
అవినీతి పాలనను అంతమొందించండి
ఓటర్ల వద్దకు వెళ్ళి ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేస్తామంటూ అకౌంట్ నెంబర్లు తీసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా చేసిన అభివృద్ధిని చూపించి ఓటు వేయమని అడుగుతుందని, కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయకపోతే పింఛన్లు, ఇళ్లు రద్దు చేస్తామని బెదిరింపు ధోరణికి దిగుతున్నారని మండిపడ్డారు.
కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల ముందు ఊరువాడా ప్రచారంచేసిన టీడీపీ ఇప్పుడు ముద్రగడ ఉద్యమాన్ని అణిచివేస్తూ కాపుజాతిని అవమానిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక స్మార్ట్‌సిటీ కన్నా భిన్నంగా రాష్ట్రంలోనే కాకినాడను ప్రత్యేక స్థానంలో నిలిపేలా కృషి చేస్తామన్నారు. కాకినాడ 34వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి పసుపులేటి వెంకటలక్ష్మికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పినిపే విశ్వరూప్, కొప్పన మోహనరావు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముదునూరి ప్రసాదరాజు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు పాల్గొన్నారు.