జైపాల్‌రెడ్డి పరమశుంఠ: అడుసుమిల్లి
విజయవాడ: సీమాంధ్ర ప్రాంత నాయకులను శుంఠలుగా అభివర్ణించిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి పరమశుంఠ అని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ ఒక ప్రకటనలో విమర్శించారు. మహానుభావులైన పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు తదితరులు పుట్టిన ప్రాంతంలో శుంఠలు పుట్టారని జైపాల్ వ్యాఖ్యానించటాన్ని ఆయన తప్పుపట్టారు. మహనీయులు మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు.. వంటివారు పుట్టిన గడ్డపై జైపాల్‌రెడ్డి చెడపుట్టారని విమర్శించారు. ఒకవిధంగా ఆయన తెలంగాణ ప్రాంత మహానుభావులను కూడా శుంఠలుగా అభివర్ణించినట్లేనని పేర్కొన్నారు.
లోక్‌సభలో దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ.. జైపాల్‌రెడ్డిని ఉద్దేశించి ఆయనకు మనోవైకల్యం సిద్ధించిందని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఇప్పటివరకూ జైపాల్‌రెడ్డి మేధావి వర్గానికి చెందిన వ్యక్తి అని ప్రజలు భావిస్తున్నారని, ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే రాజీవ్‌గాంధీ చెప్పింది నిజమే అనిపిస్తోందని పేర్కొన్నారు. పదవులకోసం కాళ్లుపట్టుకునే జైపాల్‌రెడ్డి ఇప్పుడు సోనియాగాంధీ కాళ్లు పట్టుకుని దేబిరిస్తున్నారని విమర్శించారు. అదే ప్రాంతానికి చెందిన వి.హనుమంతరావు, మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్ తదితరులంతా ఒకేగాటికి చెందినవారని పేర్కొన్నారు.