sujata sharma
-
అంకిత భావంతో పనిచేస్తే సత్ఫలితాలు
ఒంగోలు సెంట్రల్: జిల్లా నీటి యాజమాన్య సంస్థి సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించచ్చని కలెక్టర్ సుజాత శర్మ అన్నారు. నగరంలోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో జిల్లా జీవనోపాదుల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో కలిసి ఆమె శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ. 1.57 కోట్లతో ఈ భవనం నిర్మాణం చేపట్టడం ద్వారా శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 22 వేల మంది ఉపాధి కూలీలకు వంద రోజుల పనిదినాలు కల్పించడం జరిగిందన్నారు. ఇంకా 60 వేల మంది వేతన కూలీలకు వంద రోజుల పని దినాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో సరాసరి వేతన కూలీలకు రోజువారీ వేతనం రూ. 134లను మాత్రమే అందించడం జరుగుతుందన్నారు. కూలీలలో అవగాహన కల్పించి సరాసరి రోజు వారీ వేతనం రూ. 194లు పొందేలా చూడాలని కలెక్టర్ అధికారులు, సిబ్బందికి సూచించారు. జిల్లాలో నీటి వనరులు తక్కువగా ఉన్నాయని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పంట సంజీవని, ఊటకుంటలు ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో డ్వామా సంస్థ ద్వారా 3 రోజుల్లో పే ఆర్డర్ జనరేట్ చేసి వేతన కూలీలకు వేతనం అందిస్తున్నట్లు నివేదికలు కన్పిస్తున్నాయన్నారు. క్షేత్ర స్థారుులో నిర్దేశించిన పనులు అమలు కావడంలేదన్నారు. అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి కష్టపడి పని చేసి వేతన కూలీలకు సకాలంలో సక్రమంగా వేతనం అందేలా చూడాలన్నారు. గ్రామాల్లో పొస్టాఫీసుల నుంచి వేతన కూలీలకు వేతనం అందుతున్నదీ లేనిది పరిశీలించాలన్నారు. ఎస్బీఐ ద్వారా రూ. 30 కోట్లు హెడ్ పోస్టుఫీసుకు నిధులు విడుదల అయ్యాయన్నారు. వేతన కూలీలకు అందాల్సిన వేతనం గ్రామీణ ప్రాంత పోస్టాఫీసుల ద్వారా అందేలా చూడాలన్నారు. వేతన కూలీల్లో భయాందోళనలను తొలగించాలన్నారు. సంపూర్త పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా డ్వామా, డీఆర్డీఏ సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యంపై గ్రామీణ ప్రాంత ప్రజల్లో విసృ్తతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. డ్వామా, డీఆర్డీఏ సంస్థ అధికారులు, సిబ్బంది టార్గెట్ గ్రూపులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన చేపట్టి మోభైల్ బ్యాంకింగ్ సదుపాయం వినియెగించుకునేలా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. అధికారులు, సిబ్బంది లబ్ధిదారులతో మోభైల్ బ్యాం కింగ్ సేవలపై అవగాహన కల్పించే విషయంలో సేవాభావంతో పనిచేయాలని సూచించారు. టార్గెట్ గ్రూపులు వంద శాతం మొబైల్‌బ్యాంకింగ్ సదుపాయం వినియెగించుకునేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ప్రభుత్వం పంట సంజీవని కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. డ్వామా సంస్థ ద్వారా జిల్లాలోని రైతులందరూ తమ పొలాల్లో నీటి కుంటలు, ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్ మాట్లాడుతూ శిక్షణా కేంద్రాల వల్ల పలు ప్రయెజనాలున్నాయన్నారు. లబ్ధిదారుల్లో నైపుణ్యత, టాలెంట్, మెరుగు పరుచుకోవడానికి శిక్షణలు ఉపయెగపడతాయన్నారు. ఈ సందర్భంగా డ్వామా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఎన్. పోలప్ప, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళీ, ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, డ్వామా ఏపీడీలు బి. రమేష్ బాబు, ఆర్. భవానీ, ఏపీడీలు కాత్యాయని, సుబ్బారావు, మీరావలి, గృహనిర్మాణ శాఖ డీఈ వి. దశరధి శర్మ, లక్ష్మి నారాయణ, ఈఈ కె. బసవయ్య తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు రూ.95 కోట్లు అవసరం
సీఎంకు వివరించిన కలెక్టర్ ఒంగోలు టౌన్ : జిల్లాకు తక్షణం 95 కోట్ల రూపాయలు అవసరమవుతాయని కలెక్టర్ సుజాతశర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితుల గురించి సుజాతశర్మ వివరిస్తూ ప్రస్తుతం తమ వద్ద 25 కోట్ల రూపాయల నగదు సిద్ధంగా ఉందన్నారు. 8500 మందికి కోటి రూపాయల పింఛన్లు ఇచ్చినట్లు తెలిపారు. 21 వేల మంది వృద్ధులు, వికలాంగులకు 200 రూపాయల చొప్పున నగదు రూపంలో అందించినట్లు వివరించారు. ఉపాధి కూలీలకు కూడా నగదు చెల్లింపులు జరిపినట్లు తెలిపారు. జిల్లాకు 10 వేల ఈ-పాస్ మిషన్లు అవసరం అవుతాయన్నారు. 1684 మొబైల్ ట్రాన్షక్షన్లు, 4 వేల మైక్రో ట్రాన్షక్షన్లు నిర్వహించినట్లు వివరించారు. మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించి బ్యాంకు మిత్రలు, సీసీలకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. శిక్షణ పొందిన వారు తమకు కేటారుుంచిన ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలపై క్షేత్ర స్థారుులో ప్రజలకు అవగాహన కలిగిస్తారని తెలిపారు. నగదు రహిత లావాదేవీల ద్వారా ఉపాధి : సీఎం నగదు రహిత లావాదేవీల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని నిర్ణరుుంచినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఒక నిరుద్యోగి ఒక వ్యక్తికి నగదు రహిత లావాదేవీ నిర్వహిస్తే రిజిస్ట్రేషన్ ఫీజు కింద 15 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తికి నెల రోజులపాటు శిక్షణ ఇచ్చి నగదు రహిత లావాదేవీలపై పూర్తి స్థారుులో అవగాహన కలిగిస్తే 20 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. మొత్తంగా ఒక నిరుద్యోగి ఒక వ్యక్తికి నగదు రహిత లావాదేవీలపై అవగాహన కలిగించినందుకు నెలకు 35 రూపాయలు ఇస్తామని వివరించారు. బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలకు ప్రకటిస్తున్న ప్రోత్సాహకాల మాదిరిగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించే గ్రామాలకు కూడా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. అతి చిన్న గ్రామానికి రూ.10 వేలు, చిన్న గ్రామానికి రూ.25 వేలు, పెద్ద గ్రామానికి రూ.50 వేలు, మేజర్ పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు చెల్లించనున్నట్లు వివరించారు. జేసీ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ఎల్డీఎం నరసింహారావు, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు. -
చిన్ననోట్లు అందుబాటులో ఉంచాలి
కలెక్టర్ సుజాతశర్మ ఆదేశం ఒంగోలు టౌన్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. బ్యాంకుల్లో చిన్ననోట్లు అందుబాటులో ఉంచి ప్రజల అవసరాలు తీర్చడానికి బ్యాంకు అధికారులు తమ వంతు సహకారం అందించాలని ఎల్డీఎంను ఆదేశించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో కరెన్సీ నోట్లు, మొబైల్ బ్యాంకింగ్ అంశాలపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. సామాజిక భద్రత పింఛన్లు పొందుతూ లేవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులకు కొంత మొత్తం నగదు పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని విసృ్తతంగా వినియోగించుకోవాలని కోరారు. ఉపాధి కూలీలు, పింఛన్‌దారులకు రిజిస్ట్రేషన్ చేపట్టాలి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతన కూలీలు, సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులంతా మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందే విధంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత శాఖల్లో రిసోర్స్ పర్సన్ల ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించి నగదు రహిత లావాదేవీలు జరిపే విధంగా చైతన్యవంతం చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని 1.8 లక్షల మంది వేతన కూలీల బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేపట్టాలన్నారు. ఆధార్ సీడింగ్ అనంతరం బ్యాంకు ఖాతాలు, బ్యాంకు బ్రాంచ్‌ల వివరాలను ఎల్డీఎంకు అందించి మొబైల్ రిజిస్ట్రేషన్ చేరుుంచేలా చూడాలన్నారు. బ్యాంకు ఖాతాలు లేనివారిని గుర్తించి జన్‌ధన్ ఖాతాలు తెరిపించి రూపే కార్డులు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. పోస్టాఫీసు ఖాతాలు కలిగిన వాటిని బ్యాంకు ఖాతాలకు మార్చాలని ఆదేశించారు. రెండువేల మందిని రిజిస్ట్రేషన్ చేరుుంచాలి మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వీలుగా మండలానికి కనీసం రెండువేల మందితో మొబైల్ రిజిస్ట్రేషన్ చేరుుంచాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారు ఫీల్డ్ అసిస్టెంట్, వీఏవో, బ్యాంకు మిత్రలతో మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకునేలా చూడాలన్నారు. మెప్మా ద్వారా పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేపట్టాలన్నారు. ఏ బ్యాంకు ఖాతాదారుడు అరుున మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు కామన్ ఫారం రూపొందించాలని ఎల్డీఎంకు సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో ఏటీఎంల ద్వారా మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కలిగించాలని మెప్మా పీడీని ఆదేశించారు. మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అంశంలో ఖాతాదారులకు బ్యాంకులు సహకరించాలన్నారు. సమావేశంలో ఎల్డీఎం నరసింహారావు, జెడ్పీ సీఈవో బాపిరెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, డ్వామా పీడీ పోలప్ప, మెప్మా పీడీ అన్నపూర్ణ, ఖజానా శాఖ డిప్యూటీ డెరైక్టర్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. -
ఈ ఆఫీసు బహుదూరం
► సింగిల్ డిజిట్‌కే పరిమితమైన పదిశాఖలు ► ప్రతివారం ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నా పురోగతి నామమాత్రం ఒంగోలు టౌన్ : ఈ-ఆఫీసుకు కొన్నిశాఖలు దూరంగా ఉంటున్నారుు. మొక్కుబడిగా కార్యకలాపాలు సాగిస్తుండటంతో జిల్లాపై తీవ్రప్రభావం చూపుతోంది. అన్ని శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు ఈ-ఆఫీసు ద్వారానే చేపట్టాలని కలెక్టర్ సుజాతశర్మ, జారుుంట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఆ శాఖాధికారుల్లో పూర్తిస్థారుులో స్పందిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. ఈ-ఆఫీసుపై జారుుంట్ కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి వారం వారం సమీక్షిస్తున్నప్పటికీ ఆశించిన స్థారుులో ఫలితాలు రావడం లేదు. దీనిలో ప్రకాశం జిల్లా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. మొక్కుబడిగా వ్యవహరిస్తున్న ఆ పది శాఖలతోపాటు ఇతర శాఖలు కూడా లైట్‌గా తీసుకుంటే ప్రకాశం జిల్లా దిగువ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. ఐదు నెలలైనా అంతే సంగతులు... జిల్లాలో ఈ ఏడాది జూలై నుంచి ఈ-ఆఫీసును అమలు చేస్తున్నారు. అంతకు ముందుగానే కలెక్టరేట్‌ను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి కార్యకలాపాలు సాగించారు. ఆ తరువాత మొదటి విడతలో 10శాఖలను చేర్చారు. అనంతరం రెండో విడతలో మరో 72 శాఖలను ఈ-ఆఫీసులో చేర్చారు. రోజుకు 100 నుంచి 135 వరకు ఈ-ఆఫీసు ద్వారా ఫైల్స్ నిర్వహణ ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో 82 శాఖల్లో ఈ-ఆఫీసు అమలవుతోంది. ఇప్పటివరకు ఈ-ఆఫీసు ద్వారా 10,250 ఫైల్స్‌కు సంబంధించిన కార్యకలాపాలు సాగారుు. పూర్తిస్థారుులో అన్ని శాఖలు ఈ-ఆఫీసు ద్వారా కార్యకలాపాలు సాగిస్తే ప్రకాశం జిల్లా రాష్ట్రస్థారుులో మొదటి మూడు స్థానాల్లో నిలిచేది. అరుుతే, కొన్ని శాఖల పనితీరు చూస్తుంటే జిల్లా ర్యాంకు కిందకు దిగజారే ప్రమాదం పొంచి ఉంది. కారణాలు అనేకం... ఈ-ఆఫీసుకు సంబంధించి కొన్ని శాఖలు వెనుకబడటానికి కారణాలు అనేకం ఉన్నారుు. ఆయా శాఖలకు సంబంధించి పూర్తిస్థారుులో మ్యాన్ పవర్(సిబ్బంది) లేకపోవడం ఒక కారణమైతే, సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు స్కాన్‌చేసి పంపడం ఇంకో కారణం. కొన్ని సందర్భాల్లో దాదాపు 100 నుంచి 200 పేజీల వరకు స్కానింగ్ చేసి ఈ-ఆఫీసుకు పంపించడం కష్టతరమవుతోంది. అదేవిధంగా స్కానర్ల సమస్య కూడా కొన్ని శాఖలను పట్టిపీడిస్తోంది. ఈ-ఆఫీసు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించిన స్కానర్లు మాత్రం పూర్తిస్థారుులో అందించలేదు. సంబంధిత శాఖలే స్కానర్లు కొనుగోలు చేసుకుని ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లడంతో వాటిని ఏ విధంగా కొనుగోలు చేయాలో తెలియక కొంతమంది రోజుల తరబడి ఈ-ఆఫీసు వారుుదా వేసుకుంటూ వచ్చారు. అన్ని శాఖలు తమకు సంబంధించిన బడ్జెట్లో స్కానింగ్ మిషన్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు వెళ్లినప్పటికీ నామమాత్రపు బడ్జెట్లకు పరిమితమైన శాఖాధికారులు వాటిని కొనుగోలు చేసేందుకు ముం దుకు రాకపోవడంతో ఈ-ఆఫీసు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. టాప్ టెన్‌లో కొన్ని శాఖలు... జిల్లాలో ఈ-ఆఫీసుకు సంబంధించి రెవెన్యూ, జిల్లాపరిషత్, డ్వామా, పౌరసరఫరాలశాఖ, డీఆర్డీఏ, వ్యవసాయశాఖ, జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ, ట్రెజరీ, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, చీరాల మున్సిపాలిటీ టాప్‌టెన్‌లో ఉన్నారుు. వీటితోపాటు కనిగిరి, కందుకూరు, అద్దంకి మున్సిపాలిటీల్లో కూడా ఈ-ఆఫీసుకు సంబంధించిన కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నారుు. ఈ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటా రుు. దాంతో ఈ-ఆఫీసులో అవి ముందంజలో ఉన్నారుు. అరుుతే ఆ శాఖలు మరింత మెరుగ్గా వ్యవహరించాల్సి ఉంది. ఆ దిశగా సంబంధిత జిల్లా అధికారులు వేగవంతం చేస్తే కొంతమేర ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నారుు. సింగిల్ డిజిట్స్ శాఖలు... జిల్లాలో పది శాఖలు ఈ-ఆఫీసుకు సంబంధించి సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారుు. ఆ శాఖల పనితీరు కారణంగా రాష్ట్రస్థారుులో జిల్లా స్థానంపై ప్రభావం కనిపిస్తోంది. మెప్మా, కార్మికశాఖ, జిల్లా ఉపాధి కార్యాలయం, ఎస్ఈ కన్స్టక్ష్రన్స, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ కార్యాలయం, సమాచార పౌరసంబంధాల అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయం, జిల్లా యువజన సంక్షేమశాఖ, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్, గిద్దలూరు అటవీశాఖ కార్యాలయం, ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారుు. ఈ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలను ఈ-ఆఫీసు ద్వారా తక్కువగా పంపిస్తుండటంతో డబుల్ డిజిట్స్‌కు కూడా చేరుకోలేకపోతున్నారుు. -
మొబైల్ బ్యాంకింగ్‌పై దృష్టి పెట్టండి
కలెక్టర్ సుజాతశర్మ ఆదేశం ఒంగోలు టౌన్ : జిల్లాలో బ్యాంకు ఖాతాదారులంతా మొబైల్ బ్యాంకింగ్‌లో రిజిస్టర్ చేసుకుని ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే నగదు రహిత లావాదేవీలు జరిపేలా చూడాలని కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. మిషన్ మోడ్‌లో మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేపట్టాలని సూచించారు. గురువారం సాయంత్రం ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, బ్యాంకర్లు, ఏపీఓలు, ఏపీఎంలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని విసృ్తతంగా వినియోగించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసిన కారణంగా చిన్ననోట్లు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడేలా వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. మొబైల్ బ్యాంకింగ్ సేవలు, స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ సౌకర్యంతో, ఈ పాస్ విధానం, ఏటీఎంల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిగేలా చూడాలన్నారు. మండల స్థారుులో ఎంపీడీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లకు మొబైల్ బ్యాంకింగ్ సేవలపై శిక్షణ ఇప్పించి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలు, డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు మొబైల్ బ్యాంకింగ్ వినియోగించే విధానం గురించి అవగాహన కలిగించాలని సూచించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు, ఉపాధి కూలీలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతుందన్నారు. 30 నాటికి ప్రభుత్వ ఉద్యోగులంతా రిజిస్టర్ చేయాలి... జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ నెల 30వ తేదీ నాటికి మొబైల్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న వారందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలన్నారు. ఇన్ యాక్టివ్‌లో ఉన్న ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని, బ్యాంకు ఖాతా నంబర్లకు ఆధార్ అనుసంధానం చేయాలని వివరించారు. జన్‌ధన్ ఖాతా కలిగిన లబ్ధిదారులకు రూపే కార్డు ఉండాలని, బ్యాంకులో పంపిణీ చేయకుండా మిగిలిపోరుున రూపే కార్డులను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జారుుంట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ జిల్లాలోని చౌకధరల దుకాణదారులంతా బ్యాంకు ఖాతాలు తెరవాలని తెలిపారు. వారంతా బిజినెస్ కరస్పాండెంట్లుగా వ్యవహరిస్తారన్నారు. ప్రజలతో సంబంధం కలిగిన వ్యాపార సంస్థలన్నీ ఈ పాస్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సలో జారుుంట్ కలెక్టర్-2 ఐ.ప్రకాష్‌కుమార్, ఇన్చార్జి డీఆర్ఓ భక్తవత్సలరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
'పచ్చ' కలెక్టర్..!
ఒంగోలు : యద్దనపూడి మండలం చింతపల్లిపాడులో సోమవారం నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో కలెక్టర్ సుజాతశర్మ తెలుగుదేశం పార్టీ జెండాలతో అలంకరించిన ఎడ్లబండిపై ఊరేగడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పలు విమర్శలకు తావిచ్చింది. ఏరువాక కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాదు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. తొలకరి వర్షాల నేపథ్యంలో ఏరువాక పౌర్ణమి నాడు వ్యవసాయ పనులు ప్రారంభించడం రైతులకు ఆనవాయితీ. ఈ ఏడాది తొలిసారిగా ఏరువాక కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ఆత్మ శాఖ నిధులు వినియోగించుకోవాలని సూచించింది. ఇందుకోసం కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. దానిలో భాగంగా పర్చూరు నియోజకవర్గంలోని యద్దనపూడి మండలం చింతపల్లిపాడులో అధికారులు సోమవారం ఏరువాక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌తో పాటు జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, టీడీపీ నేత కరణం బలరాం, స్థానిక ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడ్లబండిపై ఊరేగింపు నిర్వహించారు. అయితే, ఆ ఎడ్లబండిని తెలుగుదేశం జెండాలతో అలంకరించి పసుపుమయం చేశారు. అదే బండిపై మంత్రి, టీడీపీ నేతలతో కలిసి కలెక్టర్ సుజాతశర్మ ఊరేగారు. పార్టీలకతీతంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాత్రం టీడీపీ జెండాలు కట్టిన బండిలో ఊరేగడం విమర్శలకు దారితీసింది. -
జేసీ బదిలీ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుజాతశర్మ బదిలీ అయ్యారు. ఆమెను వాణిజ్య పన్నులశాఖ హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ డీఆర్డీఏ పీడీగా ఉన్న ఆమెను అప్పటికే జిల్లాలో ఆమె భర్త సర్వశ్రేష్ట త్రిపాఠి పనిచేస్తుండటంతో జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. 2006 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సుజాతశర్మ మొదటి పోస్టింగ్ ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా వచ్చారు. అనంతరం ఉట్నూర్ ఐటీడీఏ పీవో గా కొనసాగారు. ఆ తరువాత వరంగల్ డీఆర్డీఏ పీడీగా వెళ్లారు. అనంతరం 2011 నవంబర్ 18న జేసీగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు రెండేళ్లపాటు జిల్లాలో పనిచేస్తున్న ఆమె కలెక్టర్ అహ్మద్‌బాబు ఈనెల 11 నుంచి 18 వరకు సెలవులపై వెళ్లడంతో ప్రస్తుతం జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె భర్త సర్వశ్రేష్ట త్రిపాఠి జిల్లా ఎస్పీగా ప నిచేస్తూ ఇటీవలే సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ కాగా, సుజాతశర్మను ప్రభుత్వం వాణి జ్య పన్నులశాఖ కార్యదర్శిగా నియమించింది. కాగా కలెక్టర్ సెలవుల నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆమె ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యే అవకాశాలున్నట్లు అధికారవర్గాల సమాచారం. జిల్లాలో ఆమె సమర్థవంతమైన అధికారిణిగా జిల్లాలో పేరు తెచ్చుకున్నారు. కాగా బదిలీ అయిన జేసీ సుజాతశర్మ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఉట్నూరు ఏఎస్పీకి వరంగల్ రూరల్ ఓఎస్డీగా పదోన్నతి ఐపీఎస్ అధికారి, ఉట్నూర్ ఏఎస్పీగా పనిచేస్తున్న అంబర్ కిషోర్‌ఝా వరంగల్ రూరల్ ఓఎస్డీగా పదోన్నతిపై బదిలీ చేశారు. అప్పటివరకు డీఎస్పీ స్థాయికే పరిమితమైన ఉట్నూరు సబ్ డివిజన్‌కు మొదటిసారిగా 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంబర్ కిశోర్ఝాను 2011 డిసెంబర్ 12న నియమించారు. సుమారు 23 నెలలపాటు ఉట్నూరు ఏఎస్పీగా పనిచేసిన ఆయన మొదటి పోస్టింగ్‌లోనే సమర్థవంతమైన పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఉట్నూరు, ఇంద్రవెల్లి, గుడిహత్నూరు తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల డంపులను ఈయన హయాంలోనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు జిల్లా కమిటీ, మరో ఇద్దరు దళకమాండర్ స్థాయి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. కాగా నిర్మల్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్టు మొదలుకుని.. రిమాండ్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన కీలక కేసుకు అంబర్ కిషోర్ఝానే సారథ్యం వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసు సేవలను అందించడంతోపాటు నిజాయతీ గల పోలీసు అధికారిగా మంచి పేరుంది. బెల్లంపల్లి అడిషనల్ భాస్కర్‌రావు బదిలీ బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ ఓరం భాస్కర్‌రావును కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. 2011 డిసెంబర్ 2న బెల్లంపల్లి అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన సుమారు రెండేళ్లపాటు పనిచేశారు. ఎస్పీగా పదోన్నతి జాబితాలో ఉన్న ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. 1989వ ఎస్సై బ్యాచ్‌కు చెందిన భాస్కర్‌రావు కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన వారు. వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐగా పనిచేసిన ఆయన తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణలో పేరు సంపాదించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా రాష్ట్రస్థాయిలో పేరున్న ఆయన డీఎస్పీ పదోన్నతిపై నిర్మల్‌లో నియామకమైన ఏడాదిన్నరకు మంచిర్యాల డీఎస్పీగా బదిలీ అయ్యారు. అనంతరం అడిషనల్ ఎస్పీ పదోన్నతిపై బెల్లంపల్లిలో 2011 డిసెంబర్ 2న నియమితులైన భాస్కర్‌రావు గురువారం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన భరత్‌భూషణ్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏఎస్పీగా పనిచేస్తూ బదిలీపై వస్తున్నారు.