జర్నలిస్టులపై నోరుపారేసుకున్న లగడపాటి | lagadapati rajagopal does a foot in mouth on telangana scribes draws ire | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులపై నోరుపారేసుకున్న లగడపాటి

Published Wed, Nov 6 2013 1:57 PM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM

జర్నలిస్టులపై నోరుపారేసుకున్న లగడపాటి - Sakshi

జర్నలిస్టులపై నోరుపారేసుకున్న లగడపాటి

న్యూఢిల్లీ: జగడపాటిగా పాపులరయిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి జర్నలిస్టులపై జులుం ప్రదర్శించారు. ఇంతకుముందు 'సాక్షి'కి అక్కసు వెళ్లగక్కిన లగడపాటి తాజాగా తెలంగాణ జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక పంపిన విషయాన్ని తెలిపేందుకు లగడపాటి ఈరోజు ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులు ప్రశ్నలు సంధించడంతో ఆయన అసహనం ప్రదర్శించారు.

ప్రశ్నలు అడిగిన పాత్రికేయులపై రుసరుసలాడారు. అవసరమయితే చేయి కూడా చేసుకుంటానని హెచ్చరించారు. మీ అంతు చూస్తానంటూ ఆవేశంతో ఊగిపోయారు. దీంతో అక్కడున్న వారు కల్పించుకుని ఆయనను పక్కకు తీసుకుపోయారు. జర్నలిస్టుల పట్ల లగడపాటి వ్యవహరించిన తీరును తెలంగాణ పాత్రికేయ సంఘాలు ఖండించాయి. ఆయన వైఖరి అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement