ఏసీబీకి చిక్కిన ఆళ్లగడ్డ విద్యుత్‌ ఏడీఈ | Allagadda power ade in ACB costody | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఆళ్లగడ్డ విద్యుత్‌ ఏడీఈ

Published Tue, Jul 11 2017 3:16 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఏసీబీకి చిక్కిన ఆళ్లగడ్డ విద్యుత్‌ ఏడీఈ - Sakshi

ఏసీబీకి చిక్కిన ఆళ్లగడ్డ విద్యుత్‌ ఏడీఈ

సాక్షి, అమరావతి/నంద్యాల/ఆళ్లగడ్డ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారనే సమాచారంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసిస్టెంట్‌ డివిజినల్‌ ఇంజినీర్‌ (ఏడీఈృ ఎలక్ట్రికల్‌) మద్దెల నాగరాజు ఆస్తులపై సోమవారం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు పెద్దఎత్తున దాడులు నిర్వ హించారు. అక్రమాస్తులు కూడబెట్టినట్టు సోదాల్లో తేలిందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ ఆర్పీ ఠాకూర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు, నంద్యాల, వెలుగోడు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లోని ఏడీఈ, ఆయన బంధువులు, సన్నిహి తుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు డీజీ పేర్కొన్నారు.. ఈ దాడుల్లో రూ.10కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. నాగరాజు స్నేహితులైన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ముఖ్య అనుచరులు, కోటకందుకూరు గ్రామ సర్పంచ్‌ రామ్మోహన్‌రెడ్డి, పట్టణానికి చెందిన రాముయాదవ్‌ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement