హైదరాబాద్ : రాష్ట్ర 14వ శాసనసభ నాలుగో విడత(బడ్జెట్) సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం అయ్యాయి. గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ముందుగా ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. తర్వాత సభ నిర్వహణ అంశాలపై సభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం నిర్ణయించనుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే అవకాశాలున్నాయి. బడ్జెట్‌ను 12వ తేదీన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు.ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 13న సభకు సమర్పిస్తారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే అవకాశాలున్నాయి. బడ్జెట్‌ను 12వ తేదీన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు.ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 13న సభకు సమర్పిస్తారు. సెలవుదినాలు పోను సభ 16 రోజులు జరిగే అవకాశముంది.