అనంతపురం: అనంతపురం జిల్లాలో పెరుగుతున్న రాజకీయ హత్యలపై మాజీ మంత్రి శైలజానాథ్ మంగళవారం అనంతపురంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హింసను వదిలి పెట్టి... అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన టీడీపీ నేతలకు హితవు పలికారు. హత్యలపై జరిగే విచారణలో పోలీసులు, అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాలని శైలజానాథ్ అన్నారు.
ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మార్వో కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ నేత బి.ప్రసాదరెడ్డిని టీడీపీ నేతలు గత వారం దారుణ నరికి హత్య చేశారు. టీడీపీ అధికారలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు జిల్లాలో దారుణంగా హత్య కావించబడ్డారు. ఈ నేపథ్యంలో అనంతలో జరుగుతున్న హత్యలపై శైలజానాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
'జిల్లాలో రాజకీయ హత్యలు పెరుగుతున్నాయి'
Published Tue, May 5 2015 11:58 AM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM
Advertisement
Advertisement