
'రైతులను మోసం చేస్తే సర్వ నాశనమే'
హైదరాబాద్ : రైతులను మోసం చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రభుత్వం అయినా సర్వ నాశనమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రుణాలు కట్టవద్దని ఎన్నికల్లో చంద్రబాబే చెప్పారని, అయితే రుణమాఫీపై ఇప్పటివరకూ ఏం చేసారో చెప్పాలరన్నారు.
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు రుణమాఫీపై రైతులు అయోమయంలో ఉన్నారని అంబటి అన్నారు. కాలయాపన చేయకుండా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని అన్నారు. వరి మద్దతు ధరపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరెందుకని అంబటి ప్రశ్నించారు. ప్రపంచానికే పాఠాలు చెప్పానంటున్న చంద్రబాబు..ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో జాప్యమెందుకని అంబటి సూచించారు.