gidugu rudraraju
-
AP: ఏపీ పీసీసీ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. దీంతో, త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ రానున్నారు. వివరాల ప్రకారం.. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రుద్రరాజు తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఏపీకి కొత్త పీసీసీ చీఫ్‌ను ఏఐసీసీ నియమించే అవకాశం ఉంది. -
ఏపీలో కూడా పవన్ అట్టర్ ప్లాఫ్ కావడం ఖాయం: గిడుగు రుద్రరాజు
సాక్షి, ఢిల్లీ: పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు, సిద్ధాంతాలపై క్లారిటీ లేదని.. మొన్నటి దాకా లెఫ్ట్ అన్నారు.. ఇప్పుడు రైట్ అంటున్నారంటూ ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో సాక్షి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో పవన్ కళ్యాణ్ అట్టర్ ప్లాప్ అయ్యారని, ఏపీలో కూడా అట్టర్ ప్లాఫ్ కావడం ఖాయమన్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్, బీజేపీ.. బీసీ సీఎంను ప్రకటించారు. మరి ఏపీలో కూడా పవన్, చంద్రబాబు బీసీని సీఎంను చేస్తామని ప్రకటిస్తారా ? అని గిడుగు ప్రశ్నించారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సీపీఐ, సీపీఎంతో కలిసి పొత్తు పెట్టుకుంటాం. ఈ అంశంపై త్వరలోనే ఏఐసీసీ పెద్దలతో స్ట్రాటజీ మీటింగ్ ఉంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచురిని కలుస్తా. తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. ఏపీలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి ఇండియా కూటమిగా పోటీ చేస్తాం’’ అని రుద్రరాజు పేర్కొన్నారు. దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోంది. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ దీనికి నిదర్శనం. దీనికి నిరసనగానే జంతర్ మంతర్‌లో ధర్నాకు దిగామని గిడుగు రుద్రరాజు అన్నారు. ఇదీ చదవండి: బానిసగా మారిన గురువు -
బీజేపీ డబుల్ ఇంజిన్ పై ఏపీ కాంగ్రెస్ పీసీసీ రుద్రరాజు కీలక వ్యాఖ్యలు
-
ఏపీ పీసీసీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు బుధవారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడింది. చాలాకాలంగా ఏపీసీసీ చీఫ్‌ను మార్చే యోచనలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. శైలజానాథ్ పనితీరు సరిగా లేదని అధిష్టానం భావిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఏడాది కాలంగా పలువురి పేర్లను పరిశీలించింది. ఇక శైలజనాథ్‌ను పీసీసీ చీఫ్‌గా తొలగిస్తూనే.. గిడుగు రుద్రరాజు నియామకానికి మొగ్గు చూపించింది ఏఐసీసీ. గిడుగు రుద్రరాజు.. ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా రాష్ట్ర సహాయ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు వైఎస్సార్, కెవీపీలకు సన్నిహితుడిగా మెలిగారు. చిన్ననాటి నుంచి కాంగ్రెస్‌లోనే పెరిగిన గిడుగు.. పార్టీ కోసం చురుగ్గా తిరగ గలుగుతారనే అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో హస్తం పార్టీ బలోపేతానికి పద్దెనిమిది మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, 34 మందితో కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్‌వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పీ రాకేష్, ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్‌గా పల్లంరాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్, మీడియా కమిటీ చైర్మన్‌గా తులసిరెడ్డిలను నియమిస్తున్నట్లు ప్రకటించింది ఏఐసీసీ. ఇదీ చదవండి: శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం -
త్వరలో ఏపీసీసీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఉంది వీరే?
సాక్షి, ఢిల్లీ: ఏపీ కాంగ్రెస్ పార్టీకి త్వరలో అధ్యక్షుడిని నియమించనున్నారు. ప్రస్తుత ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పనితీరు సరిగా లేదని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం అంతర్గతంగా కసరత్తు చేపట్టింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఉమెన్ చాందీ ఈ అంశంపై పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీసీసీ చీఫ్‌గా రఘువీరారెడ్డి రాజీనామా చేసిన తర్వాత నియమితులైన శైలజానాథ్ ఆ స్థాయిలో పనితీరు కనబర్చలేదని హైకమాండ్ నిర్దారణకు వచ్చింది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించి, కనీసం తాము ఉన్నామని చాటుకోవాలని భావిస్తోంది. చదవండి: ‘బీజేపీని చూస్తుంటే జాలేస్తుంది.. ఏపీలో అంతా రివర్స్’ ఇందుకోసం పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటారని అన్వేషిస్తోంది. ప్రస్తుతానికి మాజీ కేంద్రమంత్రి చింతామోహన్, ఏఐసీసీ కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీ పేర్లు ఏఐసిసి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేర్లపై ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలను ఏపీ వ్యవహారాల ఇన్చార్జి ఉమెన్ చాందీ సేకరించనున్నారు. ఇందుకోసం త్వరలో హైదరాబాద్, విజయవాడలలో స్వయంగా పర్యటించేందుకు ఉమెన్ చాందీ పర్యటను ఖరారు చేసుకుంటున్నారు. మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, పల్లంరాజు తదితర నేతలను ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉంది. ఈ సీనియర్ల అభిప్రాయాలను సేకరించి ఒక నివేదికను జనవరి నెలాఖరులోగా హైకమాండ్‌కు అందించనున్నారు. ఏపిసిసి చీఫ్ పదవిపై సీనియర్లెవరు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, పోటీ కూడా నామమాత్రంగానే ఉంది. రాష్ట్ర రాజకీయ చిత్రంలో కనీసం కాంగ్రెస్ పార్టీని ఉనికినైనా చాటగలిగే నాయకుడు కావాలని హైకమాండ్ ప్రయత్నిస్తోంది. పీసీసీ రేసులో ఉన్న చింతామోహన్ కు కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ప్లస్ పాయింట్ కాగా, 67 ఏళ్ల పై వయసు ఉండడంతో ఆయన రాష్ట్ర మంతటా చురుగ్గా తిరిగి పార్టీని గాడిలో పెట్టలేరనే వాదన ఉంది. అయితే గిడుగు రుద్రరాజు ఏఐసిసి కార్యదర్శిగా ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర సహాయ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు వైఎస్సార్, కెవిపి సన్నిహితుడిగా పేరుపొందారు. చిన్ననాటి నుంచి కాంగ్రెస్‌లోనే పెరిగిన గిడుగు 52 ఏళ్ల వయసులో ఉండడంతో పార్టీ కోసం చురుగ్గా తిరగ గలుగుతారనే ప్రచారం జరుగుతోంది. మరీ ఈ ఇద్దరిలో పదవి ఎవరికి ఇస్తారో చూడాలి. -
బడ్జెట్లో విభజన అంశాలను పట్టించుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యేక హోదా విభజన అంశాల పరిష్కారం ఎక్కడ కనపించలేదని ఏఐసీసీ సెక్రటరీ గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. శనివారమిక్కడ విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ ఏపీకి పూర్తిగా నిరాశే మిగిల్చిందని ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్‌కు, ట్రిపుల్ ఐటీ సంస్థలకు ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు. రాజధాని అమరావతికి కూడా నిధులు కేటాయించలేదని.. పెద్ద ఎత్తున నిధులు యివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో కూడా నిధుల గురించి చర్చించారని గుర్తు చేశారు. ఏపీకి లోటు బడ్జెట్ ఉందని.. న్యాయం చేయాలని రుద్రరాజు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యులకు భారం మిగిల్చారని మండిపడ్డారు. ఏపీలో బీజేపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. రాహుల్ గాంధీ రాజీనామా చేశారన్నానరు. త్వరలోనే కొత్త అధ్యక్షుడు వస్తాడని తెలిపారు. నూతనంగా వచ్చే అధ్యక్షుడి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. -
మోదీ ఇమేజ్ మసకబారుతోంది
కాకినాడ / మధురపూడి (రాజానగరం): అసమర్థ విధానాల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ క్రమంగా పడిపోతోందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు అన్నారు. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులైన అనంతరం తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఆ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి కాకినాడకు ర్యాలీగా ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా కాకినాడలోను, అంతకుముందు ర్యాలీ సాగిన మార్గంలో దోసకాయలపల్లి గ్రామంలోను రుద్రరాజు విలేకర్లతో మాట్లాడారు. 2019 నాటికి మోదీ సర్కార్ గ్రాఫ్ తోకచుక్క రాలినంత వేగంగా పడిపోతుందన్న విషయాన్ని పరిణతి చెందిన రాజకీయ విశ్లేషకులు సహితం స్పష్టం చేస్తున్నారన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గం సంతృప్తికరంగా లేదన్నారు. విభజన హామీలు అమలు కాకపోవడం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సహా అనేక అంశాల విషయంలో బీజేపీ సర్కార్ వైఖరిపై రాష్ట్ర ప్రజలు అసహనంతో ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి అందించిన నిధులు, వాటి ఖర్చుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఎన్నో నిధులు విడుదల చేశామని, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు సక్రమంగా ఖర్చు చేయలేదని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగేళ్లుగా తాత్సారం చేశాయని ఆరోపించారు. హోదా వచ్చేది కాంగ్రెస్తోనేని గిడుగు అన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తోందని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనన్నారు. యూపీఏ అధికారంలోకి రాగానే విభజన చట్టంలోని 19 అంశాలూ అమలవుతాయని చెప్పారు. కాంగ్రెస్ పూర్వ వైభవానికి కృషి చేస్తా కాకినాడ: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే తన ప్రధాన కర్తవ్యమని, ఇందుకోసం నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పని చేస్తానని గిడుగు రుద్రరాజు అన్నారు. డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం కాకినాడలోని కళావెంకట్రావు భవన్లో జిల్లా కాంగ్రెస్ విస్తృత సమావేశం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులైన గిడుగును పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించాయి. సాధారణ కార్యకర్తగా పార్టీలో సేవలు అందిస్తున్న తనను మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తించి, ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించారన్నారు. వైఎస్సార్ ప్రోత్సాహంతోనే ఎమ్మెల్సీగా, వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్‌గా సేవలు అందించగలిగానన్నారు. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేశాయని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పీసీసీ కార్యదర్శులు ఎస్ఎన్ రాజా, మట్టా శివప్రసాద్, బోణం భాస్కర్, ఐఎన్టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సబ్బతి ఫణీశ్వరరావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట్, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాపై స్పందించిన చిరంజీవి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎప్పటికైన ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 2019లో రాహుల్ గాంధీ ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పడూ మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సహా ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్‌గా నియమితులైన గిడుగు రుద్రరాజు.. శనివారం చిరంజీవిని హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజును ఆయన అభినందించినట్టు ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
సీఎంగా మరోనేతకు ఛాన్స్ ఇవ్వాలి!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మాట మారుస్తారని, ఆయన మాటలు మారుస్తున్న తీరును గమనిస్తే సీఎం మానసిక స్థితిమీద అనుమానం కలుగుతోందని ఏపీసీసీ నేతలు మండిపడ్డారు. హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగేళ్లలో పలు సందర్భాల్లో చంద్రబాబు తడవకొక మాట మాట్లాడారని, నిన్న (మంగళవారం) టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాటలు లీకుల రూపంలో మీడియాకు ఇచ్చారని ఆరోపించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, ఎస్.రాజాలు బుధవారం ఇక్కడి ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లీకుల రూపంలో మీడియాకు లీకులిస్తూ సీఎం చంద్రబాబు ఊసరవెల్లిలా మారారని అర్థమవుతోందని, ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. సీఎం స్థానంలో టీడీపీ మరొకరికి అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం సొంతజిల్లా చిత్తూరులో చంద్రబాబుకు అబద్ధాల నాయుడిగా నిక్ నేమ్ ఉండగా, ఇప్పుడు లీకుల నాయుడిగా మరోపేరు జత చేరిందన్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ కాదని, అది ఏపీ హక్కు అని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన చట్టబద్ధమైన హామీలను సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకుని మరో నేతకు చంద్రబాబు అవకాశం ఇవ్వాలని ఏపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వాటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్లో ఎంపీ మల్లికార్జున ఖర్గే రూల్ 184 కింద నోటీసు ఇచ్చారని, టీడీపీ, వైఎస్ఆర్సీపీ నేతలు లోక్‌సభలో చర్చలో పాల్గొనాలని సూచించారు. మార్చి 6, 7, 8 తేదీల్లో ఛలో పార్లమెంట్ పేరిట అంతిమ పోరాటానికి పిలుపునిస్తూ ఏపీపీసీ ఉద్యమ కార్యాచరణ ఢిల్లీలో చేపట్టనున్నామని, ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలసి రావాల్సిందిగా కోరుతూ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి లేఖలు రాయనున్నట్లు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, ఎస్.రాజాలు వెల్లడించారు. -
బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే హోదా కోసం పోరాడాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, టీడీపీ ఎన్నికల హామీలను పక్కదోవ పట్టించేందుకే సీఎం చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలు చేపట్టారని, హోదా కోసం పోరాట దీక్షలు చేయాలని ఏపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. సమైక్య ఉద్యమాలు జరిగిన ప్రదేశాల్లో నవనిర్మాణ దీక్షలు చేసి విభజన గాయాలను గుర్తుచేస్తూ వారం పాటు కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడాన్ని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యేక హోదా అమలు కోరుతూ పోరాట దీక్షలు చేయాలని ఏపీసీసీ కమిటీ వారు సూచించారు. ఇందిరా భవన్ లో గురువారం మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, సాకే శైలజానాథ్, పార్టీ ఉపాధ్యక్షుడు సూర్యా నాయక్, ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ లతో కలిసి గిడుగు రుద్రరాజు మీడియా సమవేశంలో పాల్గొన్నారు. రెండేళ్ల తమ పాలనలో ప్రత్యేక హోదా సాధించలేని తమ అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి, 2014లో ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీలను మరిపించడానికి కుట్ర పూరితంగా నవనిర్మాణ దీక్షల పేరిట పిలుపునివ్వడం చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగమని వారు మండిపడ్డారు.