గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఏపీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు..
*నిధుల విషయంలో కేంద్రం నుంచి అనుకూల స్పందన ఇంకా అందవలసి ఉంది.
* హుద్హుద్ సహాయంగా ప్రధాని ప్రకటించిన రూ.1000 కోట్లలో రూ.650 కోట్లు విడుదలయ్యాయి.
* ప్రణాళికేతర రెవిన్యూ లోటు భర్తీ కోసం రూ.500 కోట్లు కేంద్రం మంజూరు చేసింది
* 7 వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రూ.350 కోట్లు
* 14వ ఆర్థిక సంఘ సిఫార్సులో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వలేదు
* కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించినంత మేలు జరగలేదు
* రెవిన్యూ నిధులు ఉన్నా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోటీ పడటం హాని కలిగిస్తుంది
* బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడాలంటే కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలి
* ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ అభివృద్ధి, ఎజెండాతో ముందుకు సాగుతున్నాం
* విజన్-2050 డాక్యుమెంట్లు రూపొందిస్తుంది.
* 2029 నాటికి ఏపీని ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఎజెండా
* స్మార్ట్ ఏపీ, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు పేరుతో కొత్త అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది
* అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
*2015-16 లోగా నాలుగు ఓడరేవులు
* వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
* ఆదివాసీల కోసం గిరిపుత్రిక కల్యాణ పథకం
* ఎన్ని ఇబ్బందులు ఉన్నా 2018నాటికి పోలవరం పూర్తి
*రాష్ట్రంలో 93 శాతం రైతులు అప్పుల్లో ఉన్నారు.
*నదుల అనుసంధానానికి ప్రాధాన్యత
* రాష్ట్రాన్ని ఆక్వా కేపిటల్గా మార్చుతాం
* కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై కట్టుబడి ఉన్నాం.
*అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం
* రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు