‘అమరావతి’ కలేనా!
విశ్లేషణ
రాజధాని కోసం సేకరించిన భూమి మొత్తాన్ని చంద్రబాబు తన గుప్పెట్లో పెట్టుకుని భవిష్యత్ రాజకీయాలకు ఆ భూమినే ఆర్థిక పెట్టుబడిగా మలచుకోబోతున్నారు.
విజయా వారి విజయవంతమై న సినిమా ‘మాయాబజార్’లో ఘటోత్కచుడు కౌరవులకు విడి ది కోసం ఒక నగరం నిర్మించా లనుకుంటాడు. అప్పటి కప్పుడు గురువు చిన్నమయ్య కాగితం మీద గీతలు గీస్తాడు. ఆ గీతలకు అర్థం తెలియక శిష్యులు ఆశ్చర్య పోతుంటే రకరకాల మంత్రాలు చదివేసరికి వెనువెంటనే ఒక మహానగరం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. సరిగ్గా అదేవిధంగా నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక మహా రాజధాని నగరం నిర్మించాలనుకున్నాడు. చిన్నమయ్య పాత్రను సింగపూర్ కంపెనీ పోషించి గీతలు గీసింది. ఆ గీతల మీద నగరం నిర్మించడానికి నాటి ఘటోత్కచుడికి ఉన్న మంత్ర శక్తి చంద్రబాబునాయుడికి లేదు. పైగా తొలి నుంచి రాజ ధానిపై అన్ని వర్గాల ప్రజల్లో ప్రబలంగా ఉన్న అనుమా నాలను అధిగమించి తాను కోరుకున్న విధంగా అమరా వతి నగరాన్ని నిర్మించాలంటే సామాన్య ప్రజలకు తన పథ కం మీద నమ్మకం కలిగించాలి. వార్తాపత్రికల్లో వచ్చిన సింగపూర్ కంపెనీ గీసిన గీతల మతలబు అంతుపట్టక పలు ప్రశ్నలతో సతమతమవుతున్న వారికి ప్రభుత్వం వివరణ ఇవ్వడం అవసరం.
చంద్రబాబు ప్రతిపాదిత అమరావతిలో ఆస్తి మొత్తం ప్రభుత్వం చేతిలోనే. ఏ ప్రాంతంలో ఏమి ఉండాలో సింగ పూర్ పథకమే నిర్ణయించింది. మాల్స్ ఎక్కడ రావాలి, సిని మా హాల్స్ ఎక్కడ ఉండాలో కూడా వారు చూపించారు. మాల్స్ కట్టేవారికి, సినిమా హాల్స్ నిర్మించేవారికి భూము లు ఎవరు ఇస్తారు, ఏ పద్ధతిలో ఇస్తారు? ఇది అత్యంత గోప్యంగా ఉంచబడిన సమాచారం. పండ్లు, పూలు, పం టలు పండించుకుంటున్న దాదాపు 50 వేల మందికి హఠా త్తుగా ఉపాధిని కోల్పోయేలా చేసింది రాజధాని ప్రతిపా దన. వీరు వ్యవసాయానికి బదులుగా చిరువ్యాపారం చేసుకుందామంటే అమరావతిలో అలాంటి అవకాశమే లేనట్లుగా ఉంది సింగపూర్ పథకం.
ఒక పట్టణ నగర జీవితంలో పచారీ షాపులు, ఇతర ప్రైవేట్ సంస్థలు ఎన్ని కోట్ల రూపాయలను రుణంగా ఇస్తుంటాయో ఎవరూ ఊహించలేరు. ప్రభుత్వ ఉద్యోగుల మొదలు, సామాన్యుల వరకు నెలవారీ సరుకులను ఖాతా గా తెచ్చుకుంటారు. నెల మొదటి వారంలో డబ్బు చెల్లించి తిరిగి అప్పుగా సరుకులు తెచ్చుకుంటారు. కాగితాలు అవ సరం లేకుండా కేవలం నమ్మకం మీద నడిచే వ్యాపారం ఇది. ఇలాంటి చిరువ్యాపారాలకు సింగపూర్ అమరావతి పథకంలో స్థానం కనిపించలేదు.
అమరావతిలో ఏడులక్షల మంది మకాం ఉండే అవ కాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇంతమందికి అవస రమైన గృహసముదాయాలు ఎవరు నిర్మిస్తారు. అక్కడ స్థలమే లేనప్పుడు ఏ ఉద్యోగి అయినా ఎక్కడ ఇల్లు నిర్మిం చుకోగలుగుతాడు? రాజధాని నగరంలో ఏది ఎక్కడ ఉండాలో అంతా ప్రభుత్వమే నిర్ణయించేటట్లయితే ఆ నగరంలో సామాజిక వర్గాలన్నింటికీ స్థానముండదు. సమాజంలో కుమ్మరి, కమ్మరి, మేదరి, క్షురకుడు ఇలా ప్రతి ఒక్కరి సేవలు అవస రమే. వివిధస్థాయిల్లో వీరి దుకాణాలు నగరంలో కనిపి స్తాయి. ఉదాహరణకు ముంబై మహానగరంలో వీధిపక్కన షేవింగ్ చేయించుకునే సౌకర్యం కూడా ఉంటుంది. కాని అమరావతిలో అంతా ‘బ్రాండెడ్’కే స్థానం. కట్టుకునే బట్ట లు మొదలు క్రాఫింగ్ వరకు అంతా బ్రాండెడ్. వైద్య సౌక ర్యాలు, విద్య అంతా కార్పొరేట్ రంగంలోనే. సామాన్యుడు భరించలేనంత ఖరీదైన జీవనం అమరావతిలో ఉంటుం దని సింగపూర్ ప్లాన్‌లో కనిపిస్తున్నది.
సేకరించిన భూమిలో కేటాయింపులను ప్రభుత్వమే చేస్తుందనుకుంటే ఆ భూకేటాయింపులు ఎవరికి చేస్తారు? వివిధ నిర్మాణాలకు కేటాయించిన స్థలాలన్నీ ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకే అప్పనంగా అందిస్తారా? అసలు స్థలా లు అమ్ముతారా? వేలం వేస్తారా? అయినవారికి పంచిపెడ తారా? ఈ రహస్య విధానం ఏమిటో ప్రభుత్వంలో ఉన్న తమకే తెలియదని స్వయంగా మంత్రులే వాపోతున్నారు.
రాజధాని నగరానికి ఎంపిక చేసిన ప్రదేశం చంద్రబా బుకు సంపూర్ణంగా పట్టిన వాస్తుపిచ్చికి తప్పించి మరేవి ధంగానూ అనుకూలం కాదన్నది నిపుణుల అభిప్రాయం. సీడ్ క్యాపిటల్‌గా పేర్కొంటున్న మూడు గ్రామాలు కృష్ణా నది ముంపుకు గురయ్యే ప్రాంతాలు. నీరు నిలిచి ఉండే ప్రదేశం. చుట్టూ ఉన్న కాలువలు, వాగులు, వంకలు పొం గినప్పుడు నీరు చేరే ఆ ప్రాంతంలో రాజధానిని నిర్మించి వరదల రాజధానిగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నట్లుంది. పైగా తెలుగుదనం కొరవడిన విదేశీ నమూనాను ప్రజల ముందుంచుతున్నాడు చంద్రబాబు. రాజధాని నిర్మాణా నికి 35 నుంచి 50 ఏళ్ల సమయం పడుతుందని ప్రభు త్వమే ప్రకటించింది. 2019లో జరగనున్న ఎన్నికల్లోనే చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తాడనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన కనీస నిర్మాణాల మీద దృష్టి పెట్టకుండా మహానగర రూపురేఖల నిర్మాణం గురించి మాట్లాడటం అంటే ప్రజలను రంగుల కలలో ముంచి పబ్బం గడుపుకోవడమే.
రాజధాని నగర నిర్మాణం మీద రాజకీయ భవిష్య త్తును నిర్మించుకునే ఎత్తుగడను ఆపి నవ్యాంధ్రకు దక్కా ల్సిన ఇతర అంశాల మీద చంద్రబాబు దృష్టి సారిస్తే బాగుంటుంది. రాజధాని నగరంలో నిర్మించాల్సిన అసెం బ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్ నిర్మాణాల రూపు రేఖలను తక్షణమే కేంద్రానికి పంపి వాటి నిర్మాణం చేప ట్టడం అవసరం. ఆ దిశలో బాబు కనీస ప్రయత్నం చేయ టంలేదు.
ఈ సమయంలో ఒక కొత్త నాయకత్వం ఆంధ్రులకు అవసరం. రాజధాని నిర్మాణ ప్రతిపాదన దశలోనే ప్రతి ఘటించే నాయకత్వం కింద ఆంధ్రులు కలిసికట్టుగా పని చేయాలి. తను ఏది అనుకుంటే అదే ఫైనల్ అనుకునే ఆలో చనా ధోరణి నుంచి చంద్రబాబును బయటకు తెచ్చే శక్తి వంతమైన ఉద్యమం కావాలి. ప్రజలది తన మంత్రివర్గం లోని గంగి రెద్దుల మనస్తత్వం కాదని, ప్రశ్నించే తత్వం కలవారన్నది తెలియచెప్పాలి. సంవత్సర కాలం కలలో నడిపించిన చంద్రబాబుకి రాజధాని నిర్మాణ అంశం లోని వాస్తవాలతో ఎదురుతిరగాలి.
రాజధాని నగరమంటే ‘గేటెడ్ కమ్యూనిటీ’ ఉండే ప్రదేశం కాదు. తాను, తన బంధువర్గం, తన పార్టీ నాయ కులు, తన సామాజిక వర్గం వారికి భూపంపకం చేసుకోవ డానికి కాదు రైతులు త్యాగం చేసింది. ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసమే వారు తమ భూములను ‘పూల్’ చేశారు. ‘పూలింగ్’కి అంగీకరించిన రైతులను ‘ఫూల్స్’ చెయ్య వద్దు. తన సొంత ఇంటి శంకుస్థాపన చేసుకున్న తీరులోనే రాజధాని నిర్మాణ భూమి పూజ చేసినప్పుడే బాబు మనసు ఆంధ్రులకు అర్థమైంది. అందుకే నేడు ఆంధ్రుల మనసుల్లో అసంతృప్తి మొదలైంది. ‘అమరావతి’ కలలు అమ్ముతున్న కొద్దీ అసంతృప్తి పెరుగుతుంది. చేసిన తప్పు లే మళ్లీ చేస్తానంటే ప్రజలు అసలు అంగీకరించరు.
అన్నిరకాల అభివృద్ధి అంశాలు రాజధాని నగరం లోనే కేంద్రీకరించడమే ఆంధ్రప్రదేశ్ విభజనకు దారితీసి, ఆంధ్రులు భారీగా నష్టపోయారని తెలిసి కూడా అదే పాచి పట్టిన అభివృద్ధి నమూనాని అమరావతిలో ప్రతిపాదిం చడం ద్వారా మరో వేర్పాటు ఉద్యమానికి ఇతర జిల్లాల వారు సిద్ధమయ్యేలా చేయడం భావ్యం కాదు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని జిల్లాల వికాసం అనేది కొత్త నినా దం కావాలి. అందుకు తగిన విధంగా చంద్రబాబు ఆలోచ నల్లో మార్పురాకుంటే ఆంధ్రప్రజలే ఆ మార్పు తెచ్చేం దుకు నడుం బిగించాలి.
అడుసుమిల్లి జయప్రకాష్
(వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే) 98481 28844