kakinada municipal elections
-
కాకినాడ ఫలితాలపై స్పందించిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ : కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే ప్రజలు టీడీపీకి ఓటు వేశారన్నారు. శుక్రవారం చంద్రబాబు నాయుడు విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వంతో పాటు, తనపై కాకినాడ ప్రజలు అచంచల విశ్వాసం చూపించారని చెప్పుకొచ్చారు. మొన్న నంద్యాల, ఇవాళ కాకినాడ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. వరుస ఎన్నికలతో పాలన ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టిసీమను పూర్తి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 32 డివిజన్లలో గెలిచింది. -
‘అధికార దుర్వినియోగం వల్లే టీడీపీ గెలుపు’
హైదరాబాద్ : అధికార దుర్వినియోగం వల్లే కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో కూడా అలాగే చేశారని అన్నారు. కాకినాడలో డివిజన్ల వారీగా భారీగా డబ్బులు పంచారని, పలుచోట్ల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని ఆమె వ్యాఖ్యానించారు. అధికార దుర్వినియోగంతో గెలిచిన గెలుపు... గెలుపు కాదని అన్నారు. గతంలో ఉప ఎన్నికల్లో టీడీపీ చాలాసార్లు డిపాజిట్ కోల్పోయిందని ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు. కాకినాడ, నంద్యాలలో అభివృద్ధికి ప్రజలు పట్టం గట్టారని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీల్లో ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని ఆమె ధ్వజమెత్తారు. మాయ మాటలు చెప్పడంలో చంద్రబాబు డిగ్రీ చేశారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. -
పోలీసులపై కన్నబాబు ఆగ్రహం
కాకినాడ: కాకినాడలో పోలీసుల తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలను బెదిరిస్తూ.. అధికార పార్టీ సభ్యులకు మద్దతు ఇస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. దీంతో గుడారిగుంట 3వ డివిజన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్న క్రమంలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. 14 డివిజన్లో ఒక పక్క పోలింగ్ జరుగుతుండగా, మరోపక్క టీడీపీ నేతలు ప్రచారాలు చేస్తున్నారు. టీడీపీ ప్రలోభాలను వైఎస్ఆర్ సీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. -
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వీరంగం..
సాక్షి, కాకినాడ : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పోలింగ్ కేంద్రం మంగళవారం వద్ద వీరంగం సృష్టించారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించారు. నగరంలోని 9వ డివిజన్లో బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న సోము వీర్రాజు నేరుగా తొమ్మిదో డివిజన్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆయన వాగ్వావాదానికి దిగారు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా యధేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు.ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు, బెదిరింపులకు పాల్పడ్డుతున్నారు. ⇔14,15 డివిజన్లలోని పోలీసులతో పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ వాగ్వావాదం ⇔4వ డివిజన్ టీడీపీ అభ్యర్ధి వనమాడి ఉమాశంకర్ పోలింగ్ కేంద్రాలలో ప్రచారం, అడ్డుకున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ⇔4వ డివిజన్ పరిధిలో బీజేపీ అభ్యర్థి తోట నాగలక్ష్మి కోడ్ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్ నం.4/2లో ప్రచారం -
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వీరంగం..
-
కాకినాడ ఎన్నికల్లో కనిపించని ‘నోటా’
-
కాకినాడ ఎన్నికల్లో కనిపించని ‘నోటా’
కాకినాడ : నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కాకినాడ ఏటిమొగ్గలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. 14వ డివిజన్ టీడీపీ అభ్యర్ధి వనమాడి ఉమాశంకర్ పోలింగ్ కేంద్రాలలో ప్రచారం చేస్తుండగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలను చెదరగొట్టారు. కాగా ఇప్పటివరకూ 12 శాతం పోలింగ్ నమోదు అయింది. మరోవైపు ఎన్నికల ఈవీఎంలపై నోటా ఆప్షన్ కనబడలేదు. మరోవైపు పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన అనధికార వ్యక్తులు, ఓటు లేని వారు సైతం పోలింగ్ బూత్ లోపలికి వెళ్లడం వివాదాస్పదమౌతుంది. వారిని పోలీసులు అదుపు చేయలేకపోవడంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కోడ్ ఉల్లంఘించిన పిఠాపురం ఎమ్మెల్యే వర్మ
-
కొనసాగుతున్న కాకినాడ మున్సిపల్ పోలింగ్
-
కోడ్ ఉల్లంఘించిన పిఠాపురం ఎమ్మెల్యే వర్మ
కాకినాడ : కాకినాడ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లోనూ టీడీపీ నేతలు యధేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. మంగళవారం పోలింగ్ సందర్భంగా టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్దే స్లిప్పులు పంపిణీ చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. అయితే 14,15 డివిజన్లలోని పోలీసులతో ఎమ్మెల్యే వర్మ వాగ్వాదానికి దిగారు. బూత్ ఆఫీసులోనే కూర్చొని ఓటు వేయడానికి వచ్చినవారిని ప్రలోభాలతో పాటు భయపెట్టి ఓటు వేయాలంటూ సూచనలు చేశారు. దీంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు 4వ డివిజన్ పరిధిలో బీజేపీ అభ్యర్థి తోట నాగలక్ష్మి ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారానికి దిగారు. పోలింగ్ బూత్ నం.4/2లో ఆమె ప్రచారం చేస్తున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ‘సాక్షి’ రాకతో బీజేపీ అభ్యర్థిని పోలీసులు అక్కడ నుంచి పంపేశారు. -
కొనసాగుతున్న కాకినాడ మున్సిపల్ పోలింగ్
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం అయిదు గంటల వరకూ జరగనుంది. మొత్తం 241మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీఆ 48 వార్డుల్లో పోటీ చేయగా, టీడీపీ 39 వార్డులు, బీజేపీ 9 వార్డుల్లో పోటీ చేసింది. అలాగే 17 వార్డుల్లో కాంగ్రెస్, చెరో నాలుగు వార్డుల్లో సీపీఐ, సీపీఎం పోటీకి దిగాయి. అలాగే 121మంది ఇండిపెండెంట్లు బరిలో నిలవగా, 2,29,373 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నగర్ కాలనీలో పోలింగ్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడగా, పవర్ కట్ కారణంగా మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో చీకటిలోనే పోలింగ్ జరుగుతోంది. ఇక 50 వార్డుల్లో 48 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా రెండు వార్డులకు కోర్టు వ్యాజ్యం మూలంగా ఎన్నికలు జరగడం లేదు. 196 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెప్టెంబరు 1న ఓట్లు లెక్కించనున్నారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రతిష్టాత్మక మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. -
ఓటుతో బుద్ధి చెప్పండి
మూడున్నరేళ్ల మోసకారి పాలన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు (కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : చైతన్యవంతులైన కాకినాడ ప్రజలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి రాష్ట్ర భవిష్యత్తు మార్పునకు శ్రీకారం చుట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఏడాది తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనే కురుక్షేత్ర మహాసంగ్రామానికి కాకినాడ ఎన్నికలు నాంది పలకాలన్నారు. కేవలం ఎన్నికలలో గట్టెక్కడం కోసమే అన్ని వర్గాలకు అసంఖ్యాక హామీలిచ్చి తర్వాత మోసం చేయడం చంద్రబాబు నైజం అన్నారు. అన్నింటా మోసాలతోనే మూడున్నరేళ్లు కాలం గడిపేశారని చెప్పారు. వాటి అమలు కోసం డిమాండు చేసినవారిపై కన్నెర్ర జేస్తున్నారని, కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వం అవసరమా? దీనికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పౌరులు మద్దతు పలకాలని కోరారు. ధర్మానికీ అధర్మానికీ మధ్య జరుగుతున్న పోరులో ధర్మం వైపు నిలబడాలని విన్నవించారు. ఈనెల 29న జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజయిన ఆదివారం ఆయన కాకినాడలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పలు రోడ్డు షోల్లో పాల్గొన్నారు. ఉదయం అన్నమ్మ ఘాటి, మధ్యాహ్నం 3 గంటలకు డెయిరీఫారం సెంటర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా తీరుపై ధ్వజమెత్తారు. మోసానికి, వంచనకు మారుపేరుగా మారాడని విమర్శించారు. జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.... అన్నింటా మోసమే.. ‘‘బాబు అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్లు అయింది. ఎన్నికలకు ముందు ఏమి చెప్పారో ఇప్పుడేమి చేశారో మీరే చెప్పండి. ప్రతి పేద వాడికీ మూడు సెంట్ల స్థలం అన్నాడు, ప్రతి పేదకూ ఇల్లు అన్నాడు. ఈ మూడున్నర ఏళ్లలో ఒక్క ఇల్లన్నా కట్టించాడా? (లేదు, లేదు అంటూ ప్రజలు రెండు చేతులెత్తి చూపించారు) దీన్నేమంటాం.. మోసం.. చంద్రబాబు మోసం చేశాడు. రేషన్ సరుకుల పంపిణీలోనూ ఇలాగే జరిగింది. ప్రతి ఇంటికీ రూ.78వేల బాకీ... బాబొస్తేనే జాబు వస్తుందని, లేకుంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 39 నెలలు అయింది. ఆయన చెప్పిన లెక్కప్రకారమే ప్రతి ఇంటికీ రూ.2 వేల చొప్పున రూ.78 వేలు బాకీ పడ్డారు. బాబు బాబు ప్రభుత్వం ముష్టి వేసినట్టు రూ. 35 వేలు... అదీ ఎప్పటికో ఇస్తోంది. ఇటువంటి పాలన మనకు అవసరమా? (వద్దే వద్దు అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.) నిజం చెప్పనివాడు నారా చంద్రబాబు.... ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ చంద్రబాబు నెరవేర్చలేదు. ఆయన నైజమే అంత. చంద్రబాబు చస్తే నిజం చెప్పడు. జీవితంలో అబద్ధాలు చెప్పని వ్యక్తి సత్యహరిశ్చంద్రుడు అయితే ఒక్క నిజం చెప్పని వ్యక్తి చంద్రబాబు. ఇదే చంద్రబాబు 2014 ఆగస్టులో సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా తూర్పుగోదావరి సహా అన్ని జిల్లాలకు అనేక హామీలిచ్చారు. మూడున్నర ఏళ్లు గడిచినా వాటికి అతీగతీ లేదు. కాలరు పట్టుకుని నిలేసే పరిస్థితి రావాలి... ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోకపోతే ఇక ఈ రాజకీయ వ్యవస్థకు అర్థమేమిటి? మరో ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్ర మహాసం గ్రామానికి... నంద్యాల ప్రజలు వేసిన ఓటు నాంది కాగా.. రెండో ఓటు కాకినాడ కార్పొరేషన్ నుంచి పడాలి... ఈ రెండు నగరాలను నేను ఎప్పుడూ మరచిపోను. వాటి అభివృద్ధి బాధ్యత నాకు వదిలేయండి. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనతోనే ప్రజలకు మంచిరోజులు. మైకు పట్టుకుని ప్రజల ముందు ఏదయినా చెప్పి ఓట్లు వేయించుకుని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చేయకపోతే కాలరు పట్టుకుని నిలదీస్తారన్న భయం రాజకీయ నాయకుల్లో రావాలి. అప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. లేకుంటే చంద్రబాబు లాంటి నాయకులు రేపొద్దున్న ఎన్నికలప్పుడు మీవద్దకు వచ్చి ప్రతి ఇంటికో మారుతీ కారు ఇస్తానంటాడు, కేజీ బంగారం అంటాడు. అందుకే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలి. న్యాయం వైపు, ధర్మంవైపు నిలబడండి. న్యాయానికి మీ ఓటు వేయండి. మోసం చేస్తున్న చంద్రబాబు లాంటి పాలకులు వద్దని చెప్పండి.’’ అని జగన్ విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్‌కు పరిష్కారం... అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరిస్తాం. అసెంబ్లీలోనే నేనీ విషయాన్ని ప్రస్తావించాను. వేయి కోట్లు ఇస్తే 14 లక్షల మందికి మేలు జరుగుతుంది. చంద్రబాబుకు చెప్పినా మానవత్వం లేని ఆయన పట్టించుకోలేదు. నంద్యాలలో కూడా ఈ విషయాన్ని చెప్పాను. మోసాలపై నిలదీస్తే కేసులా? ఎన్నికల ముందు మాట ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేయడం ధర్మమేనా? ఇచ్చిన హామీలు నెరవేర్చమని నిలదీసేవారిపై కేసులు బనాయిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన తర్వాత టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. నడిరోడ్డు మీద తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్చినవాళ్ల మీదగానీ, కత్తులతో వీరంగం సృష్టించిన వాళ్లపై గానీ కేసులు పెట్టలేదు. ఇలాంటి పాలన మనకు కావాలా అని అడుగుతున్నా. ఓటుకు కోట్లు కేసులో ఆడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినా బాబుపై కేసులు ఉండవు. తనను హీరోగా చూపించుకునేందుకు పుష్కరాల్లో 29 మందిని చంపేసినా కేసులు ఉండవు. కాపులు రిజర్వేషన్ల కోసం కంచాలు మోగిస్తే కేసులు పెట్టారు. ఎన్నికలప్పుడు మాటలు చెప్పి మోసం చేసిన పాలన ఇది. అధికారంలోకి వచ్చాక అధికారాన్ని దుర్విని యోగం చేస్తున్న పాలన ఇది. ప్రభుత్వం టీడీపీది అయినందున ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి ఓటువేస్తే మురిగి పోయిన ట్టేనని బాబు వ్యాఖ్యానిస్తున్నారు. ఏడాది లోపే ఎన్నికలు వస్తాయని బాబే చెప్తున్నందున ఆయనకు వేసే ఓటే మురిగిపోతుంది. ఏడాది తర్వాత చంద్రబాబు పాలన ఉండదు. వచ్చేది మనందరి పాలన. కాకినాడ మున్సిపల్ కౌన్సిల్‌కు మన అభ్యర్థులను గెలిపించుకుంటే ఏడాది తర్వాత మన పాలనలో మనమే నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇది కబ్జాల సర్కార్.. కాకినాడ ఎమ్మెల్యే పేరు మార్చుకున్నారు కబ్జాల కొండబాబు అని. ఆయన ఏటిమొగ దగ్గర 50 ఎకరాలు కబ్జా చేసేశాడు. అతనే కాదు విశాఖ నుంచి విజయవాడ, తిరుపతి వరకూ టీడీపీ నేతలు భూకబ్జాలు చేసేస్తున్నా చంద్రబాబు చూస్తూనే ఉన్నారు తప్ప వారిపై చర్చలు లేవు. ప్రజల భూరికార్డుల్లో పేర్లను మార్చేసి, ఆ పత్రాలతో బ్యాంకుల్లో రుణాలు తెచ్చేసుకుంటున్నారు. ప్రజాధనాన్ని వేల కోట్లలో కొల్లగొడుతున్నారు. ఇలాంటి మోసకారి ప్రభుత్వం మనకు అవసరమా? -
ఒక్కరోజు ప్రచారం.. ఇసుకేస్తే రాలనంత జనం
కాకినాడ: అన్నమ్మ ఘాట్.. చంద్రిక థియేటర్.. జగన్నాథపురం..సినిమా రోడ్డు.. డెయిరీ ఫామ్ సెంటర్.. ప్రదేశాల పేర్లు వేరైనా ప్రజావెల్లువలో మార్పులేదు. ఎటుచూసినా కిక్కిరిసిన అభిమానం.. ఇసుకేస్తే రాలనంత జనం. ఇవీ.. కాకినాడ నగరంలో వైఎస్ జగన్ పర్యటనలో కనిపించిన దృశ్యాలు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదివారం నగరంలో పర్యటించారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం తర్వాత అస్వస్థకు గురైన ఆయన ఒకరోజు ఆలస్యమైనా తిరిగి జనం మధ్యకు వెళ్లారు. ఆయన వెళ్లిన అన్ని చోట్లా పెద్ద సంఖ్యలో జనం తమ అభిమానాన్ని ప్రకటించుకున్నారు. ఉదయం అన్నమ్మ ఘాట్ వద్ద సభలో మాట్లాడిన వైఎస్ జగన్.. తర్వాత చంద్రిక థియేటర్, జగన్నాథపురం వంతెన మీదుగా సినిమా రోడ్డు వరకు రోడ్‌షోలో నిర్వహించారు. అనంతరం డెయిరీ ఫామ్ సెంటర్లో అశేష ప్రజావాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇచ్చిన ఒక్క హామీనీ అమలుచేయకుండా, మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తోన్న చంద్రబాబుకు ఓటు ద్వారా బుద్ధిచెప్పాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి, కాకినాడ అభివృద్ధి బాధ్యతను తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 29న(మంగళవారం) జరిగే పోలింగ్‌లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. (చదవండి: సీఎం చంద్రబాబు సభ.. బయటపడ్డ డొల్లతనం) (చదవండి: మీకు తోడుగా నేనుంటా: వైఎస్ జగన్) (ధర్మం, న్యాయం వైపు నిలబడండి: వైఎస్ జగన్) -
కాకినాడకు ఏం చేశారు చంద్రబాబు?
కాకినాడ : చంద్రబాబు సర్కార్ మూడున్నరేళ్లలో కాకినాడకు చేసిందేమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఏ ప్రభుత్వమూ విడుదల చేయని విధంగా చంద్రబాబు సర్కార్ మూడున్నరేళ్లలో 15వందల రహస్య జీఓలను విడుదల చేసిందని ఆయన ధ్వజమెత్తారు. అయిదేళ్ల పాలనలో నాలుగు లేదా ఐదు జీఓలను కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ప్రభుత్వాలు విడుదల చేస్తాయని అన్నారు. కానీ చంద్రబాబు సర్కార్ 15వందల రహస్య జీఓలు విడుదల చేయడం వెనుక ఆంతర్యమేంటని ధర్మాన నిలదీశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ...‘ మున్నిపల్ కార్పొరేషన్‌కు ఎన్నో హామీలు ఇచ్చారు. పోర్టులో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కాకినాడకు వర్సిటీ తీసుకొస్తామన్నారు...ఏమైంది?. ప్రజాస్వామ్య విలువలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలకు ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదు. స్పీకర్ వ్యవస్థ అపఖ్యాతి పాలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటివరకూ చర్యలు లేవు. శివరామకృష్ణ కమిటీ వద్దన్న అంశాలనే అమలు చేశారు. ప్రజా సంఘాలు, మేధావులు, పౌరుల అభిప్రాయాలను తీసుకోలేదు. రాజధాని వ్యవహారం చంద్రబాబు కుటుంబ వ్యవహారమా?. టీడీపీ ప్రభుత్వం ఏడాదిన్నర మాత్రమే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రావడం ఖాయం. కాకినాడ వాసుల చిరకాల కోరికలను వైఎస్ఆర్ సీపీ నెరవేరుస్తుంది.’ అని హామీ ఇచ్చారు. టీడీపీని మిత్రపక్షమైన ఎన్డీయే నమ్మడం లేదని, అందుకే చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ధర్మాన అన్నారు. కేంద్రంతో బాబుకు ఉన్న సంబంధాలు చెడిపోయాయన్నారు. కాకినాడ పెద్ద నాయకులు పుట్టిన ప్రాంతమని, ఇక్కడ మేధావులు ఉన్నారని, చంద్రబాబు నైజాన్ని గుర్తించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. చైతన్యవంతమైన కాకినాడ పౌరులు చంద్రబాబు పాలనను వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. -
అవినీతి పాలనను అంతమొందించండి
- వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స - నంద్యాల, కాకినాడల్లో టీడీపీని తరిమికొట్టండి కాకినాడ: ప్రజలకిచ్చిన హామీలను తుంగలోకి తొక్కి, అవినీతిలో కూరుకుపోయిన మూడున్నరేళ్ళ తెలుగుదేశం పాలనకు రానున్న నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎస్వీఎన్ ఫంక్షన్ హాలులో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నంద్యాల తరహాలో మోసాలు, ప్రలోభాలు కాకినాడలో కూడా ప్రారంభించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఓటర్ల వద్దకు వెళ్ళి ఆన్లైన్లో నగదు బదిలీ చేస్తామంటూ అకౌంట్ నెంబర్లు తీసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా చేసిన అభివృద్ధిని చూపించి ఓటు వేయమని అడుగుతుందని, కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయకపోతే పింఛన్లు, ఇళ్లు రద్దు చేస్తామని బెదిరింపు ధోరణికి దిగుతున్నారని మండిపడ్డారు. ఒక్క హామీ అమలయ్యిందా? స్మార్ట్ సిటీ, పెట్రో యూనివర్సిటీ, ఎల్అండ్టీ టెర్మినల్, తుని నౌకా నిర్మాణ కేంద్రం, తెలుగు విశ్వవిద్యాలయం, కొబ్బరిపీచు పరిశ్రమ, ఆక్వాఫుడ్ పార్కు సహా ఇచ్చిన ఏ ఒక్క హమీ అయినా అమలయ్యిందా? అని బొత్స నిలదీశారు. రూ.400 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నా పట్టుమని రూ.5 కోట్ల పనులు కూడా పూర్తి చేయలేకపోయారని చెప్పారు. అవినీతి దాహంతో కేంద్ర నిధులను కూడా కైంకర్యం చేయాలన్న చంద్రబాబు, లోకేష్, స్థానిక నేతల తీరు ఈ ప్రాంతం అభివృద్ధికి అవరోధంగా మారిందని చెప్పారు. విశాఖలో వేల కోట్ల విలువైన భూములను దోచేసిన చంద్రబాబు, ఆయన అనుయాయుల కన్ను ఇప్పుడు కాకినాడ తీరంపై పడిందని ధ్వజమెత్తారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల ముందు ఊరువాడా ప్రచారంచేసిన టీడీపీ ఇప్పుడు ముద్రగడ ఉద్యమాన్ని అణిచివేస్తూ కాపుజాతిని అవమానిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక స్మార్ట్‌సిటీ కన్నా భిన్నంగా రాష్ట్రంలోనే కాకినాడను ప్రత్యేక స్థానంలో నిలిపేలా కృషి చేస్తామన్నారు. కాకినాడ 34వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి పసుపులేటి వెంకటలక్ష్మికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పినిపే విశ్వరూప్, కొప్పన మోహనరావు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముదునూరి ప్రసాదరాజు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు పాల్గొన్నారు. -
కాకినాడ ఎన్నికలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికలు నిర్వహించకుండా స్టే మంజూరు చేయాలన్న అనుబంధ పిటిషన్లను తోసిపుచ్చింది. దీంతో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకి తొలగింది. అయితే ఎన్నికల ఫలితాలు తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటాయని న్యాయమూర్తి తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్టే మంజూరు చేయాలన్న అనుబంధ పిటిషన్లను డిస్మిస్ చేసిన హైకోర్టు.. ప్రధాన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించింది. ప్రతివాదులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లను దాఖలు చేయాలని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు గురువారం ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ అయ్యాక ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మేయర్ రిజర్వేషన్‌ను తిరిగి చేపట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
టీడీపీకి బీజేపీ సవాల్...
-
టీడీపీకి బీజేపీ సవాల్...
కాకినాడ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ గట్టి ఝలక్ ఇవ్వనుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య స్పష్టం చేశారు. కాకినాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీకి సత్తా ఉంటే కాకినాడ కార్పొరేషన్‌కు తక్షణమే ఎన్నికలు జరిపించాలని సవాల్ విసిరారు. కాకినాడ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిపితే అవినీతి రహిత పాలన ప్రజలకు అందుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం తక్షణమే జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని ఎనిమిరెడ్డి డిమాండ్ చేశారు.