దసరాకు సర్వం సన్నద్ధం | all set to celebrate dasara festival | Sakshi
Sakshi News home page

దసరాకు సర్వం సన్నద్ధం

Published Sun, Oct 13 2013 2:18 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

all set to celebrate dasara festival

 ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ :
 ఆదిలాబాద్ మండలం మావల గ్రామ పంచాయతీ పరిధిలోని రాంలీలా మైదానంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రావణాసుడిని దహనం చేయనున్నారు. అంతకుముందు కన్యక పరమేశ్వరీ మందిరంలో భారత మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్ర ప్రారంభిస్తారు. భైంసాలోని సాయిబాబా మందిరంలో మైసమ్మగుట్ట వద్ద దసరా వేడుకలు జరుపుకోనున్నారు. ఆసిఫాబాద్‌లోని అభయాంజనేయస్వామి ఆలయ సమీపంలో దసరా వేడుకలు జరగనున్నాయి. ప్రత్యేకించి 31 అడుగులతో నరకాసురుడి వధ చేపట్టనున్నారు. మంచిర్యాలలోని గోదావరి తీరాన గౌతమేశ్వరి ఆలయం పరిధిలో గల జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
 
  అంతకుముందు ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి జమ్మి చెట్టు వద్ద విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. నిర్మల్‌లోని మంగల్‌పేట్‌లో గల మహాలక్ష్మి ఆలయంలో రావణాసురుడిని దహనం చేస్తారు. బెల్లంపల్లిలోని సింగరేణి తిలక్ స్టేడియంలో రావణాసురుడి వధకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగజ్‌నగర్‌లో పెనుల్ పహాడ్ మైదానంలో రావణుడి దహనం చేయనున్నారు.
 
 ఆయుధ పూజ
 విజయదశమి వేడుకల్లో భాగంగా జమ్మిచెట్టు, ఆయుధాలను పూజిస్తారు. జమ్మిచెట్టు కొమ్మలను తీసుకుని వచ్చి దేవాలయాలు, ముఖ్య కూడళ్లలో ఉంచుతారు. పూజల అనంతరం ఆకులను తీసుకుని బంధుమిత్రులకు, పెద్దలకు అందించి దీవెనలు తీసుకోవడం అనావాయితీ. ఎదుటి వారికి ఇచ్చి ఆలింగనం చేసుకుంటారు. తెలంగాణలో ఇంటిల్లిపాదీ ఆనందంగా జరుపుకునే అతి పెద్ద పండుగ దసరా. కొత్త బట్టలు ధరించి దేవాలయాలకు వెళ్లడం, కుంటుంబ సభ్యులంతా కలిసి పిండి వంటలు భుజించడం చేస్తారు. ఇదే రోజున రోజు పాలపిట్టను చూస్తే శుభసూచకంగా భావిస్తారు.
 
 శుభప్రదంగా..
 దసరా రోజు ఏ వస్తువులు కొనుగోలు చేసినా శుభప్రదంగా భావిస్తారు. కొత్త అల్లుళ్లకు సైతం దసరా రోజున వాహనాలు కొనివ్వడం కూడా సంప్రదాయంగా వస్తోంది. వ్యాపారాలు, దుకాణాలు నూతనంగా ప్రారంభిస్తారు. ఈ రోజు ప్రారంభించిన దుకాణాలు, కొనుగోలు చేసిన వస్తువులకు ఎటువంటి అరిష్టాలు జరగకుండా ఉంటాయని నమ్మకం. పాత యంత్రాలు, వాహనాలు సైతం శుభ్రం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదీ సంప్రదాయంగా వస్తోంది.
 
 పెద్దల దీవెన
 దసరా ఉత్సవాన్ని పురస్కరించుకొని రావణ సంహరణ జరిగిన అనంతరం ప్రజలు తమ తల్లిదండ్రులు, అక్కాచెల్లెల దీవెనలు, పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. తోటి స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటారు. చిన్నాపెద్ద తేడా లేకుండా కొత్త దుస్తులను ధరించి ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుని పిండి వంటకాలు చేసి విందు ఆరగిస్తారు.
 
 ముస్తాబైన రాంలీలా మైదానం
 జిల్లా కేంద్రంలోని మావల గ్రామ పంచాయతీ పరిధి దస్నాపూర్ రాంలీలా మైదానంలో దసరా పండగకు మైదనాన్ని శనివారం ముస్తాబు చేశారు. పంచాయతీ కార్మికులతో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఉష్కం రఘపతి పనులను పరిశీలించారు. కన్యక పరమేశ్వరీ ఆలయం భరత మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి రాంలీలా మైదానానికి శోభాయాత్రగా వెళ్తారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే జోగురామన్న, జిల్లా సెషన్స్ జడ్జి బి.గోపాల కృష్ణమూర్తి, జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠీలు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రవక్త గణతే హరిప్రకాశ్‌రావు పాల్గొంటార ు.
 
  నేడు దశమి
 బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ఈ సంవత్సరం విజయదశమి వే డుకలను ఏ రోజు జరుపుకోవాలనే అంశంపై ప్రజల్లో అ నుమానాలు తలెత్తాయి. పండుగ ఆదివారమా? సోమవార మా? అన్న సందేహాలు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితి ఇదివరలో ఎన్నడూ తలెత్తలేదు. శాస్త్రం ప్రకారం మాత్రం ఆదివారం రోజునే విజయదశమి జరుపుకోవడం శ్రేష్టమని బెల్లంపల్లికి చెందిన ప్రముఖ వేద పండితుడు శ్రీనివాస్‌శర్మ పేర్కొన్నారు. ఆయన చెప్పిన ప్రకారం... విజయదశమిని జరుపుకోవాలంటే తప్పనిసరిగా శ్రవణ న క్షత్రం ఉండాలనేది శాస్త్రం చెబుతోంది. ఆది వారం ఉద యం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు శ్రవణ నక్షత్రం ఉంటోంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు 11 గంటల వరకు దశమి ఉంటోంది. ఆ ముహూర్తంలోనే జంబికి వెళ్లడానికి వీలు కలుగుతుంది. సోమవారం అలాంటి పరిస్థితులు లేవు. ఆ రోజు ఉదయం 11 గంటల వరకు మాత్రమే దశమి ఉం టుంది. శ్రవణ నక్షత్రం పూర్తిగా లేకపోవడంతో దసరాను జరుపుకోవడం శాస్త్ర రీత్యా సరికాదు. శ్రవణ నక్షత్రం లేని రోజున జంబికి వెళ్లడం కుదరదు. ఆ ప్రకారంగా సోమవా రం విజయదశమి జరుపుకోవడం ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. దివ్యమైన ముహూర్తం ఉన్న ఆదివారం రోజునే దసరా వేడుకలు జరుపుకోవడం మంచిదని శ్రీని వాస్‌శర్మ స్పష్టం చేశారు. జిల్లా అంతటా ఆదివారమే దసరా జరుపుకునేందుకు ప్రజలు సంసిద్ధమవుతున్నారు. అయితే ముథోల్, ఉట్నూర్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల ప్రజలు ఆదివారం, మరికొన్ని మండలాల ప్రజలు సోమవారం వేడుకలు జరుపుకోబోతున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement