Illigal assets
-
‘ఏపీఎస్పీ’ అసిస్టెంట్ కమాండెంట్ ఇళ్లపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/చిత్తూరు అర్బన్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పంతుల శంకర్ నివాసాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు చేసింది. ఆయన అక్రమాస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదు రావడంతో తూర్పుగోదావరి, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని శంకర్ ఇళ్లు, అతని బంధువుల నివాసాల్లో ఏసీబీకి చెందిన 13 బృందాలు సోమవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ వివరాలను ఏసీబీ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. శంకర్ 1989 జనవరి 16న పోలీసు శాఖలో చేరాడు. 2001 జూన్‌లో ఇన్స్పెక్టర్గా, 2011 జూలైలో డీఎస్పీగా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనపై ఫిర్యాదు రావడంతో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. రూ.88.81 లక్షల విలువైన 3 నివాస గృహసముదాయాలున్నట్లు గుర్తించారు. రూ.32,64,500 విలువైన 9 ఇళ్ల స్థలాలు, రూ.22.51 లక్షల విలువైన 20.98 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.6.57 కోట్ల విలువైన రెండు పౌల్ట్రీ ఫార్మ్‌లు ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో తేలింది. రూ.59,400 నగదు, రూ.27 వేల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.28,99,812 ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.9,71,704 ఎస్బీఐ లైఫ్ ఇన్‌స్రూ?న్స్, రూ.2.70 లక్షల విలువైన బంగారం, రూ.47,340 విలువైన వెండి వస్తువులున్నట్లు ఏసీబీ సిబ్బంది గుర్తించారు. మొత్తంగా శంకర్ స్థిర, చర ఆస్తులు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.8,43,71,756గా లెక్క తేల్చిన ఏసీబీ.. అందులో రూ.2,46,85,516 అక్రమాస్తులుగా ప్రాథమిక అంచనాకు వచ్చింది. శంకర్‌ను అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ తెలిపింది. -
శివకుమార్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి డీకే శివకుమార్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం కేసు నమోదు చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో శివకుమార్‌కు చెందిన 14 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.57 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. శివకుమార్ సోదరుడు డీకే సురేశ్‌కు చెందిన రెండు నివాసాల్లోనూ(బెంగళూరు, ఢిల్లీ) సోదాలు నిర్వహించారు. డీకే శివకుమార్ గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పుడు రూ.74.93 కోట్ల విలువైన ఆస్తులు అక్రమంగా సంపాదించారని సీబీఐ ఆరోపిస్తోంది. ఇవన్నీ ఆయన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయని చెబుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ ఏడు నెలల క్రితం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్ చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గతంలోనే డీకే శివకుమార్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. డీకే శివకుమార్‌పై సీబీఐ కేసు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. కర్ణాటకలో నవంబర్ 3వ తేదీన రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని దెబ్బతీయడానికే డీకే శివకుమార్‌పై కేసు పెట్టారని విమర్శించింది. మోదీ, యడ్యూరప్ప ద్వయం చేతుల్లో సీబీఐ కీలుబొమ్మగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు. డీకే శివకుమార్ సీబీఐకి సహకరించి, తన నిజాయితీని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి హితవు పలికారు. రూ.వందల కోట్ల ఆస్తులను అతి తక్కువ కాలంలో ఎలా ఆర్జించారో చెప్పాలన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఆళ్లగడ్డ విద్యుత్ ఏడీఈ
సాక్షి, అమరావతి/నంద్యాల/ఆళ్లగడ్డ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారనే సమాచారంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్ (ఏడీఈృ ఎలక్ట్రికల్) మద్దెల నాగరాజు ఆస్తులపై సోమవారం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు పెద్దఎత్తున దాడులు నిర్వ హించారు. అక్రమాస్తులు కూడబెట్టినట్టు సోదాల్లో తేలిందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ ఆర్పీ ఠాకూర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల, వెలుగోడు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లోని ఏడీఈ, ఆయన బంధువులు, సన్నిహి తుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు డీజీ పేర్కొన్నారు.. ఈ దాడుల్లో రూ.10కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. నాగరాజు స్నేహితులైన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ముఖ్య అనుచరులు, కోటకందుకూరు గ్రామ సర్పంచ్ రామ్మోహన్‌రెడ్డి, పట్టణానికి చెందిన రాముయాదవ్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. -
రూ.150 కోట్లా... ఏసీబీకే దిమ్మతిరిగింది
హైదరాబాద్ : ఆయనో ప్రభుత్వ ఉద్యోగి... అయితే ఆయన ఆస్తుల చిట్టా మాత్రం చాంతాండంత. ఆ అధికారి ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులకే దిమ్మతిరిగింది. ఓ బడా వ్యాపారవేత్త సంపాదనకు ఏమాత్రం తీసిపోకుండా కోట్లలో అందినకాడికి దండుకున్నా ఆ తిమింగలం... చివరకు ఏసీబీ వలకు చిక్కటం విశేషం. అయ్యగారి ఆస్తులు సుమారు రూ.150 కోట్లు ఉంటుందని అంచనా. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ మయూరి విజయ్ గోపాల్ ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్‌తో పాటు హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లపై అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. ఈ సందర్భంగా అధికారుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి. గోపాల్ నివాసంలో షాద్ నగర్, అంబర్‌పేట డీడీ కాలనీ, చిక్కడపల్లి, హయత్ నగర్, నల్లకుంటల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లతో పాటు ఇళ్ల స్థలాలు, భారీ ఎత్తున బంగారం, విలువైన ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏసీబీ ఇన్స్పెక్టర్లు సీఎస్ వేణుగోపాల్, కాశయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. మరోవైపు గోపాల్ అవినీతి చిట్టాను లెక్కకట్టేందుకు అధికారులకు కనీసం వారం రోజులు సమయం పడుతుందట. గతంలోనూ గోపాల్ అక్రమాస్తుల కేసులో ఓసారి ఏసీబీకి చిక్కారు. ఆ తర్వాత కూడా ఆయన తన అక్రమ సంపాదనను ఆపలేదు. అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్మును గోపాల్...బినామీల పేర ఉంచాడు. అయితే ఆస్తుల వివరాలను ఆ బినామీలకు కూడా తెలియకుండా మేనేజ్ చేశాడు. ఏసీబీ దాడుల సందర్భంగా మీడియా కంటపడకుండా దాక్కున్నా...చివరకు ఏసీబీ అధికారులకు ముందుకు రాక తప్పలేదు. -
అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఇన్స్పెక్టర్లు సీఎస్ వేణుగోపాల్, కాశయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ గోపాల్ కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని ఆయన ఆస్తులపై ఏక కాలంలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా గోపాల్‌కు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించినట్టు సమాచారం. గోపాల్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ అధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. -
'శైలజానాథ్ తో నాకు ప్రాణహాని'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శైలజానాథ్ అక్రమ ఆస్తులు కూడబెట్టారని మంజునాథ నాయుడు అనే వ్యక్తి మంగళవారం ఏసీబీ, సీబీఐలకు ఫిర్యాదు చేశారు. శైలజానాథ్ మంత్రిగా ఉండగా అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్ లలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల సహకారంతో భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని ఆరోపించారు. తమ భూమి హైకోర్టు విచారణలో ఉండగా శైలజా నాథ్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా శైలజానాథ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. -
రేవంత్ అక్రమాస్తులు బయటపెడతాం: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అక్రమాస్తులను బయటపెడతామని టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధిననే కనీస ఇంగితజ్ఞానం లేకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక సలహాలిస్తే స్వీకరిస్తామన్నారు. అలాకాకుండా వ్యక్తిగత ఆరోపణలతో కాలం వెళ్లబుచ్చుతున్నాడన్నారు. ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో కంపోజర్‌గా ఉండే రేవంత్ రెడ్డికి కోట్ల రూపాయలు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. నిందితుడు భానుకిరణ్‌తో రేవంత్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని గువ్వల బాలరాజు ఆరోపించారు.