
సాక్షి, అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం ముగిసింది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించింది. గతంలో ప్రకటించిన పదివేల టీచర్ పోస్టులు, కొత్తగా 20వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు. నిరుద్యోగ భృతిపై అమలుపై మరోసారి నిర్ణయం తీసుకున్నారు. మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం విధించాలని తీర్మానించారు. ఈ మంత్రివర్గ సమావేశంలో ఏపీ ఎలక్ట్రానిక్స్ బిల్లులో కొన్ని మార్పులు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment