
శ్రుతీహాసన్ మంచి నటి మాత్రమే కాదు మంచి కంపోజర్ కూడా. చిన్నప్పుడే తండ్రి కమల్ హాసన్ సినిమాల్లో (దేవర్ మగన్, హే రామ్) పాటలు పాడటమే కాదు ఓ సినిమాకు (ఈనాడు) సంగీతం అందించారు కూడా. యాక్టింగ్‌కి కొంచెం బ్రేక్ ఇచ్చి మ్యూజిక్ మీద దృష్టి పెట్టాలని ఆ మధ్య లండన్ వెళ్లారు. అక్కడ కొన్ని షోస్ నిర్వహించారు. లాక్‌డౌన్‌లో కూడా చాలా సమయాన్ని మ్యూజిక్‌కే కేటాయించారు. తాజాగా ఓ సింగిల్‌ను శనివారం విడుదల చేశారు శ్రుతి.
‘ఎడ్జ్’ పేరుతో రెడీ అయిన ఈ పాట ప్రధానాంశం ‘మనల్ని మనం అంగీకరించగలగడం’ అంటున్నారు శ్రుతి. ‘‘మనం ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు. అందరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాలకు అధైర్యపడటం, చింతించటం అనవసరం. ఎలా ఉన్నా మనల్ని మనం స్వీకరించటం నేర్చుకోవాలి. మనలోని అసంపూర్ణాన్ని అర్థం చేసుకోవాలి. ప్రేమించాలి. ఎదుటివారితో పోల్చుకోవడం ఆపేయాలి. వారిలోని లోపాలను ఎత్తిచూపడం మానుకోవాలి’’ అనే ఫిలాసఫీ ఈ పాటలో చెబుతున్నాం అన్నారు శ్రుతి. ఈ పాటను ఆమె కంపోజ్ చేసి పాడారు.
Comments
Please login to add a commentAdd a comment