Kamma community
-
టీకాంగ్రెస్‌లో పాలి‘ట్రిక్స్’.. కమ్మ కులంతో కొత్త రాజకీయం!
తెలంగాణలో కమ్మ సామాజికవర్గం ప్రతినిధిగా తనను తాను ఫోకస్ చేసుకోవడానికి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఆమె కాంగ్రెస్ అధిష్టానం వద్దకు కమ్మ జేఏసీ నేతలను కొందరిని తీసుకువెళ్లారు. అక్కడ వచ్చే శాసనసభ ఎన్నికలలో కమ్మ వర్గానికి పన్నెండు సీట్లను కాంగ్రెస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1982లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్పాలి. 1983కి ముందు కమ్మ వర్గం కూడా కాంగ్రెస్‌తోనే ఉందని గణాంకాలు చెబుతాయి. తదుపరి తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజికవర్గం ఆధిపత్యంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉన్నట్లు లెక్కలు వెల్లడిస్తాయి. ఆయా ఎన్నికలలో ఇతర సామాజికవర్గాలను ఎవరు ఆకర్షించగలిగితే ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది. రెడ్డి సామాజికవర్గం ఆంధ్ర, తెలంగాణలో రెండు చోట్ల ప్రాముఖ్యత కలిగి ఉంది. కమ్మ వర్గం ప్రధానంగా ఆంధ్రకే పరిమితమైందని చెప్పాలి. రెడ్డి వర్గం ప్రతీ ఎన్నికలోనూ రెండు ప్రాంతాలలో కలిపి సుమారు ఎనభై నుంచి తొంభై మంది ఎమ్మెల్యేలుగా గెలుస్తుంటే, కమ్మ వర్గం అత్యధికంగా ఆంధ్రలోనే గెలుస్తోంది. రెండు ప్రాంతాలలో కలిపి వీరు అత్యధికంగా 1994లో 53మంది, అత్యల్పంగా 2018లో తెలంగాణలో ఐదుగురు, 2019లో ఏపీలో పదిహేడు మంది అంటే రెండు రాష్ట్రాలలో కలిపి ఇరవై రెండు మంది గెలిచారు. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 38 మంది, ఉమ్మడి ఏపీలో 2009లో 27, 2004లో 35, 1999లో 43, 1994లో 53, 1989లో 36, 1985లో 52, 1983లో 51, 1978లో 41, 1972లో 35, 1967లో 41, 1962లో 39 మంది గెలిచారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కమ్మ వర్గం 1985లో అత్యధికంగా ఎనిమిది మంది నెగ్గారు. మిగిలిన ఎన్నికలలో రెండు నుంచి ఏడుగురు వరకు మాత్రమే గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కూడా టీడీపీ ఉనికిని నిలబెట్టడానికి ఈ వర్గం యత్నించింది. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుతో మొత్తం పార్టీ ఇక్కడ కకావికలం అయింది. దాంతో కమ్మ వర్గం వారు ఏ పార్టీకి అధికారం వస్తే అటువైపు మొగ్గు చూపడానికి అధికంగా ఇష్టపడుతన్నట్లు అనిపిస్తుంది. గత రెండు ఎన్నికలలో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్ ) పాలన పగ్గాలు చేపట్టగా, కమ్మ వర్గం ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినా అంతా టీఆర్ఎస్లో చేరిపోయారు. రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి కొందరు టీఆర్ఎస్లో చేరినా, పూర్తిగా ఆ పార్టీకి దూరం కాలేదు. 2018 ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకోవడంతో కమ్మవర్గం నేతలు కూడా ఆ బాట పట్టారు. కానీ, పెద్దగా ఫలితం సాధించలేకపోయారు. టీఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ఐదుగురు కమ్మ అభ్యర్దులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. చివరికి దివంగత టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనుమరాలు, మాజీ మంత్రి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్పల్లి నుంచి పోటీచేసి ఘోర పరాజయం చెందారు. ఏ వర్గం వారైనా కేవలం కులం ఆధారంగానే గెలవరని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. టీడీపీ సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. దానికి తోడు విభజిత ఆంధ్రలో అప్పటికే చంద్రబాబుపై ఏర్పడిన విపరీతమైన వ్యతిరేకత కూడా చాలా ప్రభావం చూపింది. 2014లో టీఆర్ఎస్ నుంచి ఒక్క కమ్మ అభ్యర్ధి గెలుపొందలేదు. ఇద్దరు టీడీపీ నుంచి, ఇద్దరు కాంగ్రెస్ నుంచి, ఒకరు బీఎస్పీ నుంచి విజయం సాధించారు. తదుపరి కాలంలో వీరంతా టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. ఆ తర్వాత ఒక ఉప ఎన్నిక ద్వారా మరో కమ్మ నేత టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడు పరిశీలిస్తే 2009లో తెలంగాణలో ముగ్గురు గెలవగా వారిలో ఇద్దరు టీడీపీ, ఒకరు లోక్‌సత్తాకు చెందినవారు. 2004లో కూడా ఈ వర్గం వారు ముగ్గురే గెలిచారు. ఒకరు కాంగ్రెస్ నుంచి, ఇద్దరు ఇతరులు కావడం విశేషం. టీడీపీ నుంచి ఎవరూ గెలవలేదు. 1999లో టీడీపీ పక్షాన ముగ్గురు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఎవరూ గెలవలేదు. 1994లో ఆరుగురు విజయం సాధించగా, టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ ఒకరు, ఇతరులు ఒకరు గెలిచారు. 1989లో ముగ్గురు గెలిస్తే టీడీపీ నుంచి ఒకరు, ఇద్దరు ఇతర పార్టీలవారు. 1985లో మొత్తం ఎనిమిది మందికి గాను, ఆరుగురు టీడీపీ, ఇద్దరు టీడీపీ కూటమిలోని ఇతర పార్టీలవారు. తెలంగాణ చరిత్రలో ఈ ఎన్నికలోనే కమ్మ వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవడం విశేషం. 1983లో గెలిచిన ఏడుగురు కమ్మ ఎమ్మెల్యేలు టీడీపీవారే. ఎన్టీరామారావు ప్రభంజనం వీయడంతో వీరు విజయం సాధించారు. అంతకుముందు 1978 ఎన్నికలలో కమ్మ వర్గం వారు ఐదుగురు, 1972, 1967లలో నలుగురు 1962లో ఇద్దరు గెలుపొందారు. స్థూలంగా చూస్తే తెలంగాణ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం ఎప్పుడూ పెద్ద బలంగా లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ వర్గం ఓన్ చేసుకోవడానికి యత్నించింది. అది కొంతకాలం బాగానే సాగినా, ఆ తర్వాత అది నెగిటివ్ గా మారుతోంది. ప్రత్యేకించి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కమ్మ సామాజికవర్గం వారు ఎక్కువ శాతం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న భావనతో ఇతర వర్గాలవారు ఆ పార్టీకి దూరమయ్యారు. తాజా పరిణామాలలో కమ్మ ఓటర్లను పోలరైజ్ చేయడానికి రేణుకా చౌదరి వంటివారు యత్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ వర్గం సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటమే కారణం. నిజంగానే కమ్మ వర్గానికి అంత బలం ఉంటే చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకే మద్దతు ఇవ్వవచ్చు కదా! అలా చేయడం లేదంటే కారణం అర్ధం చేసుకోవచ్చు. అయినా రేణుక వంటివారు కమ్మ వర్గాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీలో అవినీతి కేసు నమోదై, ఆయన జైలుకు వెళితే దానిని కమ్మ సామాజికవర్గంపై దాడిగా ఆమె ప్రచారం చేసింది. ఎందుకైనా మంచిదని ఇతర పార్టీలవారు కూడా అదే బాటలో మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడిపోయిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఆ వర్గం వారిని కాంగ్రెస్‌కు అంటగట్టడానికి యత్నిస్తున్నాయి. నిజానికి ఆ వర్గం కానీ, ఆయా సెటిలర్ వర్గాలుగానీ కొంత కాలం క్రితం వరకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయం ఉంది. కానీ, చంద్రబాబు అరెస్టు ఉదంతం తర్వాత కమ్మ వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించడానికి వ్యూహాలు పన్నుతున్నారు. నిజానికి ఏ కులం వారైనా తమ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు ఇవ్వవచ్చు. కానీ, ఒక భావజాలాన్ని వ్యాప్తిలోకి తెచ్చి కమ్మవారు ఫలానా పార్టీకి అనుకూలం అనుకోవాలనేది కొందరి వ్యూహం. రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాలో తనకు, అనుయాయులకు టిక్కెట్లు ఇప్పించుకోవడానికి కులం కార్డు ఉపయోగిస్తున్నారు. నలభై నియోజకవర్గాలలో కమ్మ వర్గం గణనీయంగా ఉందని, ముప్పై చోట్ల గెలుపు, ఓటములు నిర్ణయించే దశలో ఉందని, పది చోట్ల విజయావకాశాలు కలిగి ఉందని కమ్మ ఐక్యవేదిక కాంగ్రెస్ అధినాయకత్వానికి వివరించింది. వీటిలో ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసరాలలోనివి కాగా, కొన్ని నిజామాబాద్, నల్గొండ జిల్లాలలోనివి. జూబ్లిహిల్స్, శేరీలింగంపల్లి, కూకట్పల్లి, కుత్చుల్లాపూర్, మేడ్చల్, ఖమ్మం, మల్కాజిగిరి, కొత్తగూడెం, కోదాడ, పాలేరు మొదలైన చోట్ల టిక్కెట్లను ఆశిస్తున్నట్లు ఈ వేదిక తెలిపింది. ఒకరకంగా ఇది కులం పేరు చెప్పుకుని కొందరు ఆయా పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఏ సామాజికవర్గం వారికైనా వారి సత్తాను బట్టి పార్టీలు టిక్కెట్లు ఇస్తాయి. కాకపోతే కమ్మ వర్గం కొంత ఆర్ధిక బలం కూడా కలిగి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. టీఆర్ఎస్ కమ్మ వర్గానికి చెందిన ఐదుగురికి టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్ అంతకు మించి ఇస్తుందా అన్నది సందేహమే. ఈ వర్గం నేతల హడావుడి కారణంగా, కాంగ్రెస్ హై కమాండ్ బీసీ వర్గం నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. అది ఆ పార్టీకి తలనొప్పి అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదేదో కమ్మ వర్గం వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వకపోతే నష్టం అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది. పైగా ఇతర వర్గాలలో అపోహలు పెరిగే అవకాశం ఉండవచ్చు. అసలే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికీ చంద్రబాబుకు సన్నిహితుడన్న ప్రచారం ఉండగా, ఆయనను రేణుకా చౌదరి వంటివారు ఇలాంటి వివాదాలలోకి తీసుకు వెళ్లకుండా ఉంటేనే పార్టీకి ప్రయోజనం అని చెప్పాలి. ఏది ఏమైనా గత అరవైఐదేళ్ల తెలంగాణ ఎన్నికల చరిత్రను చూస్తే కమ్మ సామాజికవర్గం అంత ప్రభావశీలిగా లేదనే చెప్పాలి. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేయడంలో భాగంగా ఏ పార్టీ అయినా ఇతర కులాలతో పాటు కమ్మవారు కొందరికి కూడా టిక్కెట్లు ఇస్తాయి. కానీ, అదే సమయంలో ప్రత్యేకించి రాష్ట్ర విభజన నేపధ్యంలో ఒక గ్రూపు తయారై అనవసరంగా రాజకీయాలు చేస్తూ ఆ వర్గం వారికి అప్రతిష్ట తేకుండా ఉంటే అదే పదివేలు అని చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్. -
రేణుకమ్మల పోలరైజ్ పాలిటిక్స్
కొమ్మినేని శ్రీనివాసరావు : తెలంగాణలో కమ్మ సామాజికవర్గ ప్రతినిధిగా తనను తాను ఫోకస్ చేసుకోవడానికి కాంగ్రెస్‌నేత రేణుకాచౌదరి చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఆమె కాంగ్రెస్ అధిష్టానం వద్దకు కొందరు కమ్మ జేఏసీ నేతలను తీసుకెళ్లారు. వచ్చే అసెంబ్లీఎన్నికల్లో కమ్మ వర్గానికి పన్నెండు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1982లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్పాలి. 1983కు ముందు కమ్మవర్గం కాంగ్రెస్‌తోనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. తదుపరి టీడీపీ కమ్మ సామాజికవర్గం ఆధిపత్యంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యంలో ఉన్నట్టు లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఆయా ఎన్నికల్లో ఇతర సామాజిక వర్గాలను ఎవరు ఆకర్శించగలిగితే ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది. రెడ్డి సామాజికవర్గం ఆంధ్ర, తెలంగాణలలో రెండు చోట్ల ప్రాముఖ్యత కలిగి ఉంది. కమ్మ వర్గం ప్రధానంగా ఆంధ్రకే పరిమితమైందని చెప్పాలి. రెడ్డి వర్గం ప్రతి ఎన్నికలోనూ రెండు ప్రాంతాల్లో కలిపి సుమారు ఎనభై నుంచి తొంభైమంది ఎమ్మెల్యేలుగా గెలుస్తుంటే.. కమ్మవర్గం అత్యధికంగా ఆంధ్రలోనే గెలుస్తోంది. రెండు ప్రాంతాల్లో కలిపి వీరు అత్యధికంగా 1994లో 53 మంది, అత్యల్పంగా 2018లో తెలంగాణలో ఐదుగురు, 2019లో ఏపీలో పదిహేడు మంది అంటే రెండు రాష్ట్రాలలో కలిపి ఇరవై రెండు మంది గెలిచారు. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 38 మంది.. ఉమ్మడి ఏపీలో 2009లో 27, 2004లో 35, 1999లో 43, 1994లో 53 , 1989లో 36, 1985లో 52, 1983లో 51, 1978లో 41, 1972లో 35, 1967లో 41, 1962లో 39 మంది గెలిచారు. అయితే ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కమ్మ వర్గం నుంచి 1985లో అత్యధికంగా ఎనిమిది, మిగతా ఎన్నికల్లో రెండు నుంచి ఏడుగురు వరకు మాత్రమే గెలిచారు. ఎవరు అధికారంలోకి వస్తే.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోనూ టీడీపీ ఉనికిని నిలబెట్టడానికి కమ్మ వర్గం యత్నించింది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుతో ఇక్కడ మొత్తం పార్టీ కకావికలమైంది. దీంతో కమ్మవర్గం వారు ఏ పార్టీకి అధికారం వస్తే అటువైపు మొగ్గు చూపడానికి అధికంగా ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్ ) పాలన పగ్గాలు చేపట్టగా... కమ్మవర్గం ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినా అంతా బీఆర్ఎస్లో చేరిపోయారు. రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి కొందరు టీఆర్ఎస్లో చేరినా, పూర్తిగా ఆ పార్టీకి దూరం కాలేదు. 2018 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో కమ్మవర్గం నేతలు కూడా ఆ బాట పట్టారు. కానీ పెద్దగా ఫలితం సాధించలేకపోయారు. టీఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ఐదుగురు కమ్మ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. చివరికి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనుమరాలు, మాజీ మంత్రి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్పల్లి నుంచి పోటీచేసి ఘోర పరాజయం పొందారు. ఏ వర్గం వారైనా కేవలం కులం ఆధారంగానే గెలవరని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. టీడీపీ సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలవడాన్ని చాలామంది జీర్ణిం చుకోలేకపోయారు. దానికి తోడు విభజిత ఆంధ్రలో అప్పటికే చంద్రబాబుపై ఏర్పడిన విపరీతమైన వ్యతిరేకత కూడా ప్రభావం చూపింది. 2014లో టీఆర్ఎస్ నుంచి ఒక్క కమ్మ అభ్యర్థి గెలుపొందలేదు. ఇద్దరు టీడీపీ నుంచి, ఇద్దరు కాంగ్రెస్ నుంచి , ఒకరు బీఎస్పీ నుంచి విజయం సాధించారు. తదుపరి కాలంలో వీరంతా టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. తర్వాత ఒక ఉప ఎన్నిక ద్వారా మరో కమ్మ నేత టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణలో పెద్దగా బలంగా లేకున్నా.. ఉమ్మడి ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడు పరిశీలిస్తే... 2009లో తెలంగాణలో ముగ్గురు గెలవగా, వారిలో ఇద్దరు టీడీపీ, ఒకరు లోక్‌సత్తాకు చెందినవారు. 2004లోనూ ఈ వర్గం వారు ముగ్గురే గెలిచారు. ఒకరు కాంగ్రెస్ నుంచి, ఇద్దరు ఇతరులు కావడం విశేషం. టీడీపీ నుంచి ఎవరూ గెలవలేదు. 1999లో టీడీపీ పక్షాన ముగ్గురు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఎవరూ గెలవలేదు. 1994లో ఆరుగురు విజయం సాధించగా.. టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇతరులు ఒకరు గెలిచారు. 1989లో ముగ్గురు గెలిస్తే టీడీపీ నుంచి ఒకరు, ఇద్దరు ఇతర పార్టీలవారు. 1985లో మొత్తం ఎనిమిది మందికిగాను ఆరుగురు టీడీపీ, ఇద్దరు టీడీపీ కూటమిలోని ఇతర పార్టీలవారు. తెలంగాణ చరిత్రలో ఈ ఎన్నికలోనే కమ్మ వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవడం విశేషం. 1983లో గెలిచిన ఏడుగురు కమ్మ ఎమ్మెల్యేలు టీడీపీ వారే. ఎన్.టి.రామారావు ప్రభంజనం వీయడంతో వీరు విజయం సాధించారు. అంతకుముందు 1978 ఎన్నికలలో కమ్మ వర్గం వారు ఐదుగురు, 1972, 1967లలో నలుగురు 1962లో ఇద్దరు గెలుపొందారు. స్థూలంగా చూస్తే తెలంగాణ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం ఎప్పుడూ పెద్ద బలంగా లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ వర్గం ఓన్ చేసుకోవడానికి యత్నించింది. అది కొంతకాలం బాగానే సాగినా.. తర్వాత అది నెగిటివ్‌గా మారుతోంది. ప్రత్యేకించి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం వారు ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న భావనతో ఇతర వర్గాలవారు ఆ పార్టీకి దూరమయ్యారు. ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పడానికే.. తాజా పరిణామాలలో కమ్మ ఓటర్లను పోలరైజ్ చేయడానికి రేణుకాచౌదరి వంటివారు యత్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ వర్గం సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటమే కారణం. నిజంగానే కమ్మ వర్గానికి అంత బలముంటే చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకే మద్దతు ఇవ్వవచ్చు కదా! అలా చేయడం లేదంటే కారణం అర్థం చేసుకోవచ్చు. అయినా రేణుక వంటివారు కమ్మ వర్గాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీలో అవినీతి కేసు నమోదై జైలుకు వెళితే దానిని కమ్మ సామాజికవర్గంపై దాడిగా ఆమె ప్రచారం చేసింది. ఎందుకైనా మంచిదని ఇతర పార్టీలవారు కూడా అదే బాటలో మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడిపోయిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఆ వర్గం వారిని కాంగ్రెస్‌కు అంటగట్టడానికి యత్నిస్తున్నాయి. నిజానికి ఆ వర్గం కానీ, ఆయా సెటిలర్ వర్గాలుగానీ కొంతకాలం క్రితం వరకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయముంది. కానీ చంద్రబాబు అరెస్టు తర్వాత కమ్మ వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించడానికి కొందరు వ్యూహాలు పన్నుతున్నారు. నిజానికి ఏ కులం వారైనా తమ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు ఇవ్వొచ్చు. కానీ ఒక భావజాలాన్ని వ్యాప్తిలోకి తెచ్చి, కమ్మవారు ఫలానా పార్టీకి అనుకూలం అనుకోవాలనేది వారి వ్యూహం. రేణుకాచౌదరి ఖమ్మం జిల్లాలో తనకు, తనవారికి టికెట్లు ఇప్పించుకోవడానికి కులం కార్డు ఉపయోగిస్తున్నారు. నలభై నియోజకవర్గాల్లో కమ్మ వర్గం గణనీయంగా ఉందని.. ముప్పై చోట్ల గెలుపోటములు నిర్ణయించే దశలో ఉందని, పది చోట్ల విజయావకాశాలు కలిగి ఉందని కమ్మ ఐక్యవేదిక కాంగ్రెస్ అధినాయకత్వానికి వివరించింది. వీటిలో ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసరాల్లోనివే కాగా.. కొన్ని నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోనివి. జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఖమ్మం, మల్కాజిగిరి, కొత్తగూడెం, కోదాడ, పాలేరు మొదలైన చోట్ల టికెట్లు ఆశిస్తున్నట్లు ఈ వేదిక తెలిపింది. ఒకరకంగా ఇది కులం పేరు చెప్పుకుని కొందరు ఆయా పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్‌కు నష్టం చేస్తుందా? ఏ సామాజికవర్గం వారికైనా వారి సత్తాను బట్టి పార్టీలు టికెట్లు ఇస్తాయి. కాకపోతే కమ్మ వర్గం కొంత ఆర్థిక బలం కూడా కలిగి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. టీఆర్ఎస్ కమ్మ వర్గానికి చెందిన ఐదుగురికి టికెట్లు కేటాయించింది. కాంగ్రెస్ అంతకు మించి ఇస్తుందా అన్నది సందేహమే. ఈ వర్గం నేతల హడావుడి కారణంగా కాంగ్రెస్ హైకమాండ్ బీసీవర్గం నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. అది ఆ పార్టీకి తలనొప్పి అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదేదో కమ్మ వర్గం వారికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వకపోతే నష్టం అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది. పైగా ఇతర వర్గాల్లో అపోహలు పెరిగే అవకాశం ఉండవచ్చు. అసలే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికీ చంద్రబాబుకు సన్నిహితుడన్న ప్రచారం ఉండగా.. ఆయనను రేణుకాచౌదరి వంటివారు ఇలాంటి వివాదాలలోకి తీసుకెళ్లకుండా ఉంటేనే పార్టీకి ప్రయోజనం అని చెప్పాలి. ఏది ఏమైనా అరవై ఐదేళ్ల తెలంగాణ ఎన్నికల చరిత్రను చూస్తే కమ్మ సామాజికవర్గం అంత ప్రభావశీలిగా లేదనే చెప్పాలి. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేయడంలో భాగంగా ఏ పార్టీ అయినా ఇతర కులాలతోపాటు కమ్మవారు కొందరికి కూడా టికెట్లు ఇస్తాయి. కానీ అదే సమయంలో ప్రత్యేకించి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక గ్రూపు తయారై అనవసరంగా రాజకీయాలు చేస్తూ ఆ వర్గం వారికి అప్రతిష్ట తేకుండా ఉంటే అదే పదివేలు అని చెప్పాలి. -
కాస్ట్ పాలిటిక్స్‌తో కాంగ్రెస్‌లో కంగారు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. నేడో రేపో షెడ్యూల్ రానున్న వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కుల రాజకీయాలు తెర మీదకు వస్తున్నాయి. ఓవైపు బీసీ నేతలు తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కాంగ్రెస్‌పై ఒత్తిడి చేస్తున్న వేళ.. తాజాగా తమ కులం తమకు సీట్లు కావాలని, తామూ పోటీ చేస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేతల్ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందర తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఐక్య వేదికలు ఒక తాటి మీదకు వచ్చాయి. ఎన్నికల్లో తమకూ ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని డిమాండ్‌ను లెవనెత్తాయి. దీనికి ఆ సామాజిక వర్గం నేతలు బహిరంగంగా మద్దతు ప్రకటించేశారు కూడా. తెలంగాణలో తమ బలం బాగానే ఉందని.. అవకాశం ఇస్తే 40 సీట్ల దాకా తెచ్చి చూపిస్తామని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు సదరు కమ్మ నేతలు. తాజాగా.. తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్య వేదిక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ని కలిసి లేఖ ఇచ్చింది. తమను గుర్తించి.. టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలంటూ లేఖలో కోరింది. సినీ, రాజకీయ పరిశ్రమల్లో సత్తా చాటుతున్న కమ్మ వాళ్లకు ఓటు అధికారంతో పాటు సీటు అధికారం కూడా ఇవ్వాల్సిందేనంటూ ఈ సందర్భంగా అక్కడ ఉన్న మాజీ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యానించడం గమనార్హం. చంద్రబాబు శిష్యుడి ద్వారానే.. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి తొలి నుంచి ట్రబుల్ మేకర్‌గా ఉన్నారనే వాదన ఒకటి ఉంది. ఎప్పుడైతే టీపీసీసీ చీఫ్ అయ్యారో.. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో లుకలుకలు తారాస్థాయికి చేరాయి. తన ఆధిపత్య ధోరణితో ఆయన తమనూ అణగదొక్కుతున్నారంటూ సీనియర్లు సైతం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా.. రేవంత్ సమర్థత కన్నా చంద్రబాబు శిష్యుడిగా ఆయన మీద పార్టీలో అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేతలే ఎక్కువగా ఉన్నారు. ఈ తరుణంలో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గ డిమాండ్‌పైనా రేవంత్ పేరు ప్రస్తావనకు వచ్చింది. తుమ్మల కాంగ్రెస్‌లో చేరిక వెనుక రేవంత్ ప్రముఖ పాత్ర పోషించారన్న టాక్ ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో.. కమ్మ నేతలు వాళ్ల సీట్ల ప్రయత్నాలు రేవంత్ ద్వారానే నెరవేర్చుకోవాలని భావిస్తున్నారట. తమ పాత పరిచయాలతో రేవంత్‌రెడ్డిని కలుస్తున్న కొందరు.. తమ సీట్లకు పార్టీ అధిష్టానాన్ని ఒప్పించే బాధ్యతను అప్పజెప్పినట్లు భోగట్టా. ఇది మిగతా కులాల నుంచి ఏమేర అభ్యంతరాలకు దారి తీస్తుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే!. కాంగ్రెస్ టిక్కెట్లు త్వరలోనే ఖరారు చేస్తారన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే అనేక మంది ఆశావహులు ఢిల్లీ బాట పట్టారు. అక్కడ స్క్రీనింగ్ కమిటీ పెద్దలతో పాు ఏఐసీసీ నేతలను కలసి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నారు. ఇప్పటికే టికెట్ల ఇష్యూ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ దశలో కులాలు, వర్గాల వారీగా రోజుకో కొత్త డిమాండ్ కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. -
‘అందువల్లే చంద్రబాబుకు ఈనాడు, జ్యోతి భజన చేస్తున్నాయి’
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు కళ్లు బైర్లు కమ్మే వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్. కేవలం కమ్మ కులంలోనే కొందరు మాత్రమే చంద్రబాబుకు సపోర్టు ఇస్తున్నారని అన్నారు. అలాగే, బాబును భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ కమ్మ కులానికి చెందినవారివేనని, అందుకే వీరంతా చంద్రబాబు ఏం చేసినా మద్దతిస్తూ డప్పులు వాయిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు.. విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. "నేను కమ్మ కులస్థుడినే. మా కులం వారు మిగతా కులం నుంచి దూరమై ఒంటరైపోయారు. చంద్రబాబు అరెస్ట్ జరిగిన తర్వాత ఆయనకు మద్దతు ఇస్తున్న వారు కేవలం మా కులానికి చెందినవారే. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు. ఇప్పటిదాకా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. చంద్రబాబు ఐటీ ఇండస్ట్రీని తెచ్చాడు అనేది కేవలం మా కమ్మోళ్ల ప్రచారం మాత్రమే. ఇప్పటివరకు ఐటీకి బాబు చేసిందేమీ లేదు. లోకేష్‌ది పాదయాత్ర కాదు.. డబ్బు యాత్ర.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి తీసుకువస్తుంటే పట్టించుకున్న వ్యక్తి ఒక్కరు కూడా లేరు. అమరావతిలో రాజధాని ఉద్యమం లేదు.. ఏమీ లేదు. కేవలం మూడు, నాలుగు ఊర్లలోనే కొందరు అల్లరి చేస్తున్నారు. అమరావతిలో పచ్చని భూములను చంద్రబాబు నాశనం చేశాడు. నారా లోకేశ్ యాత్ర అంతా డబ్బులతోనే నడిచింది. టీడీపీకి మద్దతు ఇచ్చే స్థితిలో ప్రజలెవ్వరూ లేరు. ప్రజల మద్దతు సీఎం జగన్‌కే.. వైఎస్సార్సీపీని ఏ పార్టీ ఏమీ చేయలేదు. ఏపీలో టీడీపీ, జనసేన కలిసినా వైఎస్సార్సీపీకి ఫుల్ మెజార్టీ వస్తుందని నా దగ్గరున్న సర్వేలు చెబుతున్నాయి. మా కులం వాళ్లు తప్పిస్తే మిగతా కులాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పూర్తి మద్దతు ఉంది. సీఎం జగన్ మాట మీద నిలబడతారు. నిజాయతీ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ‘స్కిల్’ స్కామ్ కేసు: ప్రజాధనాన్ని లూటీ చేశారు -
కేసీఆర్‌కు అండగా నిలుద్దాం: తుమ్మల
గజ్వేల్ (మెదక్): ‘బంగారు తెలంగాణ’ నిర్మాణంలో కమ్మ కులస్తులు కీలక పాత్రను పోషించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో జరిగిన నియోజకవర్గ కమ్మ సంఘం ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని సూచించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తనను గుర్తించి కేసీఆర్ తగు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫోన్ కాల్ చేస్తే చాలు స్పందించి అండగా నిలబడతానని పేర్కొన్నారు. అనంతరం మంత్రి తుమ్మలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల కమ్మ సంఘం కార్యదర్శి బెజవాడ వెంకట్రావు, మెదక్ జిల్లా శాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, గజ్వేల్ నియోజకవర్గ నాయకులు ప్రసాద్, సుభాష్ చంద్రబోస్, పరుచూరి రాజు, వెంకటేశ్వర్రావు, నల్లా భాస్కర్‌రావు, పాలేటి నర్సింహారావు, నల్లా శ్రీధర్, చేకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.