
అన్నివిధాలా సిద్ధం: ఏపీ సీఎం
హుదూద్ బాధితుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1100
హైదరాబాద్: తుపానుతో కలిగే నష్టాన్ని కనిష్ట స్థాయిలో ఉంచడానికి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పా రు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం గా ఉన్నట్లు తెలిపారు. హుదూద్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, ‘క్రౌడ్ సోర్సింగ్’ పేరిట నూ తన విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. శనివారం లేక్‌వ్యూ క్యాంపు కార్యాలయంలో ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడా రు.
తుపాను బాధితులకు సహాయం, అవసరమైన సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1100 ఏర్పాటు చేశామని చెప్పారు. సచివాలయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడానికి వీలుగా ఢిల్లీ నుంచి 120 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది విమానంలో శనివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వారు జిల్లాలకు తరలివెళ్లడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నాలుగు జిల్లాల్లో 19 ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించారుు.