కార్పొరేట్ హవా! | Andhra Pradesh Intermediate results | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ హవా!

Published Wed, Apr 20 2016 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

Andhra Pradesh Intermediate results

విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సర వార్షిక ఫలితాలలో జిల్లాకు చెందిన వివిధ కార్పొరేట్ కళాశాలలు ఎప్పటిమాదిరిగానే తమ హవా కొనసాగించాయి. నారాయణ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో చదివిన వారణాసి రోష్ని అత్యధిక మార్కులు (992/1000) సాధించి రాష్ట్రస్థాయిలోనే ప్రధమ స్థానా న్ని కైవసం చేసుకుంది. శ్రీచైతన్య కళాశాలకు చెందిన భలబద్రుని శివప్రగతి 990/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలలో టాప్‌టెన్‌లో నిలిచింది.
 
 ప్రధమ ఇంటర్ ఎంపీసీలో బెజవాడ దుర్గాప్రసాద్(నారాయణ) 465/470, కలగర్ల హారిక(నారాయణ) 464/470, ఆల్తి యశ్వంతకుమార్(శ్రీచైతన్య) 464/470, దాసరి హర్షిత (శ్రీచైతన్య) 464/470 మార్కులు తెచ్చుకొని రాష్ట్రస్థాయిలో టాప్ టెన్‌లో నిలిచారు. అదేవిధంగా శ్రీచైతన్య కళాశాల బైబీసీ గ్రూప్ చదివిన ఎం.కీర్తిలక్షిసాయిచంద్రిక జిల్లాస్థాయిలో అత్యధికమార్కులు 986/1000 మార్కులు తెచ్చుకుంది.
 
  ప్రధమ ఇంటర్ ఎంపీసీలో పార్వతీపురం భాస్కర జూనియర్ కళాశాల విద్యార్ధిని పి.వి.డి.ఎస్.సత్యవాణి ఆత్యధిక మార్కుల(466/470)తో రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచింది. బైపీసీలో పి.సారాసృజన(శ్రీచైతన్య) 434/440మార్కులతో జిల్లాలో ప్రధమస్థానంలో నిలిచిం ది. నారాయణ, శ్రీచైతన్య కళాశాలలో కలిపి సెకెంట్ ఇంటర్ ఎంపీసీలో 989 మార్కులతో ఇద్దరు, 980 మార్కులకు పైపడి 41 మంది, బైపీసీలో 985 మార్కులతో ఒకరు, 980 పై మార్కులతో 6 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement