అనంతపురం సెంట్రల్ : జిల్లాలో అధికారపార్టీ ఎమెల్యేలు, మం త్రుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంచాయితీలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. సోమవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు ఒకరి నియోజకవర్గంలోకి మరొకరు వెళ్లొద్దని హద్దులు గీసి, దందాలు చేసుకోండి అని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
జిల్లాలో వరుస కరువులతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. మూడేâýæ్లలో జిల్లా అభివృద్ధికి చేసిందేమీలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పా ప్రత్యేకించి ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చారని, జేసీబీలతో పనులు చేయిస్తూ నిధులను దండుకుంటున్నారని ఆరోపిం చారు. జిల్లాలో ఉపాధిలేక దాదాపు 4 లక్షల కుటుంబాలు వలసపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శిగా శింగనమలకు చెందిన పూల నాగరాజుకు నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నాగరాజు, వాసు, ప్రతాప్‌రెడ్డి, రామాంజనేయులు, జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.