telangana journalists
-
జర్నలిస్టులకు కేసీఆర్ దసరా కానుక
-
జర్నలిస్టులకు కేసీఆర్ దసరా కానుక
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. నెల రోజుల్లోనే తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్రెస్ మీట్లో మాట్లాడిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీబీజీకేఎస్ పుట్టిందని గుర్తు చేశారు. జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ చాన్నాళ్లు గుర్తింపు సంఘాలుగా ఉన్నాయని, వాటి వల్లే వారసత్వ ఉద్యోగాలు పోయాయని ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాలు వదులుకుంటున్నట్లు సంతకాలు చేసింది ఆ సంఘాలేనన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల సమస్యలను, సింగరేణిని అర్ధం చేసుకోలేకపోయాయని చెప్పారు. కార్మికుల అనారోగ్య సమస్యల గురించి అర్ధం చేసుకోలేదని, తాము మాత్రం ఇక నుంచి కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. -
గళమెత్తిన జర్నలిస్టులు
- ఏపీ సచివాలయం, డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా - చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు - టీ న్యూస్‌కు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించు కోవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించిన కథనాలను ప్రసారం చేసినందుకు టీ న్యూస్ చానెల్‌కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జర్నలిస్టులు శనివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట ధర్నాకు దిగారు. టీ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘బ్రీఫ్డ్ బాబు డౌన్ డౌన్, బ్రీఫ్ కేసు బాబు డౌన్ డౌన్’ అంటూ నినదించారు. ఏపీ సీఎం కార్యాలయం వైపు చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, జర్నలిస్టులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో ఎల్ బ్లాక్‌కు వెళ్లేదారిలో మీడియా పాయింట్ వద్దే జర్నలిస్టులు బైఠాయించారు. అవినీతికి పాల్పడినవారిపై కథనాలను ప్రసారం చేసే హక్కు మీడియాకు ఉందని, ఈ హక్కును ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యుజే) ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద.. ఏపీ సచివాలయం ధర్నా కంటే ముందుగా లక్డీకాపూల్‌లోని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం వద్ద కూడా తెలంగాణ జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీ-న్యూస్ చానెల్ ఉద్యోగులతో పాటు పలు పాత్రికేయ, ప్రజా సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు. ఒక రాష్ట్ర పోలీసులు మరో రాష్ట్రానికి వచ్చి ఎవరికైనా నోటీసులు ఇవ్వాలంటే ఆ రాష్ట్ర పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలని, దీన్ని విశాఖపట్నం పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఇలా ఉల్లంఘనలకు పాల్పడితే ఎలా అని ప్రశ్నించారు. నిరసనకారుల్ని అరెస్టు చేసిన సైఫాబాద్ పోలీసులు గాంధీనగర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇది చంద్రబాబు వ్యక్తిగత సమస్య: అల్లం నారాయణ ఏపీ సీఎం చంద్రబాబు.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయి తన వ్యక్తిగత సమస్యను రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నారని తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ విమర్శించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడేందుకు తెలుగువారి మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. అవినీతికిపాల్పడిన వారిపై కథనాలను ప్రసారం చేసే హక్కు మీడియాకు ఉందన్నారు. దీనికి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. తక్షణమే సాక్షి, టీ న్యూస్ చానెళ్లకు జారీ చేసిన నోటీసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంఈయూ మద్దతు జర్నలిస్టుల ధర్నాకు జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మీడియాపై అక్కసు వెళ్లగక్కుతున్న చంద్రబాబునాయుడికి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. వెన్నుపోటు చరిత్ర నీదైతే ఉద్యమాల చరిత్ర తెలంగాణ బిడ్డలదన్నారు. -
ఏపీ డీజీపీ ఆఫీస్ వద్ద జర్నలిస్టుల ఆందోళన, అరెస్టు
హైదరాబాద్ : టీ న్యూస్ ఛానల్‌కు నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ శనివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ఎదుట తెలంగాణ జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐజెయు సెక్రటరీ జనరల్ అమర్ తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆందోళన చేపడుతున్న జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి గాంధీ నగర్ పీఎస్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ సర్కార్ చర్యకు ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసనలకు దిగారు. ఓటుకు నోటు కేసులో వాస్తవాలు బయటపెట్టిన టీ న్యూస్‌కు నోటీసులు జారీ చేయటంపై పలు జిల్లాలోనూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్: టీ న్యూస్ కు నోటీసులను నిరసిస్తూ కరీంనగర్ లో జర్నలిస్టులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నిజామాబాద్: జిల్లాలో ధర్నా చేపట్టిన జర్నలిస్టులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లగొండ: నోటీసులను నిరసిస్తూ నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ లో జర్నలిస్టు సంఘాలు ధర్నాకు దిగాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోనూ చంద్రబాబు ఫ్లెక్సీని దహనం చేసిన జర్నలిస్టులు నిరసన తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు జర్నలిస్టులకు మద్దతు తెలిపాయి. -
ఆందోళనకు సిద్ధమవుతున్న తెలంగాణ జర్నలిస్టులు
హైదరాబాద్ : టీ న్యూస్ ఛానల్‌కు నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ఎదుట తెలంగాణ జర్నలిస్టులు ఆందోళన చేపట్టనున్నారు. ఏపీ సర్కార్ చర్యకు ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసనలకు సిద్ధం అవుతున్నారు. ఓటుకు నోటు కేసులో వాస్తవాలు బయటపెట్టిన టీ న్యూస్‌కు నోటీసులు జారీ చేయటంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అర్థరాత్రి టీ న్యూస్ ఛానల్‌కు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ అడ్వకేట్లు ఫిర్యాదు చేశారు. -
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ బాధ్యతల స్వీకారం
సీమాంధ్ర మీడియా చిన్నచూపు చూడకుండా కృషిచేస్తానని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర మీడియా చిన్నచూపు చూడకుండా ఆయా సంస్థలతో చర్చించేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్, సీనియర్ సంపాదకుడు అల్లం నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కొన్ని సీమాంధ్ర మీడియా గ్రూప్‌లు తెలంగాణ ప్రజల యాస, భాషపై వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. సోమవారం నాంపల్లి చాపెల్ రోడ్డులోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో ఆయన తెలంగాణ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు సరైన ప్రోత్సాహం, గౌరవం లభించే విధంగా సీమాంధ్ర మీడియా యజమానులతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చలు జరుపుతానని తెలిపారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టుల తరఫున ఉద్యమ నాయకుడిగా ఎనలేని కృషి చేసిన అల్లం నారాయణకు సీఎం కేసీఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. -
'ఆంధ్రా అక్టోపస్'కు ఆగ్రహం
'చేయి చేసుకోవడానికి వెనుకాడను. మీ అంతు చూస్తా' ఈ మాటలన్నది మామూలు వ్యక్తి కాదు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలివి. దేశంలో అత్యంత పురాతన పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకుడి నోటి దరుసుతనానికి రుజువులీ వ్యాఖ్యలు. ఆయనెరో కాదు విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్. నిత్య వివాదాలతో ఆయన జగడపాటిగా ప్రసిద్ధి చెందారు. దురుసు ధోరణితో సార్థక నామధేయగా ఆయన నడుచుకుంటున్నారు. ఆంధ్రా అక్టోపస్‌గా పేరున్న లగడపాటి మరోసారి పాత్రికేయులపై విరుచుకుపడ్డారు. గతంలో 'సాక్షి' మీడియా ప్రతినిధులపై చిందులేసిన ఈ సర్వేల సర్వారాయుడు తాజాగా తెలంగాణ జర్నలిస్టులపై ఒంటికాలిపై లేచారు. నన్నే ప్రశ్నిస్తారా అంటూ పెట్రేగిపోయారు. జీఓఎం తాను నివేదిక సమర్పించానని చెప్పడానికి లగడపాటి బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎంపీగారు నోటికి పని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నోటికి వచ్చినట్టు దుర్బాషలాడారు. మీ అంతు చూస్తానంటూ హెచ్చరించారు. చేయి చేసుకోవడానికి కూడా వెనుకాడబోనంటూ వీధి రౌడీలా బెదిరించారు. లగడపాటికి వివాదాలు కొత్త కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. మీడియాలో ప్రచారం కోసం ఆయన ఎన్నో విన్యాసాలు చేశారు. తాను పార్లమెంట్ సభ్యుడినన్న విషయం మర్చిపోయి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు తీరుగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు సొంత పార్టీ పచ్చ జెండాతో ఊపడంతో లగడపాటికి ఊపిరి సలపడం లేదు. దీంతో ఇన్నాళ్లు సమైక్యం పాట పాడిన ఆయన దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఓవరాక్షన్ కారణంగా అధిష్టానం కూడా ఆయనను దూరం పెట్టింది. సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకుంటున్నా ప్రజలూ ఆయనను నమ్మడం లేదు. వ్యాపారపరంగా కూడా నష్టాల్లో చిక్కుకున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన లగడపాటి నిరాశ, నిస్పృహతోనే దిగజారి ప్రవరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక నుంచైనా హుందాగా నడుచుకోవాలని సలహాయిస్తున్నారు. మరీ లగడపాటి మారతారా? -
జర్నలిస్టులపై నోరుపారేసుకున్న లగడపాటి
న్యూఢిల్లీ: జగడపాటిగా పాపులరయిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి జర్నలిస్టులపై జులుం ప్రదర్శించారు. ఇంతకుముందు 'సాక్షి'కి అక్కసు వెళ్లగక్కిన లగడపాటి తాజాగా తెలంగాణ జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక పంపిన విషయాన్ని తెలిపేందుకు లగడపాటి ఈరోజు ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులు ప్రశ్నలు సంధించడంతో ఆయన అసహనం ప్రదర్శించారు. ప్రశ్నలు అడిగిన పాత్రికేయులపై రుసరుసలాడారు. అవసరమయితే చేయి కూడా చేసుకుంటానని హెచ్చరించారు. మీ అంతు చూస్తానంటూ ఆవేశంతో ఊగిపోయారు. దీంతో అక్కడున్న వారు కల్పించుకుని ఆయనను పక్కకు తీసుకుపోయారు. జర్నలిస్టుల పట్ల లగడపాటి వ్యవహరించిన తీరును తెలంగాణ పాత్రికేయ సంఘాలు ఖండించాయి. ఆయన వైఖరి అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నాయి.