నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి | all set for muncipal elections nominations | Sakshi
Sakshi News home page

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

Published Sun, Mar 9 2014 10:23 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

all set for muncipal elections nominations

 సంగారెడ్డి మున్సిపాలిటి న్యూస్‌లైన్:
 మున్సిపల్ ఎన్నికలలో పోటి చేసేందుకుగాను సోమవారం నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల అధికారి సాయిలు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల ఆదేశాల మేరకు సంగారెడ్డి మున్సిపల్ కార్యలయంలో 8 కౌంటర్ల ద్వార నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేశారు. పట్టణంలో 31 వార్డులు ఉండగా 50 పొలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఈ నెల 10 నుండి 14 వరకు  ప్రతి రోజు ఉదయం 11 నుండి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం 8 మంది తాహశీల్దారులను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల సమయంలో ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి అభ్యర్థి వెంట నామినేషన్ దాఖలు చేసేందుకు ఇద్దరిని మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణకోసం 50 మంది ప్రొసీడింగ్‌అధికారులను, 200 మంది పోలింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇందుకోసం 50 ఇవిఎంలను వినియోగించడంతో పాటు మరో 5 ఇవిఎంలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
 
 సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలివే...
 పట్టణంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు గుర్తించారు. నేతాజీనగర్, రహమత్‌పూర్, తలబ్, బసవేశ్వర్‌నగర్, నలందానగర్, మాధవనగర్, ఉస్మాన్‌పూర్, సోమేశ్వరవాడ, శివాజీనగర్, మగ్దుంనగర్, శాంతినగర్, సంజీవనగర్, నారాయణరెడ్డి కాలనీ, మార్క్స్‌నగర్, సిద్దార్థనగర్, గణేష్‌నగర్, రాజంపేట, గండిపోచమ్మ ఆలయం, రాంచెందారెడ్డికాలనీ, ఇందిరాకాలనీలను గుర్తించినట్లు చెప్పారు.
 
 అతిసమస్యాత్మక కేంద్రాలు....
 పట్టణంలోని అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఉప్పర్‌బజార్, అస్తబల్, మగ్దుంనగర్, నాల్సాబ్‌గడ్డ, రిక్షాకాలనీ, ఫిల్టర్‌బెడ్‌కాలనీలను గుర్తించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement