టీడీపీకి బీజేపీ సవాల్...
కాకినాడ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ గట్టి ఝలక్ ఇవ్వనుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య స్పష్టం చేశారు.
కాకినాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీకి సత్తా ఉంటే కాకినాడ కార్పొరేషన్కు తక్షణమే ఎన్నికలు జరిపించాలని సవాల్ విసిరారు. కాకినాడ కార్పొరేషన్కు ఎన్నికలు జరిపితే అవినీతి రహిత పాలన ప్రజలకు అందుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం తక్షణమే జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని ఎనిమిరెడ్డి డిమాండ్ చేశారు.