కాకినాడ: అన్నమ్మ ఘాట్.. చంద్రిక థియేటర్.. జగన్నాథపురం..సినిమా రోడ్డు.. డెయిరీ ఫామ్ సెంటర్.. ప్రదేశాల పేర్లు వేరైనా ప్రజావెల్లువలో మార్పులేదు. ఎటుచూసినా కిక్కిరిసిన అభిమానం.. ఇసుకేస్తే రాలనంత జనం. ఇవీ.. కాకినాడ నగరంలో వైఎస్ జగన్ పర్యటనలో కనిపించిన దృశ్యాలు.
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదివారం నగరంలో పర్యటించారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం తర్వాత అస్వస్థకు గురైన ఆయన ఒకరోజు ఆలస్యమైనా తిరిగి జనం మధ్యకు వెళ్లారు. ఆయన వెళ్లిన అన్ని చోట్లా పెద్ద సంఖ్యలో జనం తమ అభిమానాన్ని ప్రకటించుకున్నారు.
ఉదయం అన్నమ్మ ఘాట్ వద్ద సభలో మాట్లాడిన వైఎస్ జగన్.. తర్వాత చంద్రిక థియేటర్, జగన్నాథపురం వంతెన మీదుగా సినిమా రోడ్డు వరకు రోడ్‌షోలో నిర్వహించారు. అనంతరం డెయిరీ ఫామ్ సెంటర్‌లో అశేష ప్రజావాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇచ్చిన ఒక్క హామీనీ అమలుచేయకుండా, మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తోన్న చంద్రబాబుకు ఓటు ద్వారా బుద్ధిచెప్పాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి, కాకినాడ అభివృద్ధి బాధ్యతను తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 29న(మంగళవారం) జరిగే పోలింగ్‌లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు.
(చదవండి: సీఎం చంద్రబాబు సభ.. బయటపడ్డ డొల్లతనం)
(చదవండి: మీకు తోడుగా నేనుంటా: వైఎస్ జగన్)
(ధర్మం, న్యాయం వైపు నిలబడండి: వైఎస్ జగన్)