‘అంగన్‌వాడీ’ ఇంటర్వ్యూలు | anganwadi interviews | Sakshi
Sakshi News home page

‘అంగన్‌వాడీ’ ఇంటర్వ్యూలు

Published Sun, Nov 17 2013 4:53 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

anganwadi interviews

బోధన్ టౌన్, న్యూస్‌లైన్ :  జుక్కల్ నియోజక వర్గంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీ నిమిత్తం శనివారం బోధన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థులను జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, సబ్ కలెక్టర్ హరినారాయణన్ ఇంటర్వ్యూ చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో మూడు అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు, ఎనిమిది మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు, 11 అంగన్‌వాడీ ఆయాల పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించామని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపికైన వారి జాబితాను త్వరలో మద్నూర్ సీడీపీఓ కార్యాలయానికి పంపుతామని తెలిపారు.
 నేడు బాన్సువాడకు..
 ఆదివారం బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి రావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement