మొబైల్ బ్యాంకింగ్‌పై దృష్టి పెట్టండి
కలెక్టర్ సుజాతశర్మ ఆదేశం
ఒంగోలు టౌన్ : జిల్లాలో బ్యాంకు ఖాతాదారులంతా మొబైల్ బ్యాంకింగ్‌లో రిజిస్టర్ చేసుకుని ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే నగదు రహిత లావాదేవీలు జరిపేలా చూడాలని కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. మిషన్ మోడ్‌లో మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేపట్టాలని సూచించారు. గురువారం సాయంత్రం ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, బ్యాంకర్లు, ఏపీఓలు, ఏపీఎంలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లతో ఆమె వీడియో కాన్ఫరెన్‌స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని విసృ్తతంగా వినియోగించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసిన కారణంగా చిన్ననోట్లు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడేలా వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారు.
మొబైల్ బ్యాంకింగ్ సేవలు, స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ సౌకర్యంతో, ఈ పాస్ విధానం, ఏటీఎంల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిగేలా చూడాలన్నారు. మండల స్థారుులో ఎంపీడీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లకు మొబైల్ బ్యాంకింగ్ సేవలపై శిక్షణ ఇప్పించి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలు, డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు మొబైల్ బ్యాంకింగ్ వినియోగించే విధానం గురించి అవగాహన కలిగించాలని సూచించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు, ఉపాధి కూలీలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతుందన్నారు.
30 నాటికి ప్రభుత్వ ఉద్యోగులంతా రిజిస్టర్ చేయాలి...
జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ నెల 30వ తేదీ నాటికి మొబైల్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న వారందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలన్నారు. ఇన్ యాక్టివ్‌లో ఉన్న ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని, బ్యాంకు ఖాతా నంబర్లకు ఆధార్ అనుసంధానం చేయాలని వివరించారు. జన్‌ధన్ ఖాతా కలిగిన లబ్ధిదారులకు రూపే కార్డు ఉండాలని, బ్యాంకులో పంపిణీ చేయకుండా మిగిలిపోరుున రూపే కార్డులను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జారుుంట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ జిల్లాలోని చౌకధరల దుకాణదారులంతా బ్యాంకు ఖాతాలు తెరవాలని తెలిపారు. వారంతా బిజినెస్ కరస్పాండెంట్లుగా వ్యవహరిస్తారన్నారు. ప్రజలతో సంబంధం కలిగిన వ్యాపార సంస్థలన్నీ ఈ పాస్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్‌సలో జారుుంట్ కలెక్టర్-2 ఐ.ప్రకాష్‌కుమార్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ భక్తవత్సలరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.