సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల చేశారు. సెంకడియర్‌లో 72 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా అమ్మాయిలే ముందంజలో నిలిచారు. 75 శాతం మంది బాలికలు, 68 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 81 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 76 శాతంతో చిత్తూరు రెండో స్థానం దక్కించుకుంది. , నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు(74 శాతం) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.
మొదటి సంవత్సరం ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రభుత్వ కళాశాలలు 67 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టారు. 9,340 మంది విద్యార్ధులు 10/10 గ్రేడ్ సాధించారు. 99,923 మంది 9/10 గ్రేడ్ సాధించారు. 73,168 మంది 8/10 గ్రేడ్ పొందారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటర్ ఫస్టియర్‌లో 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 64 శాతం, బాలురు 56 శాతం ఉత్తీర్ణులయ్యారు. మే 14న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, ఈ నెల 24లోపే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని ఉదయలక్ష్మి తెలిపారు. రీకౌటింగ్‌కు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment