రాష్ట్ర విభజన ప్రక్రియపై సచివాలయంలో ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. ఇందులో ఢిల్లీ నుంచి వచ్చిన అనిల్ గోస్వామి బృందం, సీఎస్, డీజీపీ, విభజన కమిటీల అధికారులు పాల్గొన్నారు. వీలైనంత త్వరగా విభజన పూర్తి చేయాలని, గడువు కంటే ముందే విభజన కమిటీల పని పూర్తికావాలని అనిల్ గోస్వామి చెప్పారు. కమిటీల మధ్య పని విభజనపై స్పష్టత ఉండాలని, సచివాలయంలో పని విభజన ఒక ఎత్తు.. క్షేత్రస్థాయిలో విభజనను పర్యావేక్షించడం మరో ఎత్తని ఆయన అన్నారు. విభజన విషయంలో ప్రభుత్వాధికారుల పనితీరును అనిల్ గోస్వామి ప్రశంసించారు.
కాగా, బుధవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో ఐపీఎస్ అధికారులతో అనిల్ గోస్వామి బృందం భేటీ కానుంది. ఇందులో డీజీపీ ప్రసాదరావుతో పాటు 25మంది ఐపీఎస్ అధికారులు పాల్గొంటారు. ఉమ్మడి రాజధాని, శాంతిభద్రతలు, పోలీసుల పాత్రపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
విభజనపై అధికారులకు ప్రశంసలు
Published Tue, Mar 18 2014 5:41 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement