Provisional Certificates
-
డిగ్రీ సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్లు.. యూజీసీ కీలక ఆదేశాలు
డిగ్రీలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లపై విద్యార్థుల ఆధార్ నంబర్ల ముద్రణపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్లు ముద్రించకూడదంటూ దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను ఆదేశించింది. రిక్రూట్మెంట్ లేదా అడ్మిషన్ సమయంలో పేర్కొన్న పత్రాల వెరిఫికేషన్‌లో తదుపరి ఉపయోగం కోసం తాత్కాలిక సర్టిఫికెట్లు, విశ్వవిద్యాలయాలు జారీ చేసే డిగ్రీలపై పూర్తి ఆధార్ నంబర్లను ముద్రించడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: WFH: అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన ఆధార్ రెగ్యులేషన్స్ 2016 చట్టంలోని రెగ్యులేషన్ 6, సబ్-రెగ్యులేషన్ (3) ప్రకారం ఏ విద్యా సంస్థా విద్యార్థుల ఆధార్ నంబర్లతో కూడిన సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పంపిన సెప్టెంబర్ 1 నాటి లేఖలో యూజీసీ కార్యదర్శి మనోజ్ జోషి పేర్కొన్నారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. UGC Letter regarding display of Aadhaar number on provisional certificates and degrees issued by universities. Read:https://t.co/jtxN2oDipB pic.twitter.com/TSK9ne8hdV — UGC INDIA (@ugc_india) September 1, 2023 -
ఎంటెక్, ఎంఫార్మసీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో గందరగోళం
ప్రొవిజనల్ సర్టిఫికెట్ తెస్తేనే వెరిఫికేషన్ అంటున్న అధికారులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోలేని దుస్థితిలో విద్యార్థులు హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో గందరగోళం నెలకొంది. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు తేవడం లేదనే సాకుతో అనేక మంది విద్యార్థుల సర్టిఫికెట్లను వె రిఫై చేసేందుకు హెల్ప్ లైన్ కేంద్రాల్లోని అధికారులు తిరస్కరిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్రంలోని 269 పీజీ ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 6వ తేదీ నుంచి ప్రక్రియ మొదలుపెట్టారు. పీజీఈసెట్ రాసిన విద్యార్థులకు 9వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించారు. అయితే, రీయింబర్స్మెంట్ కింద రావాల్సిన ఫీజులను విద్యార్థులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని మొదట్లో యాజమాన్యాలు మెలిక పెట్టిన నేపథ్యంలో సర్టిఫికెట్లు లేకపోయినా, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో చేసేదేమీ లేక బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు యాజమాన్యాలు కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం ప్రారంభించాయి. ఇందులో భాగంగా హెల్ప్‌లైన్ కేంద్రాలకు కౌన్సెలింగ్ నిర్వహణ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇపుడు విద్యార్థులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లోని అధికారులే ఇబ్బందులు పెడుతున్నట్లు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల నుంచి తెచ్చుకున్న సర్టిఫికెట్లు కాకుండా సంబంధిత యూనివర్సిటీ జారీ చేసే ప్రొవిజనల్ సర్టిఫికెట్ తీసుకురాలేదనే సాకుతో వెరిఫికేషన్‌కు తిరస్కరిస్తుండటంతో వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. గుంటూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రొవిజనల్ సర్టిఫికెట్ తరువాత అందజేసేందుకు వీలు కల్పించాలని, మొదట సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
డిగ్రీ ఇన్స్టెంట్ ఫలితాల విడుదల
ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం డిగ్రీ ఇన్స్టెంట్ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు తన కార్యాల యంలో బుధవారం విడుదల చేశారు. మొత్తం 96.17 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఆయన తెలిపారు. బీఎస్సీలో 1181 మంది పరీక్ష హాజరవగా 1084 మంది, బీఏలో 146 మంది హాజరవగా 141 మంది, బీకామ్(ఆర్ఆర్)లో 838 మంది హాజరవగా 812 మంది, బీకామ్ (వొకేషనల్)లో 342 మంది పరీక్షకు హాజరవగా 340 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. బీఎస్సీలో 91.79 శాతం, బీఏలో 96.58, బీకామ్(ఆర్ఆర్)లో 96.90, బీకామ్(వొకేషనల్) 99.42 శాతం ఉత్తీర్ణ త సాధించారు. కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలో పరీక్షా ఫలితాలు (ఈనెల19న పరీక్ష జరిగింది) ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఆసెట్ తదితర కౌన్సెలింగ్లకు వీలుగా ఉండే విధంగా ఫలితాలు అందించిన ట్టు తెలిపారు. వీరికి సత్వరమే మార్కుల జాబితాలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందే విధంగా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. త్వరలో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు, యూజీ పరీక్షల డీన్ జి.సుదర్శనరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.