అంకిత భావంతో పనిచేస్తే సత్ఫలితాలు | collector sujatha sarma meeting | Sakshi
Sakshi News home page

అంకిత భావంతో పనిచేస్తే సత్ఫలితాలు

Published Sat, Dec 3 2016 3:54 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

అంకిత భావంతో పనిచేస్తే సత్ఫలితాలు

అంకిత భావంతో పనిచేస్తే సత్ఫలితాలు

ఒంగోలు సెంట్రల్: జిల్లా నీటి యాజమాన్య సంస్థి సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించచ్చని కలెక్టర్ సుజాత శర్మ అన్నారు. నగరంలోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో జిల్లా జీవనోపాదుల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో కలిసి ఆమె శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ. 1.57 కోట్లతో ఈ భవనం నిర్మాణం చేపట్టడం ద్వారా శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 22 వేల మంది ఉపాధి కూలీలకు వంద రోజుల పనిదినాలు కల్పించడం జరిగిందన్నారు.

ఇంకా 60 వేల మంది వేతన కూలీలకు వంద రోజుల పని దినాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో సరాసరి వేతన కూలీలకు రోజువారీ వేతనం రూ. 134లను మాత్రమే అందించడం జరుగుతుందన్నారు. కూలీలలో అవగాహన కల్పించి సరాసరి రోజు వారీ వేతనం రూ. 194లు పొందేలా చూడాలని కలెక్టర్ అధికారులు, సిబ్బందికి సూచించారు. జిల్లాలో నీటి వనరులు తక్కువగా ఉన్నాయని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పంట సంజీవని, ఊటకుంటలు ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో డ్వామా సంస్థ ద్వారా 3 రోజుల్లో పే ఆర్డర్ జనరేట్ చేసి వేతన కూలీలకు వేతనం అందిస్తున్నట్లు నివేదికలు కన్పిస్తున్నాయన్నారు. క్షేత్ర స్థారుులో నిర్దేశించిన పనులు అమలు కావడంలేదన్నారు. అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి కష్టపడి పని చేసి వేతన కూలీలకు సకాలంలో సక్రమంగా వేతనం అందేలా చూడాలన్నారు. గ్రామాల్లో పొస్టాఫీసుల నుంచి వేతన కూలీలకు వేతనం అందుతున్నదీ లేనిది పరిశీలించాలన్నారు. ఎస్‌బీఐ ద్వారా రూ. 30 కోట్లు హెడ్ పోస్టుఫీసుకు నిధులు విడుదల అయ్యాయన్నారు.

వేతన కూలీలకు అందాల్సిన వేతనం గ్రామీణ ప్రాంత పోస్టాఫీసుల ద్వారా అందేలా చూడాలన్నారు. వేతన కూలీల్లో భయాందోళనలను తొలగించాలన్నారు. సంపూర్త పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా డ్వామా, డీఆర్‌డీఏ సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యంపై గ్రామీణ ప్రాంత ప్రజల్లో విసృ్తతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. డ్వామా, డీఆర్‌డీఏ సంస్థ అధికారులు, సిబ్బంది టార్గెట్ గ్రూపులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన చేపట్టి మోభైల్ బ్యాంకింగ్ సదుపాయం వినియెగించుకునేలా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. అధికారులు, సిబ్బంది లబ్ధిదారులతో మోభైల్ బ్యాం కింగ్ సేవలపై అవగాహన కల్పించే విషయంలో సేవాభావంతో పనిచేయాలని సూచించారు. టార్గెట్ గ్రూపులు వంద శాతం మొబైల్‌బ్యాంకింగ్ సదుపాయం వినియెగించుకునేలా చూడాలన్నారు.


 ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ప్రభుత్వం పంట సంజీవని కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. డ్వామా సంస్థ ద్వారా జిల్లాలోని రైతులందరూ తమ పొలాల్లో నీటి కుంటలు, ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్ మాట్లాడుతూ శిక్షణా కేంద్రాల వల్ల పలు ప్రయెజనాలున్నాయన్నారు. లబ్ధిదారుల్లో నైపుణ్యత, టాలెంట్, మెరుగు పరుచుకోవడానికి శిక్షణలు ఉపయెగపడతాయన్నారు. ఈ సందర్భంగా డ్వామా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఎన్. పోలప్ప, డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్ మురళీ, ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, డ్వామా ఏపీడీలు బి. రమేష్ బాబు, ఆర్. భవానీ, ఏపీడీలు కాత్యాయని, సుబ్బారావు, మీరావలి,  గృహనిర్మాణ శాఖ డీఈ వి. దశరధి శర్మ, లక్ష్మి నారాయణ, ఈఈ కె. బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement