‘అందువల్లే చంద్రబాబుకు ఈనాడు, జ్యోతి భజన చేస్తున్నాయి’ | Adusumilli Jayaprakash Sensational Comments Over Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబును అరెస్ట్‌ చేసినా.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు’

Published Wed, Sep 20 2023 12:44 PM | Last Updated on Wed, Sep 20 2023 6:53 PM

Adusumilli Jayaprakash Sensational Comments Over Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు కళ్లు బైర్లు కమ్మే వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్‌. కేవలం కమ్మ కులంలోనే కొందరు మాత్రమే చంద్రబాబుకు సపోర్టు ఇస్తున్నారని అన్నారు. అలాగే, బాబును భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్‌ కమ్మ కులానికి చెందినవారివేనని, అందుకే వీరంతా చంద్రబాబు ఏం చేసినా మద్దతిస్తూ డప్పులు వాయిస్తారని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు..
విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్‌ తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. "నేను కమ్మ కులస్థుడినే. మా కులం వారు మిగతా కులం నుంచి దూరమై ఒంటరైపోయారు. చంద్రబాబు అరెస్ట్‌ జరిగిన తర్వాత ఆయనకు మద్దతు ఇస్తున్న వారు కేవలం మా కులానికి చెందినవారే. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు. ఇప్పటిదాకా అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ వచ్చాడు. చంద్రబాబు ఐటీ ఇండస్ట్రీని తెచ్చాడు అనేది కేవలం మా కమ్మోళ్ల ప్రచారం మాత్రమే. ఇప్పటివరకు ఐటీకి బాబు చేసిందేమీ లేదు. 

లోకేష్‌ది పాదయాత్ర కాదు.. డబ్బు యాత్ర.. 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసి తీసుకువస్తుంటే పట్టించుకున్న వ్యక్తి ఒక్కరు కూడా లేరు. అమరావతిలో రాజధాని ఉద్యమం లేదు.. ఏమీ లేదు. కేవలం మూడు, నాలుగు ఊర్లలోనే కొందరు అల్లరి చేస్తున్నారు. అమరావతిలో పచ్చని భూములను చంద్రబాబు నాశనం చేశాడు. నారా లోకేశ్‌ యాత్ర అంతా డబ్బులతోనే నడిచింది. టీడీపీకి మద్దతు ఇచ్చే స్థితిలో ప్రజలెవ్వరూ లేరు. 

ప్రజల మద్దతు సీఎం జగన్‌కే..
వైఎస్సార్‌సీపీని ఏ పార్టీ ఏమీ చేయలేదు. ఏపీలో టీడీపీ, జనసేన కలిసినా వైఎ‍స్సార్‌సీపీకి ఫుల్‌ మెజార్టీ వస్తుందని నా దగ్గరున్న సర్వేలు చెబుతున్నాయి. మా కులం వాళ్లు తప్పిస్తే మిగతా కులాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పూర్తి మద్దతు ఉంది. సీఎం జగన్‌ మాట మీద నిలబడతారు. నిజాయతీ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో వాలంటీర్‌ వ్యవస్థ చాలా బాగుంది. సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని అన్నారు.  

ఇది కూడా చదవండి: ‘స్కిల్‌’ స్కామ్‌ కేసు: ప్రజాధనాన్ని లూటీ చేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement