అధిష్టానంపై తిరగబడతాం: లగడపాటి | We revolt on high command for united Andhra pradesh: Lagadapati Rajagopal | Sakshi
Sakshi News home page

అధిష్టానంపై తిరగబడతాం: లగడపాటి

Published Sat, Oct 19 2013 10:45 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

అధిష్టానంపై తిరగబడతాం: లగడపాటి - Sakshi

అధిష్టానంపై తిరగబడతాం: లగడపాటి

విజయవాడ : రాష్ట్రాన్ని విభజిస్తే పదవులు సైతం వదులుకొని అధిష్టానంపై తిరగబడతామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రయత్నించిన కొన్ని పార్టీలు చేతకాని తనం వల్లే రాష్ట్రం విడిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన శనివారమిక్కడ అన్నారు. అటువంటి పార్టీలను బండ కేసి కొట్టాలని మండిపడ్డారు.

రాష్ట్ర విభజన ఏర్పాటు దిశగా లేఖలు ఇవ్వద్దని పార్టీలను వేడుకున్నామని లగడపాటి తెలిపారు. రాజకీయ పార్టీలను ప్రజలు ద్వేషిస్తున్నారని,  తగిన బుద్ధి చెప్పటానికి ఎదురు చూస్తున్నారనిఅన్నారు. రాజకీయ పార్టీల అధినేతలు ఈ విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. లగడపాటి రాజగోపాల్ రాజీనామాను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement