రేవంత్ అక్రమాస్తులు బయటపెడతాం: టీఆర్‌ఎస్ | Narendra Modi is the Prime Minister's top foreign policy | Sakshi
Sakshi News home page

రేవంత్ అక్రమాస్తులు బయటపెడతాం: టీఆర్‌ఎస్

Published Sun, Sep 7 2014 2:13 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

Narendra Modi is the Prime Minister's top foreign policy

సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అక్రమాస్తులను బయటపెడతామని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధిననే కనీస ఇంగితజ్ఞానం లేకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక సలహాలిస్తే స్వీకరిస్తామన్నారు. అలాకాకుండా వ్యక్తిగత ఆరోపణలతో కాలం వెళ్లబుచ్చుతున్నాడన్నారు. ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో కంపోజర్‌గా ఉండే రేవంత్ రెడ్డికి కోట్ల రూపాయలు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. నిందితుడు భానుకిరణ్‌తో రేవంత్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని గువ్వల బాలరాజు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement