సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యేక హోదా విభజన అంశాల పరిష్కారం ఎక్కడ కనపించలేదని ఏఐసీసీ సెక్రటరీ గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. శనివారమిక్కడ విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ ఏపీకి పూర్తిగా నిరాశే మిగిల్చిందని ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్‌కు, ట్రిపుల్ ఐటీ సంస్థలకు ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు. రాజధాని అమరావతికి కూడా నిధులు కేటాయించలేదని.. పెద్ద ఎత్తున నిధులు యివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో కూడా నిధుల గురించి చర్చించారని గుర్తు చేశారు. ఏపీకి లోటు బడ్జెట్ ఉందని.. న్యాయం చేయాలని రుద్రరాజు డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యులకు భారం మిగిల్చారని మండిపడ్డారు. ఏపీలో బీజేపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. రాహుల్ గాంధీ రాజీనామా చేశారన్నానరు. త్వరలోనే కొత్త అధ్యక్షుడు వస్తాడని తెలిపారు. నూతనంగా వచ్చే అధ్యక్షుడి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment