ఆందోళనకు సిద్ధమవుతున్న తెలంగాణ జర్నలిస్టులు
హైదరాబాద్ : టీ న్యూస్ ఛానల్కు నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ఎదుట తెలంగాణ జర్నలిస్టులు ఆందోళన చేపట్టనున్నారు. ఏపీ సర్కార్ చర్యకు ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసనలకు సిద్ధం అవుతున్నారు. ఓటుకు నోటు కేసులో వాస్తవాలు బయటపెట్టిన టీ న్యూస్కు నోటీసులు జారీ చేయటంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అర్థరాత్రి టీ న్యూస్ ఛానల్కు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ అడ్వకేట్లు ఫిర్యాదు చేశారు.