సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుజాతశర్మ బదిలీ అయ్యారు. ఆమెను వాణిజ్య పన్నులశాఖ హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ డీఆర్డీఏ పీడీగా ఉన్న ఆమెను అప్పటికే జిల్లాలో ఆమె భర్త సర్వశ్రేష్ట త్రిపాఠి పనిచేస్తుండటంతో జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. 2006 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సుజాతశర్మ మొదటి పోస్టింగ్ ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా వచ్చారు. అనంతరం ఉట్నూర్ ఐటీడీఏ పీవో గా కొనసాగారు. ఆ తరువాత వరంగల్ డీఆర్డీఏ పీడీగా వెళ్లారు. అనంతరం 2011 నవంబర్ 18న జేసీగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు రెండేళ్లపాటు జిల్లాలో పనిచేస్తున్న ఆమె కలెక్టర్ అహ్మద్‌బాబు ఈనెల 11 నుంచి 18 వరకు సెలవులపై వెళ్లడంతో ప్రస్తుతం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె భర్త సర్వశ్రేష్ట త్రిపాఠి జిల్లా ఎస్పీగా ప నిచేస్తూ ఇటీవలే సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ కాగా, సుజాతశర్మను ప్రభుత్వం వాణి జ్య పన్నులశాఖ కార్యదర్శిగా నియమించింది. కాగా కలెక్టర్ సెలవుల నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆమె ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యే అవకాశాలున్నట్లు అధికారవర్గాల సమాచారం. జిల్లాలో ఆమె సమర్థవంతమైన అధికారిణిగా జిల్లాలో పేరు తెచ్చుకున్నారు. కాగా బదిలీ అయిన జేసీ సుజాతశర్మ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.
ఉట్నూరు ఏఎస్పీకి వరంగల్ రూరల్ ఓఎస్‌డీగా పదోన్నతి
ఐపీఎస్ అధికారి, ఉట్నూర్ ఏఎస్పీగా పనిచేస్తున్న అంబర్ కిషోర్‌ఝా వరంగల్ రూరల్ ఓఎస్‌డీగా పదోన్నతిపై బదిలీ చేశారు. అప్పటివరకు డీఎస్పీ స్థాయికే పరిమితమైన ఉట్నూరు సబ్ డివిజన్‌కు మొదటిసారిగా 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంబర్ కిశోర్‌ఝాను 2011 డిసెంబర్ 12న నియమించారు. సుమారు 23 నెలలపాటు ఉట్నూరు ఏఎస్పీగా పనిచేసిన ఆయన మొదటి పోస్టింగ్‌లోనే సమర్థవంతమైన పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఉట్నూరు, ఇంద్రవెల్లి, గుడిహత్నూరు తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల డంపులను ఈయన హయాంలోనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు జిల్లా కమిటీ, మరో ఇద్దరు దళకమాండర్ స్థాయి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. కాగా నిర్మల్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్టు మొదలుకుని.. రిమాండ్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన కీలక కేసుకు అంబర్ కిషోర్‌ఝానే సారథ్యం వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసు సేవలను అందించడంతోపాటు నిజాయతీ గల పోలీసు అధికారిగా మంచి పేరుంది.
బెల్లంపల్లి అడిషనల్ భాస్కర్‌రావు బదిలీ
బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ ఓరం భాస్కర్‌రావును కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. 2011 డిసెంబర్ 2న బెల్లంపల్లి అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన సుమారు రెండేళ్లపాటు పనిచేశారు. ఎస్పీగా పదోన్నతి జాబితాలో ఉన్న ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. 1989వ ఎస్సై బ్యాచ్‌కు చెందిన భాస్కర్‌రావు కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన వారు. వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐగా పనిచేసిన ఆయన తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణలో పేరు సంపాదించారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా రాష్ట్రస్థాయిలో పేరున్న ఆయన డీఎస్పీ పదోన్నతిపై నిర్మల్‌లో నియామకమైన ఏడాదిన్నరకు మంచిర్యాల డీఎస్పీగా బదిలీ అయ్యారు. అనంతరం అడిషనల్ ఎస్పీ పదోన్నతిపై బెల్లంపల్లిలో 2011 డిసెంబర్ 2న నియమితులైన భాస్కర్‌రావు గురువారం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన భరత్‌భూషణ్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏఎస్పీగా పనిచేస్తూ బదిలీపై వస్తున్నారు.
జేసీ బదిలీ
Published Fri, Nov 15 2013 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement