బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వీరంగం.. | altercation between the ysrcp cadre and BJP MLC somu veerraju in kakinada municipal polling | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వీరంగం..

Published Tue, Aug 29 2017 10:48 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

altercation between the ysrcp cadre and BJP MLC somu veerraju in kakinada municipal polling



సాక్షి, కాకినాడ : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పోలింగ్‌ కేంద్రం మంగళవారం వద్ద వీరంగం సృష్టించారు. కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించారు. నగరంలోని 9వ డివిజన్‌లో బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న సోము వీర్రాజు నేరుగా తొమ్మిదో డివిజన్‌ పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో ఆయన వాగ్వావాదానికి దిగారు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా యధేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారు.ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు, బెదిరింపులకు పాల్పడ్డుతున్నారు.

14,15 డివిజన్లలోని పోలీసులతో పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ వాగ్వావాదం
4వ డివిజన్‌ టీడీపీ అభ్యర్ధి వనమాడి ఉమాశంకర్‌ పోలింగ్‌ కేంద్రాలలో ప్రచారం, అడ్డుకున్న వైఎస్ఆర్‌ సీపీ కార్యకర్తలు
4వ డివిజన్‌ పరిధిలో బీజేపీ అభ్యర్థి తోట నాగలక్ష్మి కోడ్‌ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌ నం.4/2లో ప్రచారం




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement