'శైలజానాథ్ తో నాకు ప్రాణహాని' | i have the treat from ex minister sailajanath, says manjunatha naidu | Sakshi
Sakshi News home page

'శైలజానాథ్ తో నాకు ప్రాణహాని'

Published Tue, Mar 17 2015 4:42 PM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM

'శైలజానాథ్ తో నాకు ప్రాణహాని' - Sakshi

'శైలజానాథ్ తో నాకు ప్రాణహాని'

అనంతపురం:  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శైలజానాథ్ అక్రమ ఆస్తులు కూడబెట్టారని మంజునాథ నాయుడు అనే వ్యక్తి మంగళవారం  ఏసీబీ, సీబీఐలకు ఫిర్యాదు చేశారు. శైలజానాథ్ మంత్రిగా ఉండగా అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్ లలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల సహకారంతో భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని ఆరోపించారు. తమ భూమి హైకోర్టు విచారణలో ఉండగా శైలజా నాథ్  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా శైలజానాథ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement