సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మరో ముందడుగు వేసింది. రైతన్నకు భరోసాగా నిలుస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతి మాటను నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సోమవారం అనుమతినిచ్చింది. రైతులకు తొమ్మిది గంటలు పగటిపూట ఉచిత విద్యుత్ అందించే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. (ఉచిత విద్యుత్‌కు శాశ్వత భరోసా)
వ్యవసాయానికి అందించే విద్యుత్ ఖర్చును ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో పంపిణీ సంస్థలకు అందిస్తోంది. టీడీపీ హయాంలో సబ్సిడీ తక్కువగా ఉంది. 2015–16లో రూ.3,186 కోట్లు ఉండగా 2018–19 నాటికిరూ.4 వేల కోట్లకు చేరింది. ఈ మొత్తంలోనూ గత ప్రభుత్వం పూర్తిగా చెల్లించకపోవడంతో డిస్కమ్‌లు అప్పుల్లోకి వెళ్లాయి. 2020–21లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి ప్రభుత్వం రూ.8,354 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఇది రెట్టింపుకన్నా ఎక్కువే. రాష్ట్రంలో మొత్తం 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా విద్యుత్ వినియోగ సామర్థ్యం 1.11 కోట్ల అశ్వశక్తి అంటే 8,300 మెగావాట్లు ఉంటుంది.(రైతు భరోసా కేంద్రాలపై సీఎం జగన్ సమీక్ష)
Comments
Please login to add a commentAdd a comment