ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ: మంత్రి మురళి | Andhra Pradesh government to establish medical college in every district | Sakshi
Sakshi News home page

ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ: మంత్రి మురళి

Published Sun, Dec 15 2013 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ: మంత్రి మురళి

ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ: మంత్రి మురళి

ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు రాష్ట్ర వైద్య విద్య శాఖ మంత్రి కొండ్రు మురళి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వైద్య సేవలకు 6500 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల కొనుగోలు కోసం 300 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు వివరించారు.

మంత్రి ఆదివారం విజయవాడలోని మున్సిపల్ మహిళా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం కింద 70 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగలందరూ ఉచిత వైద్యం పొందేందుకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మురళి తెలిపారు. ఈ పథకాన్ని న్యాయవాదులు, ఇతర వర్గాల వారికి విస్తరించనున్నట్టు చెప్పారు. నగరంలో 290 కోట్ల రూపాయల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్టు మురళి తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement