'అఖిలపక్ష భేటీని అన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించాలి' | All political parties boycott all-party meeting, demands Andhra Pradesh parirakshana vedika member | Sakshi
Sakshi News home page

'అఖిలపక్ష భేటీని అన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించాలి'

Published Fri, Nov 1 2013 12:12 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

All political parties boycott all-party meeting, demands Andhra Pradesh parirakshana vedika member

కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష భేటీని బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్ రెడ్డి అన్ని రాజకీయపార్టీలకు పిలుపు నిచ్చారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికట్ 3ను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.

 

రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన వేదకను కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కమిటీ నివేదికను పక్కనపెట్టి ఓట్లు, సీట్లు కోసం రాష్ట్ర విభజన చేయడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. అయితే అఖిల పక్ష సమావేశానికి కేంద్రం ఇచ్చిన గడువు చాలా తక్కువగా ఉందని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement