every district
-
ప్రత్యేక కోర్టులు అక్కర్లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్, పన్నుల ఎగవేత వంటి ఆర్థిక నేరాల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక నేరాల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ‘ ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు కోర్టులున్నాయి. పోక్సో కోర్టులున్నాయి. ప్రతి ఒక్క అంశానికి విడిగా కోర్టులు ఏర్పాటుచేస్తూ పోతే కింది స్థాయి జ్యుడీషియల్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అందుకు ఒప్పకోం’ అంటూ పిల్‌ను తిరస్కరించింది. -
ప్రతి జిల్లాలో పీజీ వైద్య కళాశాల
జైపూర్: పోస్టు–గ్రాడ్యుయేట్(పీజీ) వైద్య విద్య కోసం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల లేదా విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వైద్య విద్య, ఆరోగ్య సేవలను అందించడం మధ్య అంతరం తగ్గుతోందని తెలిపారు. ఆయుర్వేదం, యోగాను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. దేశంలో గత ఆరేళ్లలో 170కిపైగా మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని, కొత్తగా మరో 100 కాలేజీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గురువారం రాజస్తాన్‌లో నాలుగు నూతన వైద్య కళాశాలల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ టెక్నాలజీ’ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైద్య వ్యవస్థను సమూలంగా మార్చడానికే ఎంసీఐ స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను తీసుకొచి్చనట్లు ఉద్ఘాటించారు. ఈ కమిషన్‌తో ఇప్పటికే సానుకూల ఫలితాలు వస్తున్నాయని వివరించారు. దేశంలో సంప్రదాయ, ఆధునిక వైద్యం నడుమ అంతరం ఉందని, దీన్ని తొలగించాలి్సన అవసరం ఉందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే కొత్తగా నేషనల్ హెల్త్ పాలసీని తీసుకొచ్చినట్లు వివరించారు. ఎయిమ్స్ లేదా మెడికల్ కాలేజీలు.. వాటి నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా అన్ని మూలలకూ విస్తరింపజేయాలని సూచించారు. దేశంలో గతంలో కేవలం 6 ఎయిమ్స్‌లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 22కుపైగానే ఉన్నాయని పేర్కొన్నారు. 2014లో కేవలం 82,000 అండర్–గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.40 కోట్లకు చేరిందని వెల్లడించారు. చాలా మంది విద్యార్థులకు ఆంగ్ల భాష పెద్ద అవరోధంగా మారిందని, నూతన విద్యా విధానంలో భాగంగా భారతీయ భాషల్లోనూ వైద్య విద్యను అభ్యసించే వెలుసుబాటు లభిస్తోందని తెలిపారు. -
సంక్రాంతి సంబరాలకు జిల్లాకు రూ. కోటి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలకు ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు.. అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలకు విడుదల చేసే కోటి రూపాయల నిధులను జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సంక్రాంతి సంబరాలకు ఖర్చు చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. జన్మభూమికి మంచి స్పందన వస్తోందని, గ్రామం అభివృద్ధి చెందాలన్న తపన అందరిలో కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. -
'ప్రతి జిల్లాకు జలవిధానం'
ఖమ్మం: గతంలో చేపట్టిన.. నూతనంగా తీసుకోవాల్సిన ప్రాజెక్టులు, ఆయకట్టు, నిధుల మంజూరు వీటన్నింటినీ కలిపి ప్రతి జిల్లాకు జలవిధానం రూపొందించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా బుధవారం స్థానిక ఎన్నెస్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విధానంతో రాష్ట్రంలో బీడు భూములన్నింటినీ సస్యశ్యామలం చేయడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. 'గతంలో తీసుకున్న రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులతో జిల్లాకు నీరందించాలని అప్పటి ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రస్తుతం ఇందిరాసాగర్ హెడ్‌వర్క్స్ ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లాయి. ఈ విషయమై ఆ ప్రభుత్వానికి రెండుసార్లు లేఖలు రాసినా స్పందించలేదు. ఇందిరాసాగర్ కింద చేసిన పనులు, దుమ్ముగూడెం పనులను అన్నింటినీ కలిపి ఒకే ప్రాజెక్టు కింద జిల్లాకు నీరందించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకోసం రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రభుత్వ ఇంజనీర్లతో కమిటీ వేశాం. నివేదిక రాగానే ముఖ్యమంత్రి ద్వారానే ఈ ప్రాజెక్టు ప్రకటన చేయిస్తాం. ఖమ్మం జిల్లాలో మిషన్ కాకతీయ సక్సెస్ అయింది. తొలి దశలో మిగిలిన చెరువులను రెండో దశలో కూడా పూర్తి చేస్తాం. వ్యవసాయానికి నీళ్లు అందించినప్పుడే ప్రభుత్వం ఆనందంగా ఉంటుంది' అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. -
ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ: మంత్రి మురళి
ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు రాష్ట్ర వైద్య విద్య శాఖ మంత్రి కొండ్రు మురళి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వైద్య సేవలకు 6500 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల కొనుగోలు కోసం 300 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు వివరించారు. మంత్రి ఆదివారం విజయవాడలోని మున్సిపల్ మహిళా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం కింద 70 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగలందరూ ఉచిత వైద్యం పొందేందుకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మురళి తెలిపారు. ఈ పథకాన్ని న్యాయవాదులు, ఇతర వర్గాల వారికి విస్తరించనున్నట్టు చెప్పారు. నగరంలో 290 కోట్ల రూపాయల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్టు మురళి తెలిపాడు.