సాక్షి, అమరావతి : ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. రాష్ట్రంలోని న్యాయవాదుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు చెప్పారు. తమ సమస్యల పరిష్కారంపట్ల సీఎం సానుకూలంగా స్పందించారని అన్నారు. ‘న్యాయవాదులకు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరాము. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే వారికి గౌరవ వేతనంగా రూ.5 వేలు ఇవ్వాలనే ప్రతిపాదన ముఖ్యమంత్రి ఎదుటకు తీసుకొచ్చాం. న్యాయవాదుల సంక్షేమనిధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీనిచ్చారు. హైకోర్టు న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా అమలు చేస్తామని సీఎం చెప్పారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment