప్పుగా సరుకులు తెచ్చుకుంటారు. కాగితాలు అవ సరం లేకుండా కేవలం నమ్మకం మీద నడిచే వ్యాపారం ఇది. ఇలాంటి చిరువ్యాపారాలకు సింగపూర్ అమరావతి పథకంలో స్థానం కనిపించలేదు. అమరావతిలో ఏడులక్షల మంది మకాం ఉండే అవ కాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇంతమందికి అవస రమైన గృహసముదాయాలు ఎవరు నిర్మిస్తారు. అక్కడ స్థలమే లేనప్పుడు ఏ ఉద్యోగి అయినా ఎక్కడ ఇల్లు నిర్మిం చుకోగలుగుతాడు? రాజధాని నగరంలో ఏది ఎక్కడ ఉండాలో అంతా ప్రభుత్వమే నిర్ణయించేటట్లయితే ఆ నగరంలో సామాజిక వర్గాలన్నింటికీ స్థానముండదు. సమాజంలో కుమ్మరి, కమ్మరి, మేదరి, క్షురకుడు ఇలా ప్రతి ఒక్కరి సేవలు అవస రమే. వివిధస్థాయిల్లో వీరి దుకాణాలు నగరంలో కనిపి స్తాయి. ఉదాహరణకు ముంబై మహానగరంలో వీధిపక్కన షేవింగ్ చేయించుకునే సౌకర్యం కూడా ఉంటుంది. కాని అమరావతిలో అంతా ‘బ్రాండెడ్’కే స్థానం. కట్టుకునే బట్ట లు మొదలు క్రాఫింగ్ వరకు అంతా బ్రాండెడ్. వైద్య సౌక ర్యాలు, విద్య అంతా కార్పొరేట్ రంగంలోనే. సామాన్యుడు భరించలేనంత ఖరీదైన జీవనం అమరావతిలో ఉంటుం దని సింగపూర్ ప్లాన్‌లో కనిపిస్తున్నది. సేకరించిన భూమిలో కేటాయింపులను ప్రభుత్వమే చేస్తుందనుకుంటే ఆ భూకేటాయింపులు ఎవరికి చేస్తారు? వివిధ నిర్మాణాలకు కేటాయించిన స్థలాలన్నీ ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకే అప్పనంగా అందిస్తారా? అసలు స్థలా లు అమ్ముతారా? వేలం వేస్తారా? అయినవారికి పంచిపెడ తారా? ఈ రహస్య విధానం ఏమిటో ప్రభుత్వంలో ఉన్న తమకే తెలియదని స్వయంగా మంత్రులే వాపోతున్నారు. రాజధాని నగరానికి ఎంపిక చేసిన ప్రదేశం చంద్రబా బుకు సంపూర్ణంగా పట్టిన వాస్తుపిచ్చికి తప్పించి మరేవి ధంగానూ అనుకూలం కాదన్నది నిపుణుల అభిప్రాయం. సీడ్ క్యాపిటల్‌గా పేర్కొంటున్న మూడు గ్రామాలు కృష్ణా నది ముంపుకు గురయ్యే ప్రాంతాలు. నీరు నిలిచి ఉండే ప్రదేశం. చుట్టూ ఉన్న కాలువలు, వాగులు, వంకలు పొం గినప్పుడు నీరు చేరే ఆ ప్రాంతంలో రాజధానిని నిర్మించి వరదల రాజధానిగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నట్లుంది. పైగా తెలుగుదనం కొరవడిన విదేశీ నమూనాను ప్రజల ముందుంచుతున్నాడు చంద్రబాబు. రాజధాని నిర్మాణా నికి 35 నుంచి 50 ఏళ్ల సమయం పడుతుందని ప్రభు త్వమే ప్రకటించింది. 2019లో జరగనున్న ఎన్నికల్లోనే చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తాడనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన కనీస నిర్మాణాల మీద దృష్టి పెట్టకుండా మహానగర రూపురేఖల నిర్మాణం గురించి మాట్లాడటం అంటే ప్రజలను రంగుల కలలో ముంచి పబ్బం గడుపుకోవడమే. రాజధాని నగర నిర్మాణం మీద రాజకీయ భవిష్య త్తును నిర్మించుకునే ఎత్తుగడను ఆపి నవ్యాంధ్రకు దక్కా ల్సిన ఇతర అంశాల మీద చంద్రబాబు దృష్టి సారిస్తే బాగుంటుంది. రాజధాని నగరంలో నిర్మించాల్సిన అసెం బ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్ నిర్మాణాల రూపు రేఖలను తక్షణమే కేంద్రానికి పంపి వాటి నిర్మాణం చేప ట్టడం అవసరం. ఆ దిశలో బాబు కనీస ప్రయత్నం చేయ టంలేదు. ఈ సమయంలో ఒక కొత్త నాయకత్వం ఆంధ్రులకు అవసరం. రాజధాని నిర్మాణ ప్రతిపాదన దశలోనే ప్రతి ఘటించే నాయకత్వం కింద ఆంధ్రులు కలిసికట్టుగా పని చేయాలి. తను ఏది అనుకుంటే అదే ఫైనల్ అనుకునే ఆలో చనా ధోరణి నుంచి చంద్రబాబును బయటకు తెచ్చే శక్తి వంతమైన ఉద్యమం కావాలి. ప్రజలది తన మంత్రివర్గం లోని గంగి రెద్దుల మనస్తత్వం కాదని, ప్రశ్నించే తత్వం కలవారన్నది తెలియచెప్పాలి. సంవత్సర కాలం కలలో నడిపించిన చంద్రబాబుకి రాజధాని నిర్మాణ అంశం లోని వాస్తవాలతో ఎదురుతిరగాలి. రాజధాని నగరమంటే ‘గేటెడ్ కమ్యూనిటీ’ ఉండే ప్రదేశం కాదు. తాను, తన బంధువర్గం, తన పార్టీ నాయ కులు, తన సామాజిక వర్గం వారికి భూపంపకం చేసుకోవ డానికి కాదు రైతులు త్యాగం చేసింది. ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసమే వారు తమ భూములను ‘పూల్’ చేశారు. ‘పూలింగ్’కి అంగీకరించిన రైతులను ‘ఫూల్స్’ చెయ్య వద్దు. తన సొంత ఇంటి శంకుస్థాపన చేసుకున్న తీరులోనే రాజధాని నిర్మాణ భూమి పూజ చేసినప్పుడే బాబు మనసు ఆంధ్రులకు అర్థమైంది. అందుకే నేడు ఆంధ్రుల మనసుల్లో అసంతృప్తి మొదలైంది. ‘అమరావతి’ కలలు అమ్ముతున్న కొద్దీ అసంతృప్తి పెరుగుతుంది. చేసిన తప్పు లే మళ్లీ చేస్తానంటే ప్రజలు అసలు అంగీకరించరు. అన్నిరకాల అభివృద్ధి అంశాలు రాజధాని నగరం లోనే కేంద్రీకరించడమే ఆంధ్రప్రదేశ్ విభజనకు దారితీసి, ఆంధ్రులు భారీగా నష్టపోయారని తెలిసి కూడా అదే పాచి పట్టిన అభివృద్ధి నమూనాని అమరావతిలో ప్రతిపాదిం చడం ద్వారా మరో వేర్పాటు ఉద్యమానికి ఇతర జిల్లాల వారు సిద్ధమయ్యేలా చేయడం భావ్యం కాదు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని జిల్లాల వికాసం అనేది కొత్త నినా దం కావాలి. అందుకు తగిన విధంగా చంద్రబాబు ఆలోచ నల్లో మార్పురాకుంటే ఆంధ్రప్రజలే ఆ మార్పు తెచ్చేం దుకు నడుం బిగించాలి. అడుసుమిల్లి జయప్రకాష్ (వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే) 98481 28844 -
జైపాల్‌రెడ్డి పరమశుంఠ: అడుసుమిల్లి
విజయవాడ: సీమాంధ్ర ప్రాంత నాయకులను శుంఠలుగా అభివర్ణించిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి పరమశుంఠ అని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ ఒక ప్రకటనలో విమర్శించారు. మహానుభావులైన పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు తదితరులు పుట్టిన ప్రాంతంలో శుంఠలు పుట్టారని జైపాల్ వ్యాఖ్యానించటాన్ని ఆయన తప్పుపట్టారు. మహనీయులు మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు.. వంటివారు పుట్టిన గడ్డపై జైపాల్‌రెడ్డి చెడపుట్టారని విమర్శించారు. ఒకవిధంగా ఆయన తెలంగాణ ప్రాంత మహానుభావులను కూడా శుంఠలుగా అభివర్ణించినట్లేనని పేర్కొన్నారు. లోక్‌సభలో దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ.. జైపాల్‌రెడ్డిని ఉద్దేశించి ఆయనకు మనోవైకల్యం సిద్ధించిందని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఇప్పటివరకూ జైపాల్‌రెడ్డి మేధావి వర్గానికి చెందిన వ్యక్తి అని ప్రజలు భావిస్తున్నారని, ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే రాజీవ్‌గాంధీ చెప్పింది నిజమే అనిపిస్తోందని పేర్కొన్నారు. పదవులకోసం కాళ్లుపట్టుకునే జైపాల్‌రెడ్డి ఇప్పుడు సోనియాగాంధీ కాళ్లు పట్టుకుని దేబిరిస్తున్నారని విమర్శించారు. అదే ప్రాంతానికి చెందిన వి.హనుమంతరావు, మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్ తదితరులంతా ఒకేగాటికి చెందినవారని పేర్కొన్నారు. -
జీర్ణించుకోలేకే జగన్‌పై విమర్శలు: అడుసుమల్లి
హైదరాబాద్: సమైక్య నినాదాన్ని జగన్మోహన్రెడ్డి బలంగా వినిపించడం జీర్ణించుకోలేకనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎంపీ రాజగోపాల్ విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాష్ ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. చంద్రబాబుకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం చేతకాదని.. రాజగోపాల్‌లో ఢిల్లీ వీధులలో రాజకీయ డ్రామాలు ఆడడమే పనిగా ఆయన పేర్కొన్నారు. జగన్ సమైక్య వాదనకు సీమాంధ్ర ప్రజలు స్పందిస్తున్న తీరు చూసి వచ్చే ఎన్నికల్లో తమకు పుట్టగతులుండవనే భయంతో నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు పరోక్షంగా తాము అందిస్తున్న సహకార బండారం బయటపడుతుంనే భయంతో పసలేని పదాలు ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు ఉండే టీఎంసీ, అన్నాడీఎంకే, జేడీయూ, డీఎంకే, బీజేడీ, సమాజ్‌వాదీ, అకాలీదళ్ పార్టీలనే కాకుండా యూపీఏ భాగస్వామి అయిన శరద్‌పవార్ కూడా రాష్ట్ర విభజన పట్ల తన వైఖరిని మార్చుకునేలా జగన్మోహన్రెడ్డి మద్దతు కూడగట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత విభజన విధానాన్ని అడ్డుకుంటామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయరు, చేసేవారిని హర్షించలేని మనస్తత్వం ఆ ఇద్దరి నేతలదని దుయ్యబట్టారు. -
అవును... అమ్ముడుపోయారు
సందర్భం అడుసుమిల్లి జయప్రకాష్, మాజీ శాసన సభ్యులు తెలుగు జాతి మానమర్యాదల ను ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దగ్గర తాకట్టు పెట్టిన సీమాంధ్ర ప్రాం త మంత్రులు ఇప్పుడు కొత్తగా అవిశ్వాస డ్రామా ఆడిస్తున్నారు. దాదాపు పదేళ్లుగా కేంద్ర మంత్రి మండలిలో ఏదో ఒక స్థాయిలో అధికారం అనుభవిస్తున్న ఈ మంత్రుల వల్ల ఆంధ్ర ప్రాంతా నికి ఏమైనా ఒరిగిందా? ఒక్క కొత్త ప్రాజెక్టు తీసుకురాగలిగారా! సోనియా గాంధీ వెంట తిరుగుతూ ఆమె ప్రసంగాలను అనువదించిన వారికి కూడా ఆమె ఎటువంటి వాగ్దానాలు ఎక్కడెక్కడ చేసిందో గుర్తులేదా. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణ నలోకి తీసుకుంటాం’ అన్నదే నాడు సోనియా చెప్పిన మాట. ఆ సమావేశం వెంటనే విజయవాడలో మరో సభ జరిగింది. ఆ సభలో బందరు పోర్టును అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చింది. 2004లో స్పష్టంగా ఇవ్వని తెలం గాణ హామీ కోసం ఆ ప్రాంత నాయకులు అంతగా ఒత్తిడి తెచ్చి సాధించుకుంటే, ఈ ప్రాంతానికి చేసిన వాగ్దానం సంగతే మిటని విజయవాడ ఎంపీ ఎందుకు అడగడు? ఎన్టీఆర్, ఆయన ఆశయాల గురించి మాట్లాడే పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదనను తన తండ్రి అంగీ కరించేవాడా! అని ఒక్కసారి ఆయినా ఆలోచించారా? తెలుగు జాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ పాటు పడిన తీరు ఏ మాత్రం గుర్తున్నా సీడబ్ల్యూసీ తీర్మానం జరిగిన మరు క్షణమే ఆమె మంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాల్సింది. కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ, చెల్లని రూపాయికే గీతలెక్కువ అన్నాడు ఒక సినీ కవి. అది సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవికి చక్కగా అబ్బుతుంది. చిరంజీవికి మంత్రి పదవి మీదున్న మక్కువ తెలుగు గడ్డమీద లేదని అర్థమవుతున్నది. మంత్రి పదవి రానంతవరకు కావూరి సాంబశివరావు నోటి వెంట వచ్చిన మాటలు, చివరికి తన కులానికి కాంగ్రెస్‌లో అన్యా యం జరుగుతున్న వైనం గురించి బహిరంగంగా కన్నీరు కార్చిన సంఘటనలు ఆయన మానసిక స్థితి మీద అను మానం కలిగించేవిగా ఉన్నాయి. అదే కావూరి కేంద్ర మంత్రి అవగానే ‘అపరిచితుడు’గా మారిపోయాడు. సీమాంధ్ర ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్న వా రికి ఆంధ్రప్రదేశ్ విభజన గురించి ముందుగా తెలియ దంటే నమ్మేంత అమాయకులు కారు ఆంధ్రులు. కొత్త రాష్ట్రం ఏర్పడగానే దానికి తొలి ముఖ్యమంత్రిగా నన్ను చేస్తే ఉద్యమాలను సర్దుబాటు చేయగలనని బొత్స సత్తి బాబు చల్లగా చెప్పివచ్చాడు. ఇక వయసు మళ్లిన కావూరికి గవర్నర్ పదవి, ఈ ప్రాంతంలో రెండు ప్రముఖ సామాజిక వర్గాల నేతలుగా చిరంజీవి, పురంధేశ్వరిలకు కేబినెట్ మంత్రి పదవిని మాట్లాడుకున్నారు. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈ నాటికి కొత్త హోదాలలో వీరంతా సీమాంధ్ర వీధుల్లో తిరుగుతుండేవారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు ఆధారం ఏమిటన్న ఒక్క ప్రశ్నను కేంద్ర మంత్రి వెయ్యలేరా? సెంటిమెంట్ ఆధా రంగా రాష్ట్రాలు ఇచ్చిన సందర్భం ఉందా? తెలంగాణ ఉద్యమం అరవయ్యేళ్లదైతే, వందేళ్ల గూర్ఖాల్యాండ్ సంగతే మిటని ఎదురు ప్రశ్న వేయలేరా? అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఎందుకు విభజించాలి? ఒకవేళ విభజించాల్సి వస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్నే ఎందుకు విభజిస్తున్నారని నిల దీయలేరా! తెలుగు జాతిని చీల్చే బాధ్యతను చుట్టూ ఉన్న తమిళ (చిదంబరం, నారాయణస్వామి), కన్నడ (జయ రామ్ రమేష్, మెయిలీ), మలయాళ (ఏకే ఆంటోనీ), మరాఠీ (షిండే)ల చేతిలో పెడితే, ఇదేమిటని ఒక్కసారైనా అడిగారా! హైకమాండ్ నిర్ణయం తీసుకుంది, విభజన ఆపలేం, ఆర్టికల్-3 ప్రకారం ఆ హక్కు పార్లమెంట్‌ది అం టూ ప్రకటనలు చేస్తున్న కేంద్రమంత్రులు జేడీ శీలం, పన బాక లక్ష్మి, చిరంజీవి, కిషోర్ చంద్రదేవ్‌లకు తెలుగు వారి ఆక్రందనలు వినబడటం లేదా! తెలంగాణ ప్రాంతంలో 15 సీట్ల కోసం ఒక భాషా జాతిని చీలుస్తున్నా కూడా పార్టీని ప్రశ్నించలేని అశక్తులా? కేంద్రం భారీ ప్యాకేజీ సీమాంధ్రకు ఇచ్చేలా పట్టుపడతాం అని మరో కేంద్ర మం త్రి అంటాడు. నాలుగు నెలలు ఆగితే ఈ ప్రధాని ఉం డడు, కాంగ్రెస్ పార్టీకే దిక్కులేదు. వంద రోజులకు మించి అధికారంలో ఉండని పార్టీ రాబోయే పదేళ్లలో ప్రతి ఏటా రూ.10 వేల కోట్లు ఇచ్చి రాజధానిని నిర్మిస్తామని వాగ్దానం చేయడం ఎవరిని మోసగించేందుకు? ఇవి వ్యక్తిగత కక్షతో అంటున్న మాటలు కాదు. తెలుగుజాతికి జరుగుతున్న అవమానం చూసి తట్టుకోలేక వస్తున్న మాటలు. ఇది చాలా సున్నితమైన భాష. ఇంత కన్నా కటువైన పదాలతో తిట్టాలి. కాని తెలుగు జాతిని అవమానించడంలో మీరు దిగజారినంతగా తెలుగు ప్రజలు దిగజారదలుచుకోలేదు. ఇప్పటికైనా మేల్కొనండి. నిద్రా నాటకం నుండి బయటకు రండి. హైకమాండ్‌ని ధిక్కరించండి. తెలుగు జాతి ప్రతిష్ట కోసం తిరగబడితే, మీ చేతికి పార్టీ వేసిన సంకెళ్లు పోతా యే తప్ప మరే నష్టం జరగదు. -
కాంగ్రెస్‌తో బీజేపీ కలవటం బాధాకరం: అడుసుమిల్లి
హైదరాబాద్: రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీతో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కూడా పోటీపడటం బాధాకరమని విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రాంతంలో నాలుగు సీట్లకు ఆశపడి కాంగ్రెస్‌తో చేతులు కలిపి బీజేపీ రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడవటం గర్హనీయమని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో వ్యవహరిస్తున్న తీరునే భవిష్యత్‌లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కేంద్రం అనుసరించే ప్రమాదం ఉందని అడుసుమిల్లి హెచ్చరించారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం గుర్తించాలని సూచించారు. రాష్ట్ర విభజన విషయంలో శాసనసభ తీర్మానం తరువాతే ముందుకు వెళ్లాలన్నారు. రాష్ట్ర శాసనసభకు విలువలేదన్నట్లుగా ఫెడరల్ వ్యవస్థను తుంగలో తొక్కటం, దేశ సమగ్రత, ఐక్యతను భంగం కలిగించేలా కేంద్ర ప్రభుత్వ పెద్దన్న పెత్తనం దేశ రాజ్యాంగానికే పెను సవాల్ అని ఆందోళన వ్యక్తం చే శారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్షిండేని వెంటనే బర్తరఫ్ చేసి రాష్ట్ర విభజనకు అనుసరిస్తున్న ప్రక్రి యను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. -
ఈటెల, హరీష్‌పై కేసులుపెట్టాలి: అడుసుమిల్లి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రతీకార దాడులుంటాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం’ అని బాహాటంగా ప్రకటిం చిన టీఆర్ఎస్ శాసనసభాపక్షనేత ఈటె ల రాజేందర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే, సమైక్యాం ధ్ర ఉద్యమ నాయకుడు అడుసుమిల్లి జయప్రకాష్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సహకారం లేకపోతే ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ జరిగేది కాదన్న హరీష్‌రావు వ్యాఖ్యలపైనా ఆగ్రహం వెలిబుచ్చారు. వీరిద్దరిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయకుంటే హైకోర్టుకు వెళతానని ఆదివారం తెలిపారు. -
రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన ప్రకటనపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అడుసుమిల్లి జయప్రకాష్ ఉన్నత ధర్మాసనంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. రెండో ఎస్సార్సీ ద్వారానే కొత్త రాష్ట్రాలు ఏర్పడాలని ఆయన తన పిటిషన్లో కోరారు. అలాగే రాష్ట్ర విభజన అంశంపై శాసనసభలో విధిగా ఆమోదం పొందేలా చూడాలని అడుసుమిల్లి తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది పివి కృష్ణయ్య ఈ పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించి సుప్రీంకోర్టు సోమవారం నుంచి వాదనలు విననుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 అమలులో ఉన్నందువల్ల రాష్ట్ర విభజన సాధ్యం కాదని పిటిషనర్ వాదించారు. -
‘హైకోర్టు’ వ్యాజ్యాలపై విచారణ వాయిదా
ప్రతివాది అభ్యర్థనను అంగీకరించిన సుప్రీం ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చోటు చేసుకున్న పరిణామాలు, ఘటనలపై దాఖలైన రిట్ పిటిషన్, కోర్టు ధిక్కార వ్యాజ్యంపై విచారణను సుప్రీం కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై సోమవారం తుది విచారణ జరగాల్సివుండగా, ప్రతివాదుల తరఫు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది. హైకోర్టు ఆవరణలో జరిగిన ఘటనలు, జేఏసీ న్యాయవాదుల తీరుపై హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది పి.వి.కృష్ణయ్య వేసిన రిట్ పిటిషన్, అలాగే హైకోర్టు కార్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సహా పలువురు నేతలపై మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ వేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యం జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ, జస్టిస్ వి.గోపాలగౌడతో కూడిన ధర్మాసనం ఎదుట సోమవారం విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా కృష్ణయ్య పిటిషన్‌లోని ప్రతివాదుల తరఫు న్యాయవాది తమ వాదనలకు ఆరు వారాల సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. అంత సమయం ఇవ్వలేమంటూ జస్టిస్ సింఘ్వీ కేవలం 4 వారాల గడువును మంజూరు చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.