డిగ్రీ ఇన్‌స్టెంట్ ఫలితాల విడుదల | andhra university degree results realsed | Sakshi
Sakshi News home page

డిగ్రీ ఇన్‌స్టెంట్ ఫలితాల విడుదల

Published Thu, May 29 2014 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

andhra university degree results realsed

 ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ :  ఆంధ్ర విశ్వవిద్యాలయం డిగ్రీ ఇన్‌స్టెంట్ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు తన కార్యాల యంలో బుధవారం విడుదల చేశారు. మొత్తం 96.17 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఆయన తెలిపారు. బీఎస్సీలో 1181 మంది పరీక్ష హాజరవగా 1084 మంది, బీఏలో 146 మంది హాజరవగా 141 మంది, బీకామ్(ఆర్‌ఆర్)లో 838 మంది హాజరవగా 812 మంది, బీకామ్ (వొకేషనల్)లో 342 మంది పరీక్షకు హాజరవగా 340 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.


 బీఎస్సీలో 91.79 శాతం, బీఏలో 96.58, బీకామ్(ఆర్‌ఆర్)లో 96.90, బీకామ్(వొకేషనల్) 99.42 శాతం ఉత్తీర్ణ త సాధించారు. కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలో పరీక్షా ఫలితాలు (ఈనెల19న పరీక్ష జరిగింది) ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఆసెట్ తదితర కౌన్సెలింగ్‌లకు వీలుగా ఉండే విధంగా ఫలితాలు అందించిన ట్టు తెలిపారు.

 వీరికి సత్వరమే మార్కుల జాబితాలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందే విధంగా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. త్వరలో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు, యూజీ పరీక్షల డీన్ జి.సుదర్శనరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement