ముగ్గురు కోఆప్షన్ సభ్యుల్ని గెలిపించుకున్న టీడీపీ మద్దతుదారులు
చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ డెరైక్టర్లు
సాక్షి ప్రతినిధి, కడప : కడప డీసీసీబీ చైర్మన్‌గా గండ్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం కోరంలేక వాయిదా పడిన చైర్మన్ ఎన్నికను డీసీఓ ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి 17 మంది డెరైక్టర్లు షెడ్యూల్ ప్రకారం 8 గంటలకే హాజరయ్యారు. అనంతరం కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. ఇరుపక్షాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు శ్రీమన్నారాయణరెడ్డి దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించారు.
మైదుకూరు సొసైటీ నుంచి ఇదివరకే ఒక డెరైక్టర్ ఉన్నారని, రెండవ వ్యక్తి అక్కడి నుంచి ఉండరాదంటూ డీసీఓ ఫోమేనాయక్ నామినేషన్ తిరస్కరించారు. అనంతరం కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఓటింగ్ నిర్వహించారు. టీడీపీ మద్దతుదారులకు 9 ఓట్లు, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు 8 ఓట్లు లభించాయి. దాంతో ఒక్క ఓటు తేడాతో మూడు డెరైక్టర్ స్థానాలను టీడీపీ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు.
మరో డెరైక్టర్ చిన్న ఓబులేసు (ఇటీవలే మృతి చెందాడు) స్థానాన్ని వారి కుంటుంబసభ్యులకు ఇవ్వాలని ఇరుపక్షాలు అంగీకరించారు. దాంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. 9 మంది డెరైక్టర్లు టీడీపీకి అండగా నిలవడంతో ముగ్గురు డెరైక్టర్ల ఎంపికకు మార్గం సుగమమైంది. ఆమేరకు రాజానాయక్, చలమయ్య, బాలుడు నూతనంగా డెరైక్టర్లుగా ఎన్నికయ్యారు.
ఛెర్మైన్ ఎన్నిక బహిష్కరణ...
రాజ్యాంగ విరుద్ధంగా ఛెర్మైన్ పదవి దక్కించుకోవడమే ఏకైక లక్ష్యంగా అధికార తెలుగుదేశంపార్టీ వ్యవహరించిన తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ డెరైక్టర్లు చైర్మన్ ఎన్నికను బహిష్కరించారు. దాంతో జి. అనిల్‌కుమార్‌రెడ్డి ఛెర్మైన్ అభ్యర్థిగా ఏకైక నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డీసీఓ ఫోమేనాయక్ ప్రకటించారు.
అనంతరం చైర్మన్ బాధ్యతలను అనిల్‌కుమార్‌రెడ్డి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభసభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, లింగారెడ్డి, వీరశివారెడ్డి, కమలాపురం ఇన్‌ఛార్జి పుత్తానరసింహారెడ్డి, కస్తూరి విశ్వనాథనాయుడు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు.
డీసీసీబీ ఛెర్మైన్‌గా అనిల్‌కుమార్‌రెడ్డి
Published Mon, May 4 2015 3:44 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement