ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలకు ప్రతి జిల్లాకు కోటి రూపాయలు చొప్పున విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలకు ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు.. అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలకు విడుదల చేసే కోటి రూపాయల నిధులను జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సంక్రాంతి సంబరాలకు ఖర్చు చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. జన్మభూమికి మంచి స్పందన వస్తోందని, గ్రామం అభివృద్ధి చెందాలన్న తపన అందరిలో కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు.