Composer
-
ఆమె ఇళయరాజానా లేక రెహమానా..?
ఆమె ఇళయరాజానా లేక రెహమానా అనే సందేహం వస్తుంది ఇంగ్లండ్‌కు చెందిన అల్మా ఎలిజబెత్ డీషర్ను చూస్తే. చిన్నవయసులోనే కచరీలు చేసే స్థాయికి ఎదిగితే అనుమానం రాదూ?రెండేళ్ల వయసు నుంచే అల్మా పియానో వాయించడం మొదలుపెట్టింది. ఆ వయసులోనే స్పష్టంగా పాటలు పాడటం మొదలుపెట్టింది. అంత చిన్నవయసులో తన ఆసక్తి చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆమె మూడో పుట్టినరోజు నాడు చిన్న వయెలిన్ని బహుమతిగా ఇచ్చారు. దాన్ని ఆటబొమ్మలా కాక, వాయిద్యంలా చూసి సాధన చేయడం మొదటుపెట్టింది అల్మా. ఏడాదిలోనే వయోలిన్ వాయించడంలో ఎంతో ప్రతిభ చూపింది అల్మా. ఐదో ఏట నుంచి పియానోపై సొంతంగా బాణీలు కట్టడం మొదలుపెట్టింది. అయితే అవన్నీ అస్పష్టంగా ఉండేవి. ఆరో ఏట నుంచి స్పష్టంగా అనేక బాణీలు కంపోజ్ చేసింది. 2013లో తన 8వ ఏట ఆ బాణీలన్నీ కలిపి ఆల్బమ్‌గా విడుదల చేశారు ఆమె తల్లిదండ్రులు. పదేళ్ల వయసుకు అల్మా వయోలిన్ వాయించడంలో మరింత నేర్పు సాధించింది. పూర్తి స్థాయి కచేరీకి అవసరమైన కంపోజిషన్‌ను రూపొందించింది. ఆమె ప్రతిభ చూసి అందరూ తనను మెచ్చుకున్నారు. మరి అల్మా స్కూల్ సంగతులేంటి? ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులు ఆమెను స్కూల్‌కి పంపారు. కానీ అక్కడి పాఠాలు ఆమెకు నచ్చలేదు. దీంతో మొదటిరోజే ఆమె స్కూల్ మానేసింది. అప్పట్నుంచి ఇంట్లోనే అమ్మానాన్న ఆమెకు చదువు చెప్పడం మొదలుపెట్టారు. కళాకారులకు స్వేచ్ఛ కావాలని, ఎవరూ అడ్డుకోని స్వతంత్రం కావాలని అంటున్నారు. బాల సంగీతకారురాలిగా పేరు పొందిన అల్మా ‘ది స్వీపర్ ఆఫ్ డ్రీమ్స్(2012), ‘సిండ్రెల్లా’(2015), ‘ది ఎంపరర్స్ న్యూ వాల్డ్జ్(2023) వంటి సంగీత రూపకాలను స్వరపరిచి, ప్రదర్శించింది. 2021లో లియోనార్డో డావిన్సీ అంతర్జాతీయ పురస్కారం అందుకుని, ఆ పురస్కారం అందుకున్న చిన్నవయస్కురాలిగా రికార్డు సాధించింది. అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తోంది. (చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్ -
అందుకే భావోద్వేగానికి లోనయ్యాను: చంద్రబోస్
‘‘నేనిప్పటివరకు 3700 పాటలు రాశాను. ఈ రోజు నా మీద పాట రాసి, పాడారు. ఆ పాటను నాకు బహుమతిగా ఇచ్చిన ‘పర్ఫ్యూమ్’ టీమ్‌కి కృతజ్ఞతలు. నేను ఆస్కార్ అందుకున్న వీడియోను మళ్లీ ఇక్కడ చూడటంతో భావోద్వేగానికి లోనయ్యాను. ‘పర్ఫ్యూమ్’ పెద్ద విజయం సాధించాలి. నా భార్య సుచిత్ర ఈ చిత్రంలో ఒక పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు’’ అని రచయిత చంద్రబోస్ అన్నారు. చేనాగ్,ప్రాచీ థాకర్ జంటగా జేడీ స్వామి దర్శకత్వం వహించిన చిత్రం ‘పర్ఫ్యూమ్’. శ్రీమాన్ మూవీస్ సమర్పణలో జె. సుధాకర్, శివ .బి, రాజీవ్ కుమార్ .బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఆస్కార్ అవార్డుగ్రహీత చంద్రబోస్‌ను యూనిట్ సత్కరించింది. ఈ వేడుకకి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్. విష్ణుమూర్తి, ఐఆర్ఎస్ అధికారి మురళీమోహన్, గ్రీన్ హార్స్ కంపెనీ అధినేత ప్రవీణ్ రెడ్డి, ఆచార్య భట్టు రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘‘కొత్త పాయింట్‌తో రూపొందిన చిత్రమిది’’ అన్నారు జేడీ స్వామి, చేనాగ్. -
అసంపూర్ణాన్ని కూడా ప్రేమించాలి
శ్రుతీహాసన్ మంచి నటి మాత్రమే కాదు మంచి కంపోజర్ కూడా. చిన్నప్పుడే తండ్రి కమల్ హాసన్ సినిమాల్లో (దేవర్ మగన్, హే రామ్) పాటలు పాడటమే కాదు ఓ సినిమాకు (ఈనాడు) సంగీతం అందించారు కూడా. యాక్టింగ్‌కి కొంచెం బ్రేక్ ఇచ్చి మ్యూజిక్ మీద దృష్టి పెట్టాలని ఆ మధ్య లండన్ వెళ్లారు. అక్కడ కొన్ని షోస్ నిర్వహించారు. లాక్డౌన్లో కూడా చాలా సమయాన్ని మ్యూజిక్కే కేటాయించారు. తాజాగా ఓ సింగిల్‌ను శనివారం విడుదల చేశారు శ్రుతి. ‘ఎడ్జ్’ పేరుతో రెడీ అయిన ఈ పాట ప్రధానాంశం ‘మనల్ని మనం అంగీకరించగలగడం’ అంటున్నారు శ్రుతి. ‘‘మనం ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు. అందరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాలకు అధైర్యపడటం, చింతించటం అనవసరం. ఎలా ఉన్నా మనల్ని మనం స్వీకరించటం నేర్చుకోవాలి. మనలోని అసంపూర్ణాన్ని అర్థం చేసుకోవాలి. ప్రేమించాలి. ఎదుటివారితో పోల్చుకోవడం ఆపేయాలి. వారిలోని లోపాలను ఎత్తిచూపడం మానుకోవాలి’’ అనే ఫిలాసఫీ ఈ పాటలో చెబుతున్నాం అన్నారు శ్రుతి. ఈ పాటను ఆమె కంపోజ్ చేసి పాడారు. -
కిషోర్ దా
-
రేవంత్ అక్రమాస్తులు బయటపెడతాం: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అక్రమాస్తులను బయటపెడతామని టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధిననే కనీస ఇంగితజ్ఞానం లేకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక సలహాలిస్తే స్వీకరిస్తామన్నారు. అలాకాకుండా వ్యక్తిగత ఆరోపణలతో కాలం వెళ్లబుచ్చుతున్నాడన్నారు. ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో కంపోజర్‌గా ఉండే రేవంత్ రెడ్డికి కోట్ల రూపాయలు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. నిందితుడు భానుకిరణ్‌తో రేవంత్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని గువ్వల బాలరాజు ఆరోపించారు.