dccb chairman
-
ఉమ్మడి మెదక్‌లోనూ ‘చీకోటి’ కార్యకలాపాలు.. లిస్ట్‌లో డీసీసీబీ ఛైర్మన్!
సాక్షి, మెదక్: క్యాసినోవాలాగా పేరుగాంచిన చీకోటి ప్రవీణ్‌కుమార్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ చికోటి కార్యకలాపాలు కొనసాగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా నేతలతో చికోటి ప్రవీణ్ కుమార్‌కు సత్సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదీన ఏడుపాయలలో చికోటి ప్రవీణ్ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. హరిత హోటల్లో నిర్వహించిన వేడుకలకు సుమారు 150 మంది ప్రముఖులు హాజరైనట్లు తెలిపింది. జన్మదిన వేడుకల కోసం హరిత హోటల్లో చక్రపాణి పేరుతో 6 గదులు, 2 హాల్స్ బుకింగ్ చేశారు. గోవా టూర్‌తో చీకోటి ప్రవీణ్ కుమార్‌కు మెదక్ జిల్లాలోని ప్రముఖ నేతలు, వ్యాపారులు పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. చీకోటితో చీకటి కార్యకలాపాలు సాగిస్తున్నారు. చికోటి లిస్ట్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ సైతం ఉన్నట్లు సమాచారం. చీకోటి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రముఖ పేర్లు బయటకు వస్తుండటం కలకలం సృష్టిస్తోంది. ఇదీ చదవండి: చీకోటి హవాలా దందాలో మరో నలుగురు -
దళిత హక్కుల నేత.. డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ కన్నుమూత..
సాక్షి, నార్నూర్(ఆదిలాబాద్): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఏజెన్సీ దళితుల హక్కుల కోసం పోరాడిన దళిత నేత ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్(65) హఠాన్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన ఆయన బుధవారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాందేవ్ మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 2గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్‌కు చేరుకుని తన సొంత వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాందేవ్ మృతిచెందారు. ఆయన స్వగ్రామం గుంజాలలో విషాదం నెలకొంది. గురువారం ఉదయం 11 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వయంకృషితో ఎదిగారు.. నాందేవ్ వ్యవసాయ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు భార్య సత్యభామ, ఐదుగురు కూతుళ్లు, నలుగురు కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. నాందేవ్ 1990లో విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్‌గా పని చేస్తూనే ఏ1కాంట్రాక్టర్‌గా ఎదిగారు. 1989లో పీఏసీఎస్ తాడిహత్నూర్‌కు చైర్మన్‌గా తొలిసారి ఎన్నికయ్యారు. 1994–95లో జరిగిన ఎన్నికల్లో నార్నూర్ పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు చైర్మన్‌గా ఎన్నిక కావడంతోపాటు ఆరు సార్లు డీసీసీబీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 1997లో ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా దళితుల సమస్యలపై పోరాటం చేశారు. 1/70 చట్టంతో ఏజెన్సీ ప్రాంత దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దళితుల సాగు భూములకు పట్టాలు, పహాణి పత్రాలు ఇవ్వాలని, ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయాలని అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దళితులకు పహాణి పత్రాలు ఇప్పించారు. డీసీసీబీ చైర్మన్‌గా ఉంటూనే ఏజెన్సీ దళితులకు రైతుబంధు, రైతుబీమా వర్తింప చేయాలని తీవ్ర ప్రయత్నం చేశారు. టీడీపీలో సామాన్య కార్యకర్తగా అడుగుపెట్టి తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2020–21ఫిబ్రవరిలో జరిగిన పీఏసీఎస్ ఎన్నికల్లో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి ఐకే రెడ్డి సంతాపం నిర్మల్‌రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ హఠాన్మరణంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాందేవ్ మృతి బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కరీంనగర్ డీసీసీబీ వైఎస్ ఛైర్మన్‌గా రమేష్
-
డీసీసీబీ: అతివకేదీ సహకారం..?
సాక్షి, అచ్చంపేట: ఆకాశంలో సగం.. అంతటా మేం.. అంటూ అన్నిరంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్నిరకాల ఎన్నికల్లో కాస్తో.. కూస్తో ప్రాధాన్యం లభిస్తోంది. కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో మాత్రం అతివలకు ప్రాతినిథ్యం లేకుండా పోతోంది. సంఘాల్లో డైరెక్టర్ల పదవులు మహిళలకు కేటాయిస్తున్నా.. కీలకమైన సొసైటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు మాత్రం అందని ద్రాక్షగానే మారాయి. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 87 సంఘాల్లో ఇద్దరు మాత్రమే పీఏసీఎస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఇక్కడప్రాధాన్యం కరువు ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు పంచాయతీలు, ప్రాదేశిక ఎన్నికల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులతోపాటు ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ పదవుల్లో సైతం సగం కేటాయించింది. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కూడా రొటేషన్ పద్ధతిలో మహిళలకు, ఇతర వర్గాలకు అవకాశాలు కలి్పంచింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం మారుతున్న విధానాలకు అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకువచ్చి ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇక్కడ మాత్రం 1964లో ఏర్పాటైన సహకార చట్టం ఆధారంగానే రిజర్వేషన్లు, ఇతర మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. ప్రతి సంఘంలో 13 వార్డులుండగా ఇందులో రెండు మాత్రమే మహిళలకు రిజర్వు చేశారు. అంటే 15 శాతానికి మాత్రమే పరిమితమైంది. ఉన్న ఒకస్థానం తొలగించారు డీసీసీబీలో ‘ఎ’ కేటగిరి సంఘాల నుంచి 16 మంది, ‘బి’ కేటగిరి సంఘాల నుంచి నలుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. గతంలో మొత్తం 21 మంది పాలకవర్గ సభ్యులు ఉండగా ఈసారి ఒక డైరెక్టర్‌ను తగ్గించారు. గత ఎన్నికల్లో ఎస్సీ (మహిళ)కు ఒక డైరెక్టర్ స్థానం రిజర్వు చేయగా.. ఈసారి దాన్ని తొలగించారు. సభ్యత్వంలోనూ చిన్నచూపే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది మహిళలకు పట్టా భూములున్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలోనైతే ఏకంగా మహిళలే ధాన్యం కొనుగోలు చేసి తమ సత్తా చాటుతున్నారు. వ్యవసాయంలోనూ కీలకంగా ఉన్న వీరిని కనీసం సభ్యత్వం విషయంలో పట్టించుకోవడం లేదు. సాధారణ ఓటర్ల విషయానికి వస్తే పలుచోట్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండి ఎన్నికల్లో గెలుపోటములు వారి చేతిలోనే ఉంటున్నాయి. ఇక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఆయా సంఘాల్లో కనీసం పదిశాతం కూడా దాటడం లేదు. దీంతో వీరి ప్రభావం కనిపించడం లేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 67,149 మంది పురుఘలు, 24,272 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన సంఘాల చైర్మన్లు ఎన్నుకోలేదు. మేకగూడ పీఏసీఎస్ నుంచి కంకటి మంజులారెడ్డి, ధరూర్ నుంచి కుర్వ మహదేవమ్మ ఇద్దరు మాత్రమే చైర్మన్లుగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కొంత వరకు నయంగా ఉండేది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో నలుగురు మహిళా చైర్మన్లు ఎన్నికయ్యారు. స్థానం కల్పించలే.. వార్డు సభ్యులంతా కలిసి సహకార సంఘం చైర్మన్‌ని ఎన్నుకుంటారు. చైర్మన్ స్థానాలకు ఎలాంటి రిజర్వేషన్ లేకపోవడం.. మహిళలు పోను మిగిలిన 11 మంది దాదాపు పురుషులే ఉండటంతో చైర్మన్‌గా ఆమెకు అవకాశం రావడం లేదు. జిల్లా స్థాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్)లలో సొసైటీ చైర్మన్లు సభ్యులు కావడంతో ఇందులో ఒక్క మహిళకు అవకాశం దక్కడం లేదు. ఇందులో కూడా డైరెక్టర్లకు రిజర్వేషన్ వ్యవస్థ ఉన్నప్పటికీ మహిళలకు స్థానం కల్పించలేదు. సభ్యులో ఒకరు చైర్మన్, వైస్ చైర్మన్‌గా ఎన్నుకోనుండటంతో ఇక్కడ కూడా వీరికి ప్రాధాన్యం ఉండటం లేదు. -
అన్ని ఏకగ్రీవాలే..
సాక్షి, కరీంనగర్ : సహకార ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లుగా టీఆర్ఎస్కు చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు, ప్రాథమికేతర సహకార సంఘాల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి మనోజ్‌కుమార్ ఎన్నికైన సభ్యుల జాబితాను ప్రకటించారు. ఎన్నికైన డైరెక్టర్లు ఈ నెల 29న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్‌తోపాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకొంటారు. కాగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా సిట్టింగ్ టెస్కాబ్ చైర్మన్, సిరిసిల్ల జిల్లాకు చెందిన కొండూరి రవీందర్రావును ఎంపిక చేశారు. వైస్ చైర్మన్‌గా జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన పింగిళి రమేష్‌కు అవకాశం దక్కింది. వీరిద్దరిని 29న డీసీఎంఎస్ కార్యాలయంలో జరిగే సమావేశంలో డీసీసీబీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లుగా అధికారికంగా ఎన్నుకుంటారు. డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఎవరనేది తేలకపోయినా, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ముదుగంటి సురేందర్‌రెడ్డి, వీర్ల వెంకటేశ్వర్రావులలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. అత్యధిక సొసైటీలు ఉన్న జగిత్యాల జిల్లాకు అవకాశం కల్పించాలని భావిస్తే ధర్మపురి సొసైటీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, లేని పక్షంలో మిగతా ఇద్దరిలో ఒకరు డీసీఎంఎస్ చైర్మన్ కానున్నట్లు సమాచారం. మంత్రి గంగుల నేతృత్వంలో ప్రక్రియ డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లుగా గ్రూప్–ఏ కింద టీఆర్ఎస్కు చెందిన పలువురు పీఏసీఎస్ అధ్యక్షులు పోటీపడ్డారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలనే పాటించారు. మంగళవారం ఉదయం కరీంనగర్‌లోని శ్రీనివాస హోటల్లో పీఏసీఎస్ అధ్యక్షులతోపాటు ప్రాథమికేతర సొసైటీల అధ్యక్షులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమావేశం అయ్యారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పింగళి రమేష్‌లను చైర్మన్, వైస్ చైర్మన్‌గా పార్టీ ఎంపిక చేసిన విషయాన్ని ప్రకటించిన మంత్రి డైరెక్టర్లుగా పార్టీ ఎంపిక చేసిన వారి పేర్లను ప్రకటించి, వారితో నామినేషన్లు దాఖలు చేయించారు. గ్రూప్–ఏలో 16 మంది నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, 13 మంది మాత్రమే నామినేషన్ వేశారు. గ్రూప్–బీ నుంచి ప్రాథమికేతర సంఘాల సభ్యులుగా నలుగురికి అవకాశం ఉన్నప్పటికీ, ఇద్దరే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నామినేషన్లు దాఖలు చేసిన 15 మందిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మనోజ్‌కుమార్ ప్రకటించారు. మరో ఐదుగురు డైరెక్టర్లను రిజర్వులో పెట్టినట్లు సమాచారం. డీసీఎంఎస్ డైరెక్టర్లుగా గ్రూప్–ఏ నుంచి ఐదుగురు సభ్యులు, గ్రూప్–బీ నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రూప్ ఏలో ఎస్టీ, గ్రూప్–బీలో ఎస్సీలకు చెందిన రెండు డైరెక్టర్లు ఖాళీగా ఉన్నారు. అన్ని జిల్లాలకు అవకాశం డీసీసీబీ చైర్మన్‌గా గజసింగవరం సొసైటీ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఎన్నికవుతారని మొదటి నుంచి ఊహించిందే. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా నుంచి ఆయనకు అవకాశం లభించింది. వైస్ చైర్మన్‌గా మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి అవకాశవిుచ్చారు. డైరెక్టర్లుగా పెద్దపల్లి జిల్లా నుంచి సుల్తానాబాద్ సింగిల్‌విండ్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ముత్తారం మండలం సర్కారం చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డికి అవకాశం కల్పించారు. వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఎల్కతుర్తి సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్‌కు, రాజన్న సిరిసిల్ల నుంచి కొండూరితోపాటు భూపతి సురేందర్, జలగం కిషన్‌రావు, పి.మోహన్‌రెడ్డిలకు అవకాశం లభించింది. కరీంనగర్ నుంచి పింగిళి రమేష్ వైస్ చైర్మన్‌గా, సింగిరెడ్డి స్వామిరెడ్డి డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా నుంచి రమేష్‌రెడ్డి, సురేష్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. డీసీసీబీకి ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లు ... కొండూరి రవీందర్రావు, గుజ్జుల రాజిరెడ్డి, జలగం కిషన్‌రావు, తక్కల్ల సురేష్‌రెడ్డి, దేవరవేని మోహన్‌రావు, పింగిళి రమేష్, మిట్టపల్లి రమేష్‌రెడ్డి, ముప్పాల రాంచందర్ రావు, పుచ్చిడి మోహన్‌రెడ్డి, సింగిరెడ్డి స్వామిరెడ్డి, భూపతి సురేందర్(ఎస్సీ), శ్రీగిరి శ్రీనివాస్(బీసీ), శ్రీపతి రవీందర్‌గౌడ్(బీసీ), పోరండ్ల కృష్ణప్రసాద్, వీరబత్తిని కమలాకర్. డీసీఎంఎస్ డైరెక్టర్లు : అలువాలు కోటయ్య(ఎస్సీ), వీర్ల వెంకటేశ్వర్రావు (బీసీ), ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఎలిశెట్టి భూమారెడ్డి, ముదుగంటి సురేందర్‌రెడ్డి, మహ్మద్ ఫక్రుద్దీన్(బీసీ), గాజుల నారాయణ, ఎ.గోవర్థన్‌రెడ్డి. కేడీసీసీబీ డైరెక్టర్లు వీరే.. పింగిళి రమేష్ ముప్పాల రాంచందర్‌రావు మిట్టపల్లి రమేష్‌రెడ్డి భూపతి సురేందర్ శ్రీగిరి శ్రీనివాస్ దేవరనేని మోహన్‌రావు జలగం కిషన్‌రావు శ్రీపతి రవీందర్‌గౌడ్ తక్కళ్ల నరేష్‌రెడ్డి వీరబత్తిని కమలాకర్ వుచ్చిడి మోహన్‌రెడ్డి సింగిరెడ్డి స్వామిరెడ్డి గుజ్జుల రాజిరెడ్డి -
బయటపడుతున్న డీసీసీబీ మాజీ ఛైర్మన్ అక్రమాలు
సాక్షి, రాజమహేంద్రవరం: డీసీసీబీ అక్రమాలు ఓ పక్క ఒక్కొక్కటి వెలుగు చూస్తుంటే మరోవైపు పలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో లొసుగులు బయటపడుతున్నాయి. డీసీసీబీ వేదికగా జరగిన అక్రమాలు తవ్వే కొద్దీ మరిన్ని నిధుల దుర్వినియోగాలు తెరపైకి వస్తున్నాయి. ప్రత్తిపాడు మండలం లంపకలోవ సహకార సంఘంలో పది కాదు...యాభై కాదు...వంద కాదు ఏకంగా 167 బోగస్ పాస్ బుక్కులను అడ్డుపెట్టుకుని రూ.1.67 కోట్ల మేర అడ్డదారిలో బినామీ రుణాలు పొందేసిన లొసుగుల గుట్టురట్టయింది. తాజా మాజీ డీసీసీబీ చైర్మన్ వరపుల రాజా ప్రాతినిధ్యం వహించిన లంపకలోవ సహకార సంఘంలో రూ.1.67 కోట్ల మేర బోగస్ పాస్ బుక్కుల ద్వారా దుర్వినియోగం కావడం...ఆ తప్పిదాలు అటు ‘51’ విచారణలోనూ...ఇటు రెవెన్యూ బృందం విచారణలోనూ బయటపడుతుండంతో డీసీసీబీ అక్రమాల చిట్టా చేంతాడులా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంఘంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సహకార శాఖలో కీలకమైన 51 విచారణ కొనసాగుతోంది. ఇదే సంఘంలో రైతులకు చెందిన భూములకు సంబంధించి సర్వే నెంబర్ల వివరాలతో ఉండే పాస్ బుక్కులను బోగస్‌వి సృష్టించి లేని రైతుల పేర్లతోనో...అసలు భూములే లేని రైతుల పేర్లతోనో రుణాలు తీసేసి సంఘం నిధులను పథకం ప్రకారం పక్కదారి పట్టించారు. ఈ వ్యవహారంపై ప్రత్తిపాడు తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, పది మంది వీఆర్వోలు ఆ సంఘంలో బుధవారం కేవలం పాస్‌బుక్కులపై విచారణ చేపట్టారు. ఈ సంఘ పరిధిలో మొత్తం 217 పాస్ బుక్కులుండగా అందులో 192 పాస్ బుక్కులపై విచారణ చేపట్టారు. విచారణాంతరం అందులో 167 పాస్ బుక్కులు బోగస్‌వని రెవెన్యూ అధికారుల బృందం నిర్ధారించింది. ఈ సంఘంలో గతం నుంచీ జరిగిన అక్రమాలు విచారణలో వెలుగు చూస్తున్నాయని, సంఘం త్రిసభ్య కమిటీ తరఫున కూడా గత లొసుగులను గుర్తించి విచారణాధికారులు ముందు ఉంచుతామని లంకపలోవ సంఘం త్రిసభ్య కమిటీపర్సన్ ఇన్‌ఛార్జి గొంతెన సురేష్ తెలిపారు. సాక్షాత్తు గత డీసీసీబీ చైర్మన్ రాజా హయాంలోనే లంపకలోవ సంఘంలో ఇంతటి భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరగడంతో ఈ విచారణలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లంకపలోవ సంఘంలో బోగస్ పాస్ పుస్తకాలపై విచారణ చేపట్టినట్లుగానే రెవెన్యూ అధికారుల బృందం ఏలేశ్వరం, శంఖవరం, కిర్లంపూడి మండల్లాలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని సంఘాల్లోనూ గురువారం విచారణ చేపట్టనుందని తెలిసింది. -
ఇది ‘ధర్మమా’..‘రాజా’?
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో గడచిన ఐదేళ్లలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. బ్యాంక్ సొమ్మును ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసిన విషయం ప్రాథమికంగా నిర్దారణ కావడంతో సహకార చట్టాల్లో పాశుపతాస్త్రంగా పరిగణించే సెక్షన్–51ను ప్రయోగించింది. సహకార చట్టాల్లో ఈ సెక్షన్‌కు ఉన్న ప్రాధాన్యం మిగిలిన ఏ సెక్షన్‌కూ లేదు. ఇది అక్రమార్కులకు సింహస్వప్నం. అటువంటి సెక్షన్‌తో విచారణ ప్రారంభం కావడంతో డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, ప్రస్తుత సీఈఓ మంచాల ధర్మారావు సహా డీసీసీబీలో అన్ని స్థాయిల అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగినా ప్రధాన బాధ్యుడైన సీఈఓతోనే పోదని, తమ మెడకు చుట్టుకుంటుందనే ఆందోళన డీసీసీబీ అధికారులకు గుబులు పుట్టిస్తోంది. చైర్మన్ రాజా, సీఈఓ ధర్మారావు లక్షల మంది నమ్మకాన్ని దెబ్బతీసి డీసీసీబీకి గండికొడతారా, ఇది ధర్మమా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కుంభకో ణంపై సెక్షన్ 51 విచారణకు ఆదేశించడంతో ఈ సెక్షన్ ఏమి చెబుతోంది? విచారణలో దీని పాత్ర ఏమిటి? విచారణ అనంతరం పరిణామాలు ఎలా ఉం టాయి? అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మెక్కిన సొమ్మును కక్కిస్తుంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లేదా, డీసీసీబీలో చాలా తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడే మాత్రమే అరుదుగా ఈ సెక్షన్‌ను వినియోగిస్తుంటారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో డీసీసీబీలో జరిగిన అవకతవకలపై సెక్షన్–51 వేయడం డీసీసీబీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సహకార బ్యాంక్‌లు, సంఘాల్లో లొసుగులు, లోతులను నిశితంగా కనుగొనే అవకాశం సెక్షన్ 51కి మాత్రమే ఉంది. సహకార చట్టం, సహకార బ్యాంక్‌ల బైలా, సంఘాల నిబంధనల అమలులో ఎక్కడైనా పాలకవర్గాలు, అధికారులు దారితప్పి నిధులను మింగేస్తే దారిలో పెట్టడమే కాకుండా, మెక్కిన నిధులను కక్కించే అధికారం కూడా ఈ విచారణకే ఉంది. అంతిమంగా నిగ్గు తేల్చడానికి... 1964లో రూపొందిన సహకార చట్టం ద్వారా సెక్షన్ 51 ఎంక్వయిరీ మొగ్గ తొడిగింది. సహకార చట్టం ఈ సెక్షన్‌కు విశేషాధికారాలు కట్టబెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే సహకార శాఖలో 51 ఎంక్వయిరీ అంటే తుది తీర్పుగా చెప్పుకోవచ్చు. సహకారశాఖ పరిధిలో నిధులు దుర్వినియోగం అయినప్పుడు తొలుత ప్రా«థమిక విచారణ చేపడతారు. ఆ ప్రాథమిక విచారణలో నిధుల దుర్వినియోగం రూ.కోట్లలో ఉన్నప్పుడు సమగ్ర విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రభుత్వం భావించినప్పుడు అక్రమాలు నిగ్గు తేల్చేందుకు 51 విచారణకు ఆదేశిస్తుంది. సహకార బ్యాంక్, సహకార సంఘంలో నిధులు దుర్వినియోగం జరిగినప్పుడు తొలుత ప్రాథమిక విచారణ నిర్వహిస్తారు. తర్వాత తనిఖీలు (ఇన్స్పెక్షన్లు) నిర్వహించే అధికారం సెక్షన్ 52కు ఉంటుంది. ఈ సెక్షన్‌ను వినియోగించి దుర్వినియోగం అయిన నిధులకు ఆడిట్ ఎలా జరిగింది, నిబంధనలకనుగుణంగానే ఆడిట్లు జరిగాయా, ఆడిట్ అభ్యంతరాలను కూడా అతిక్రమించారా వంటి విషయాలు నిర్ధారించేందుకు సెక్షన్ 50 విచారణ జరుగుతుంది. సాధారణంగా ఈ మూడు దశల విచారణలు పూర్తయ్యాకే అంతిమంగా నిధుల దుర్వినియోగం తీవ్రతను బట్టి సెక్షన్ 51 విచారణకు శ్రీకారం చుడతారు. సహకారశాఖ కమిషనర్, రిజిస్ట్రార్, జిల్లా సహకార అధికారులు...ఇలా పలు స్థాయిల్లో అధికారులు అన్ని కోణాల్లో పరిశీలన జరిపి సమగ్ర విచారణ అనివార్యమైనప్పుడు సెక్షన్ 51ని ప్రయోగిస్తారు. పలు కోణాల్లో శోధించి కుంభకోణం ఛేదించడమే లక్ష్యం 51 విచారణతో 2013 ఫిబ్రవరి నుంచి 2019 మార్చి నెల వరకూ డీసీసీబీ చైర్మన్ రాజా, గత సీఈఓ హేమసుందర్, ప్రస్తుత సీఈఓ మంచాల ధర్మారావు హయాంలో జరిగిన నిధులు దుర్వినియోగంపై లోతైన విచారణకు సమాయత్తమవుతున్నారు. డీసీసీబీ పదవీకాలంలో చివరి రెండు సంవత్సరాల్లోనే పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ కాలంలో సీఈఓ ధర్మారావు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని సహకారశాఖ కమిషనర్ వద్ద పక్కా సమాచారం ఉందంటున్నారు. ఈ క్రమంలోనే డీసీసీబీలో రుణాలు నిబంధనల మేరకే ఇచ్చారా? రుణాలు తీసుకున్నవారు అర్హులేనా? వారికి రుణాలు తిరిగి చెల్లించే ఆర్థిక స్తోమత ఉందా? రుణాలు తీసుకునే ముందు తనఖా పెట్టిన సాగు భూములు దస్తావేజులు సక్రమంగా ఉన్నాయా లేదా? చనిపోయిన వారి పేరుతో కూడా రుణాలు మంజూరు అయ్యాయా? సహకారశాఖ పేరుతో అధికారులు నిధుల దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డారు, అందుకు పాలకవర్గం ఆమోదం సంపూర్ణంగా ఉందా లేదా..? పాలకవర్గ సభ్యుల ప్రయోజనాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిందా? తప్పుడు సమాచారం, తప్పుడు పత్రాలతో నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగిందా? పరపతేతర పేరుతో లేదా, రైతులకు విజ్ఞాన యాత్రల పేరుతో నిధులు మెక్కేశారా? చట్టం, బ్యాంక్‌లు, సంఘాల బైలాకు అనుగుణంగా సీఈఓ నిర్ణయాలు తీసుకున్నారా లేదా, బినామీ పేర్లతో స్వప్రయోజనాల కోసం తీసుకున్నారా? ఇలా పలు కోణాల్లో ఆయా సంఘాలు, బ్యాంక్‌ల్లో జరిగిన నిధుల దుర్వినియోగాన్ని బట్టి లోతైన విచారణ చేయడం సెక్షన్ 51 లక్ష్యం. అందుకే డీసీసీబీ చైర్మన్, సీఈఓలు అంతగా ఆందోళన చెందుతున్నారంటున్నారు. విచారణాధికారికి విశేషాధికారాలు.. సెక్షన్ 51 విచారణాధికారికి విశేషాధికారాన్ని కట్టబెట్టింది. ఈ వ్యవహారంలో విచారణాధికారిగా నియమితులైన అమలాపురం డివిజనల్ సహకార అధికారి బి.దుర్గాప్రసాద్ నిధుల దుర్వినియోగం ఎలా జరిగిందో పరిశీలించడమే కాకుండా అక్రమ వ్యవహారాలను వెలికితీస్తూనే ఆ నిధులు రికవరీ కూడా చేయనున్నారు. నిధులు రికవరీ అయినప్పుటికీ అక్రమార్కులపై చర్యలకు అవసరాన్ని బట్టి సమన్లు కూడా జారీచేసే అధికారం ఈ సెక్షన్ కట్టబెట్టింది. అక్రమార్కులను సస్పెండ్ చేయాలా... విధుల నుంచి పూర్తిగా ఉద్వాసన పలకాలా..? వంటి సూచనలు చేసే అధికారం విచారణాధికారికి ఉంటుంది. నిధులు కాజేసిన వారిపై పక్కా ఆధారాలతో సివిల్ లేదా క్రిమినల్ కేసులు పెట్టే అధికారం కూడా ఈ సెక్షన్లో ఉంది. ఎంతటి వారినైనా విచారించే అధికారం సెక్షన్ 51కి ఉంది సహకార శాఖలో నిధులు దుర్వినియోగం అయినప్పుడు ఎంతటి వారినైనా విచారించే సర్వాధికారం సెక్షన్ 51కు ఉంది. విచారణాధికారి బాధ్యులైన వారికి సమన్లు జారీ చేసే అధికారం కూడా ఉంది. సహకార చట్టంలో అత్యంత విశేష అధికారాలు ఒక్క 51కు మాత్రమే ఉన్నాయి. ఈ విచారణకు పరిధులు, పరిమితులు ఉండవు. ఏ కోణంలోనైనా విచారణ చేయవచ్చు. అనుమానాల నివృత్తికి, వాస్తవాల వెలికితీతకు విచారణాధికారి బాధ్యులుగా భావించే వారిని సమగ్రంగా విచారించే అధికారం ఉంటుంది. సహకార శాఖలో సెక్షన్ 51 ఎంక్వయిరీ పడిదంటే ఆ అక్రమాల అంతు అంతిమంగా తేలినట్టు. నిధులు దుర్వినియోగం వెలుగు చూడాల్సిందే. – మహ్మద్ అమీర్, విశ్రాంత సహకార అసిస్టెంట్ రిజిస్ట్రార్, అమలాపురం -
అక్రమ ముత్యాల టు ఆణిముత్యాల
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు గాడిలో పడుతుందా అన్నది కీలకంగా మారింది. గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం ఆధ్వర్యంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. గ్యారెంటీలు లేకుండా కోట్లాది రూపాయలు రుణాలు ఇచ్చేశారు. మరోవైపు ఇష్టారాజ్యంగా కనీసం టెండర్లు పిలవకుండానే తెలుగు తమ్ముళ్లకు అవుట్సోర్సింగ్ పేరుతో ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇప్పటికే బ్యాంకు అక్రమాలపై విచారణ జరుగుతోంది. ఇప్పుడు పర్సన్ ఇన్చార్జిగా జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు బాధ్యతలు స్వీకరించడంతో అక్రమార్కులలో వణుకు మొదలైంది. అంతా అడ్డగోలే! గత డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం హయాంలో టెండర్లు పిలవకుండా అవుట్సోర్సింగ్ నియామకాలు జరిగిపోయాయి. ఎటువంటి నిబంధనలు పాటించకుండా బ్యాంకులో అవుట్‌సోర్సిం గ్ కింద సుమారు 50 మంది వరకూ పనిచేస్తున్నారు. చైర్మన్ డ్రైవర్‌ను కూడా పర్మినెంట్ చేయించుకునే ప్రయత్నం జరిగింది. చివరి జనరల్ బాడీలో తన డ్రైవర్‌ను పర్మినెంట్ చేయాలని సీఈఓకు చెప్పారు. తన పార్టీకి చెందిన వారిని ఎక్కువ మందిని నియమించుకున్నారు. పర్మినెంట్ ఉద్యోగిని ఇంటి వద్ద పనులు చేయిం చుకోవడం కోసం నియమించుకున్నారు. ఇతనిని ఆకివీడు, ఒడిశాలలో చైర్మన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వంటలు చేయడం కోసమే వాడుకున్నట్లు సమాచారం. ఇప్పుడు అతనికి వాలంటరీ రిౖటైర్‌మెంట్ ఇచ్చి అతని కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు యత్నాలు జరుగుతున్నా యి. ఇందుకు మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్ ఉండాలి. కనీసం ఐదేళ్లు సర్వీస్ ఉంటే గానీ వాలంటరీ రిటైర్మెంట్కు అనుమతి ఇవ్వకూడదు. అయితే ఈ ఉద్యోగికి మూడేళ్లు కూడా ఇంకా సర్వీస్ లేదని సమాచారం. ఈ విధంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే ముగ్గురిని బ్యాంకులో నియమించినట్టు సమాచారం. 18 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి కుమారుడికి కోర్టు ఆర్డర్ సరిగా లేకపోయినా ఉద్యోగం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు సీఈఓగా 2015లో రిటైరైన వ్యక్తిని నియమించుకున్నారు. విచారణ గాలికి.. జిల్లా సహకార బ్యాంకులో జరిగిన కుంభకోణం విచారణ ఇంతవరకూ తేలలేదు. డీసీసీబీలో జరిగిన అక్రమాలపై ఈ ఏడాది జనవరి 18న రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం తనకు ఉన్న పలుకుబడితో ఇప్పటి వరకూ విచారణ పూర్తికాకుండా ఒత్తిళ్లు తెచ్చారు. ఈ పాలకవర్గం హయాంలో డీసీసీబీలో సుమారు 33.32 కోట్ల రూపాయలు సెక్యూరిటీలు లేకుండా రుణం ఇచ్చి బ్యాంకు నష్టాలకు కారణమయ్యారు. సెక్యూరిటీలు లేకుండా రుణాలు ఇచ్చి బ్యాంకు నష్టాలకు కారణమైన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు, ఉద్యోగులపై విచారణ చేపట్టాలని జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరిలోనే విచారణకు ఆదేశించినా ఇప్పటి వరకూ నివేదిక ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివేదిక తొక్కి పెట్టేందుకు అంటూ ఒక్కో బ్యాంకు బ్రాంచి నుంచి మూడు లక్షల రూపాయల చొప్పున వసూలు చేశారు. సుమారు 34 బ్రాంచుల నుంచి ఈ డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. కలెక్టర్ ముత్యాల రాజు బాధ్యతల స్వీకరణ కొత్త ప్రభుత్వం డీసీసీబీకి పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ ముత్యాలరాజును నియమించింది. ఆయన బాధ్యతలు స్వీకరించారు. సమర్థవంతమైన అధికారిగా పేరున్న ముత్యాలరాజు బ్యాంకు వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే మాత్రం అవకతవకలు బయటపడే అవకాశం ఉంది. -
కేసీఆర్ మోసాలను చూసే కాంగ్రెస్‌లోకి చేరికలు
తిప్పర్తి : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నారని డీసీసీబీ డైరెక్టర్ సంపత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పజ్జూరులో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజ లను మోసపూరిత మాటలతో మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పలు అభివృ ద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సిం గం సత్తయ్య, మండల అధ్యక్షుడు జూకూరి రమేష్, ఎంపీటీసీ కి న్నెర అంజి, దొంతినేని నాగేశ్వర్రావు, సురిగి రామకృష్ణ, జంజారాల సైదులు, దొడ్డ సోమయ్య, కస్పరాజు అయోధ్య, పల్లెసైదులు, భాస్కర్, ఆనందం, లింగస్వామి, యాదగిరి, బాలయ్య, భి క్షం, నర్సింహ, వార్డు సభ్యులు పల్లె సైదులు, నాగమ్మ ఉన్నారు. -
వివాదంలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్ : అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) సీఈవో మదన్మోహన్ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ సంభాషణ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో అధికారిని ఎమ్మెల్యే బూతులు తిట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. డీసీసీబీలో సస్పెన్షన్‌కు గురైన డీజీఎం స్థాయి ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకునే వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యేకు, సీఈవోకు మధ్య ఈ సంభాషణ జరిగింది. దేవరకొండ డీసీసీబీ బ్రాంచిలో అవినీతికి పాల్పడిన వారిపై కేసు పెట్టిన మహిళా అధికారిని సస్పెండ్ చేశారని.. తిరిగి విధుల్లోకి తీసుకోకుండా వేధిస్తుండడంతో తాను గట్టిగా నిలదీశానని ఎమ్మెల్యే వీరేశం చెబుతున్నారు. అధికారి, ఎమ్మెల్యేల ఫోన్‌కాల్ సంక్షిప్తంగా.. ఎమ్మెల్యే: సీఈవోగారు చిన్న పని.. సీఈవో: చైర్మన్ గారికి చెప్పాను సార్, మండే వస్తారు.. ఎమ్మెల్యే: ఒకరోజు టైం ఇవ్వండి అన్నావు కదా.. సీఈవో: చైర్మన్‌గారికి చెప్పాను సార్.. మండే వచ్చి చూస్తానని చైర్మన్‌గారు చెప్పారు సార్.. ఎమ్మెల్యే: దీంట్లో చైర్మన్‌కు ఏం పని? సీఈవో: చైర్మన్ సంతకం పెట్టాలి సార్ ఎమ్మెల్యే: బైలా ప్రకారం జీఎం, డీజీఎం, అసిస్టెంట్ జీఎం దాకా సీఈవోనే ఫైనల్ అని ఉంది. బుక్కు ప్రింట్ చేసినోడు తప్పు చేసిండా. జీవో ఇచ్చినోడు తప్పు చేసిండా. మరి మీరు తప్పు చేస్తున్నరా.. నాకు అర్థం కావట్లే.. సీఈవో: లేదు సార్.. నేను తప్పు కాదు సార్ ఎమ్మెల్యే: మండే నేను వస్తా. నాకు ఆర్డర్ కాపీ ఇస్తవా..? సీఈవో: సరే సార్.. మండే రోజు చైర్మన్ సార్ వస్తానన్నరు సార్. ఎమ్మెల్యే: ఏయ్..! చెప్పేది వినాలి.. డ్రామా చేయకు. మొన్న ఏం చెప్పినవ్. ఒకరోజు టైమివ్వండి.. నేను హ్యాండికాపిడ్.. కథ కార్కానమ్ అని చెప్పినవా.. లేదా.. సీఈవో: చెప్పిన సార్.. ఎమ్మెల్యే: ఇప్పటి వరకు ఫైల్ పెట్టినవా? సీఈవో: ఫైల్ పెట్టిన సార్.. చైర్మన్‌కు పెట్టిన ఎమ్మెల్యే: ఫైల్ ఎక్కడ ఉంది.. ఫైల్ నంబర్ చెప్పు సీఈవో: ఫైల్ చైర్మన్‌గారికి పెట్టాను సార్.. నంబర్ లేదు దానికి ఎమ్మెల్యే: చైర్మన్ సంతకం ఎందుకు చెల్లుతది.. ఎంప్లాయికి..? సీఈవో: ఇది వరకు చైర్మన్‌నే ఆర్డర్ ఇచ్చారు సార్ ఎమ్మెల్యే: వాడెవెడు ఆ పనికి.. నువ్వు ఎవడు.. వానిది నీది ..... నీ అయ్య జాగీరా.. చైర్మన్, నువ్వు ఇద్దరం దోచుకుతింటమని రాసకొచ్చుకున్నరా.. వాడి మీద నువ్వు.. నీ మీద వాడు.. ఇద్దరిదీ పలగ్గొడతా.. నేను మంచిగుంటెనే మంచోణ్ని.. ఒక రోజు టైం అడిగినవ్.. సరేనన్న.. నువ్వు ఇంకా ఫైలే పెట్టకుండా మళ్లీ చైర్మన్ అనే వెధవ గురించి నాకు చెప్పొద్దు. ఉద్యోగం ఇస్తవా.. లేదా.. లేకుంటే నిన్ను, నీ చైర్మన్‌ను, సంపత్‌రెడ్డి అనేటోణ్ని ముగ్గురి ..... పలగ్గొడతా ఆడికి వచ్చి ... సంపత్ రెడ్డిగాడు నాయి ఊరికనే 8 లక్షలు తీసుకుండు. వాని ఓటు అమ్ముకోవడానికి రూ. 8 లక్షలు తీసుకుండు. నీక్కూడా డబ్బులు కావాలంటే చెప్పు ఇస్తం. సీఈవో: నేను అలాంటి వాడిని కాదు సార్.. ఎమ్మెల్యే: అలాంటోడివి కావైయితివి.. సిస్టమ్‌ను ఫాలో అయితున్నంటివి.. ఆంధ్రా నుంచి వచ్చి మా దగ్గర ఉద్యోగం చేస్తుంటివి. మమ్ముల్ని ... కుడిపితివి ఎట్లా.. సీఈవో: చైర్మన్‌గారు సంతకం పెడితే ఇస్తాను సార్ ఎమ్మెల్యే: నువ్వు రూల్స్ పాటించకుండా ఎట్లా ఆపుతవ్.. ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నవ్.. కోర్టు నిన్ను జైల్లో ఎందుకు పెట్టకూడదు.. మీ బ్యాంకర్ చైర్మన్‌కు ఫిర్యాదు చేయాలా.. పది లక్షలు డిమాండ్ చేస్తుండు.. లేకుంటే ఇస్తలేడని సీఎం కాడ ఫిర్యాదు చేస్తా.. సీఈవో: మండే చైర్మన్ వస్తానన్నాడు సార్ ఎమ్మెల్యే: చైర్మన్ మాట ఎత్తొద్దు. డ్రామాలు వినను. నా దగ్గర బైలా బుక్ ఉంది. యాక్ట్‌లు చదువుకో. నీకు మెయిల్ చేస్తా. మల్లికార్జున్ వస్తడు పని చేసిపెట్టు. లేదంటే నాకు ఇక్కడి నుంచి 30 నుంచి 40 నిమిషాలు జర్నీ. నేనే వస్తా.. ప్రజల పక్షాన మాట్లాడుతా.. ‘‘దేవరకొండ సొసైటీ బ్యాంకులో 21 మంది అవినీతికి పాల్పడ్డారు. డీజీఎం లక్ష్మిని విచారణాధికారిగా నియమించారు. ఆమె అవినీతికి పాల్పడిన వారిపై దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. కానీ డీజీఎం తమను డబ్బులు అడిగిందని వాళ్లు తిరిగి కేసు పెట్టారు. దీంతో రెండేళ్ల కింద డీజీఎంను సస్పెండ్ చేశారు. ఏడాది నుంచి తిప్పుతున్నారు. ఆరు నెలల నుంచి జీతం ఇవ్వడం లేదు. పది లక్షలు ఇస్తే ఉద్యోగంలోకి తీసుకుంటామన్నరు. ఆమె వికలాంగురాలు. నేను న్యాయం పక్షాన నిలబడి ప్రశ్నించిన. ప్రజల పక్షాన నిలదీస్తా.. నీ సంగతి చూస్తా అని కూడా మాట్లాడుతా. నాకు నటించడం రాదు. ఇట్లనే జీవిస్తం..’’ – వేముల వీరేశం, నకిరేకల్ ఎమ్మెల్యే కావాలనే ఇబ్బంది పెడుతున్నారు ‘‘2013లో దేవరకొండ బ్రాంచిలో అక్రమాలు జరిగాయి. నన్ను విచారణాధికారిగా వేశారు. అవినీతికి పాల్పడిన వారిపై కేసు పెట్టాను. అప్పటినుంచి బ్యాంకులో డైరెక్టర్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. 2015లో నన్ను కావాలనే సస్పెండ్ చేశారు. రెండేళ్లు పూర్తయింది. తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు శుక్రవారం ఆర్డర్ కాపీ ఇస్తామన్నారు. అసలు ఈ వ్యవహారంలో డీసీసీబీ చైర్మన్‌కు సంబంధం లేదు. సీఈవో కావాలనే అలా చెబుతున్నారు. డైరెక్టర్లు సీఈవోపైన ఒత్తిడి చేస్తున్నారు..’’ – సస్పెన్షన్‌కు గురైన డీజీఎం లక్ష్మి -
డీసీసీబీ చైర్మన్ జంగాపై వేటు!
⇔ వరంగల్ డీసీసీబీలో అక్రమాలు ⇔ చైర్మన్ రాఘవరెడ్డిపై సీఎంకు ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు ⇔ ప్రాథమిక విచారణలో అక్రమాల ధ్రువీకరణ.. ⇔ పాలకవర్గంపై వేటుకు సర్కారు మొగ్గు సాక్షి, హైదరాబాద్: అక్రమాల ఆరోపణలు వరంగల్ సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గం రద్దుకు దారి తీస్తున్నాయి. డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ సహకార శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. డీసీసీబీలో అక్రమాలు, చైర్మన్ రాఘవరెడ్డి అవినీతిపై అదే జిల్లాకు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సహకార శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా విచారణ పూర్తి చేశారు. మార్చి 22న వరంగల్ డీసీసీబీ కార్యాలయానికి వచ్చి అధికారులు రికార్డులను పరిశీలించారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. విచారణ నివేదికలను సీఎం కార్యాలయానికి, హైదరాబాద్‌లోని నాబార్డు, ఆర్బీఐ అధికారులకు పంపారు. ప్రాథమిక విచారణ నివేదికలో అధికారులు పాలక వర్గాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. అక్రమాల్లో భాగస్వాములైన అధికారులపైనా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. విచారణ నివేదిక ఆధారంగా వరంగల్ డీసీసీబీ పాలకవర్గాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా సహకార చట్టంలోని 51 సెక్షన్ ప్రకారం కూడా విచారించాలని సహకార శాఖ ఉన్నతాధికారులు సోమవారం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నివేదిక రాగానే... పాలకవర్గాన్ని రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకోనుంది. జంగా రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మరో ఐదుగురు ఎమ్మెల్యేలతో కలసి డీసీసీబీలో అక్రమాలపై సీఎంకు ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రైతుల కోసం నాబార్డు కేటాయించిన రూ.50 లక్షల నిధులలో ఒక్క రూపాయి కూడా అన్నదాతలకు ఇవ్వకుండా రాఘవరెడ్డి మొత్తం తన పేరిటే తీసుకున్నారని, అలాగే కుటుంబ సభ్యులకు భారీగా ప్రయోజనం చేకూర్చేలా రుణాలు పొందారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాఘవరెడ్డి ప్రాతినిధ్యం వహించే దర్గా కాజీపేట సొసైటీలో కుటుంబీకులందరి పేరిట పంట రుణాలు, ఇతరుల పేరుతో బినామీ రుణాలు తీసుకున్నారని, మళ్లీ ఇవే భూములపై మార్టిగేజ్ రుణాలు పొందారని పేర్కొన్నారు. ఇలా ఎమ్మెల్యేలు మొత్తం 16 అంశాలపై ఫిర్యాదులు చేశారు. -
విదేశీ పర్యటనకు డీసీసీబీ చైర్మన్ ‘లింగాల’
అనంతపురం అగ్రికల్చర్ : సహకార రంగ అధ్యయనం కోసం డీసీసీబీ చైర్మన్ లింగాల శివశంకరరెడ్డి శుక్రవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల బందం శనివారం (24) నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు అస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనకు వెళుతున్నట్లు తెలిపారు. అప్కాబ్ డైరెక్టర్‌గా తనకు ఆహ్వానం రావడంతో బయలుదేరినట్లు తెలిపారు. విదేశాల్లో సహకార వ్యవస్థ అమలవుతున్న తీరు, ప్రయోజనాలపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పర్వతగిరి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కల్లెడలో పీఏసీఎస్ నూతన కార్యాలయ భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ రై తు సంక్షేమమం కోసం సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను కడుతున్న ట్లు తెలిపారు. రైతులకు ఉదయం 9 గంట ల కరెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ పీఏసీఎస్‌ల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు అనేక ప్రయోజనాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పీఎసీఎస్ ఆవరణ లో మెుక్కలను నాటారు. అలాగే కల్లెడ బీసీకాలనీలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చే శారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి రామ్మోహన్రావు, ఎంపీపీ రంగు రజితకుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు మాదాసి శైలజా సు« దాకర్, సర్పంచ్ చినపాక శ్రీనివాస్, చైర్మన్ అశోక్‌రావు తదితరులు ఉన్నారు. -
ఈ ఏడాది రూ.250 కోట్ల పంట రుణాలు
సంగారెడ్డి క్రైం: సహకార బ్యాంకుల ద్వారా ఈ ఏడాది రూ.250 కోట్ల పంట రుణాలివ్వనున్నట్టు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లాలోని 105 సహకార సంఘాల అధ్యక్షులు, సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 105 సంఘాలుండగా కేవలం ఐదు మాత్రమే లాభాల్లో ఉన్నాయన్నారు. ఈ మధ్యనే మరో 60 సంఘాలు లాభాల బాటలోకి వచ్చాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ.40 కోట్ల దీర్ఘకాలిక రుణాలను రైతుల నుంచి వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐదెకరాలున్నా ట్రాక్టర్ లోన్.. రైతు దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోగా రుణం మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ తెలిపారు. గతంలో 12 ఎకరాల భూమి ఉన్న వారికి ట్రాక్టర్ రుణం ఇచ్చే వారమని, ఇప్పుడు 5 ఎకరాల భూమి ఉన్న వారికి కూడా ఇస్తామన్నారు. గతంలో అన్ని రకాల రుణాలు రూ.350 కోట్ల మేర అందించామని, ఈ ఏడాది రూ.500 కోట్ల వరకు రుణాలిస్తామన్నారు. ఐదు నుంచి వేయి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తామన్నారు. సహకార సంఘాలు ఆకాశమే హద్దుగా వ్యాపారం చేసేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. సిద్ధంగా ఎరువులు : జేసీ ఖరీఫ్‌లో రైతులకు సకాలంలో అందించేందుకు వీలుగా 95 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచినట్టు జేసీ వెంకట్రాంరెడ్డి తెలిపారు. ఈ ఖరీఫ్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారి నుంచి పెద్ద ఎత్తున దానయ సేకరించేందుకు పకడ్బందీ ప్రణాళికలు తయారు చేసినట్లు వివరించారు. రేక్ పాయింట్‌ను మార్చాలి.. రైతుల నుంచి సహకార సంఘాలు పది శాతం మార్జిన్‌మనీ సేకరిస్తే ఆ డబ్బును కేంద్ర బ్యాంకు దగ్గర పెట్టుకోవడం వల్ల అవి నష్టాల పాలవుతున్నట్టు కోనాపూర్ సహకార సంఘం అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి అన్నారు. జహీరాబాద్‌లో ఉన్న రేక్ పాయింట్‌ను జిల్లా మధ్యలోకి మార్చాలని కోరా రు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ హుక్యా నాయక్, జిల్లా సహకార ఇన్చార్జి అధికారి సత్యనారాయణరెడ్డి, మార్క్‌ఫెడ్ ప్రతినిధులు, సహకార బ్యాంకు అధికారులు, పీఏసీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు, డీఎల్సీఓలు పాల్గొన్నారు. -
డీసీసీబీ ఛెర్మైన్‌గా అనిల్‌కుమార్‌రెడ్డి
ముగ్గురు కోఆప్షన్ సభ్యుల్ని గెలిపించుకున్న టీడీపీ మద్దతుదారులు చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ డెరైక్టర్లు సాక్షి ప్రతినిధి, కడప : కడప డీసీసీబీ చైర్మన్‌గా గండ్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం కోరంలేక వాయిదా పడిన చైర్మన్ ఎన్నికను డీసీఓ ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి 17 మంది డెరైక్టర్లు షెడ్యూల్ ప్రకారం 8 గంటలకే హాజరయ్యారు. అనంతరం కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. ఇరుపక్షాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వైఎస్సార్సీపీ మద్దతుదారుడు శ్రీమన్నారాయణరెడ్డి దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించారు. మైదుకూరు సొసైటీ నుంచి ఇదివరకే ఒక డెరైక్టర్ ఉన్నారని, రెండవ వ్యక్తి అక్కడి నుంచి ఉండరాదంటూ డీసీఓ ఫోమేనాయక్ నామినేషన్ తిరస్కరించారు. అనంతరం కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఓటింగ్ నిర్వహించారు. టీడీపీ మద్దతుదారులకు 9 ఓట్లు, వైఎస్సార్సీపీ మద్దతుదారులకు 8 ఓట్లు లభించాయి. దాంతో ఒక్క ఓటు తేడాతో మూడు డెరైక్టర్ స్థానాలను టీడీపీ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. మరో డెరైక్టర్ చిన్న ఓబులేసు (ఇటీవలే మృతి చెందాడు) స్థానాన్ని వారి కుంటుంబసభ్యులకు ఇవ్వాలని ఇరుపక్షాలు అంగీకరించారు. దాంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. 9 మంది డెరైక్టర్లు టీడీపీకి అండగా నిలవడంతో ముగ్గురు డెరైక్టర్ల ఎంపికకు మార్గం సుగమమైంది. ఆమేరకు రాజానాయక్, చలమయ్య, బాలుడు నూతనంగా డెరైక్టర్లుగా ఎన్నికయ్యారు. ఛెర్మైన్ ఎన్నిక బహిష్కరణ... రాజ్యాంగ విరుద్ధంగా ఛెర్మైన్ పదవి దక్కించుకోవడమే ఏకైక లక్ష్యంగా అధికార తెలుగుదేశంపార్టీ వ్యవహరించిన తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ డెరైక్టర్లు చైర్మన్ ఎన్నికను బహిష్కరించారు. దాంతో జి. అనిల్‌కుమార్‌రెడ్డి ఛెర్మైన్ అభ్యర్థిగా ఏకైక నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డీసీఓ ఫోమేనాయక్ ప్రకటించారు. అనంతరం చైర్మన్ బాధ్యతలను అనిల్‌కుమార్‌రెడ్డి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభసభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, లింగారెడ్డి, వీరశివారెడ్డి, కమలాపురం ఇన్‌ఛార్జి పుత్తానరసింహారెడ్డి, కస్తూరి విశ్వనాథనాయుడు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. -
రంగారెడ్డి డీసీసీబీ.. తాత్కాలికంగా టీఆర్ఎస్ కైవసం
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. గత స్థానికసంస్థల ఎన్నికల్లో డీసీసీబీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్‌గా లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. అయితే సంవత్సరం కూడా గడవకముందే.. టీఆర్ఎస్ ప్రలోభపెట్టడం మొదలుపెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తన పావులను చాకచక్యంగా కదుపుతోంది. తాజాగా గురువారం రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గారు. తాత్కాలిక చైర్మన్‌గా టీఆర్ఎస్కు చెందిన పెంటారెడ్డిని ఎన్నుకున్నారు. మే 2న కొత్త చైర్మన్‌ను ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
నువ్వా..నేనా..!?
డీసీసీబీ చైర్మన్‌గా ముత్తవరపు పాండురంగారావు ఎన్నికైన ఘడియమంచిదికానట్లుంది. యడవెల్లి విజయేందర్‌రెడ్డి, ముత్తవరపు పాండురంగారావులు చెరి రెండున్నరేళ్లు పదవిలో ఉండేలా చేసుకున్న ఒప్పందం అమలులోనే వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పలు పరిణామాల నేపథ్యంలో ఎన్నిక అనివార్యమైంది. ఎట్టకేలకు పాండురంగారావుకు చైర్మన్‌గిరి దక్కింది. ఆయన ఎన్నిక తీరుపై డెరైక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. నల్లగొండ అగ్రికల్చర్ :జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పదవికి యడవెల్లి విజయేందర్‌రెడ్డి సెప్టెంబర్‌లో రాజీనామా చేయడంతో ముత్తవరపు పాండురంగారావుకు అవకాశం కల్పించారు. ఏకగ్రీవమవుతుందన్న కాంగ్రెస్ నేతల అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీకే చెందిన డెరైక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ చైర్మన్ బరిలో నిలిచి అధిష్టానానికి చుక్కలు చూపారు. ఆక్టోబర్ 8న నిర్వహించిన చైర్మన్ ఎన్నికలలో పాండురంగారావుకు 12 మంది డెరైక్టర్లు ఓటు వేయగా, పిల్లలమర్రి శ్రీనివాస్‌కు 9 మంది డెరైక్టర్లు ఓటు వేశారు. దీంతో పాండురంగారావు గెలుపొందారు. అయితే పాండురంగారావు ఎన్నిక చెల్లదని పిల్లలమర్రి శ్రీనివాస్ రాష్ట్రసహకార ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నప్పుడు యడవెల్లి విజయేందర్‌రెడ్డి ఆరునెలలపాటు సెలవులోఉండి నాలుగు బోర్డు సమావేశాలకు హాజరుకానందున ఆయన డెరైక్టర్‌గా కొనసాగడానికి అర్హత కోల్పోయారని, అర్హత కోల్పోయిన విజయేందర్‌రెడ్డి బలపర్చిన పాండురంగారావు ఎన్నిక చెల్లదని శ్రీనివాస్ నవంబర్ 6న ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. వరుసగా మూడు బోర్డు సమావేశాలకు హాజరుకాకపోతే డెరైక్టర్‌గా కొనసాగే హక్కును కోల్పోతారని సహకార చట్టం చెబుతుందని ట్రిబ్యునల్‌కు తన వాదనలను వినిపించారు. దీంతో సహకార ట్రిబ్యునల్ ఇటీవల డీసీసీబీ చైర్మన్పాండురంగారావు, మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, డీసీఓ తుమ్మ ప్రసాద్, సీఈఓ నర్మద, ఎన్నికల అధికారి, జిల్లా సహకార అడిటర్ లక్ష్మినారాయణలకు నోటీసులను జారీచేసింది. ఈ నెల 29న స్వయంగా ట్రిబ్యునల్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించాలని నోటీసులో పేర్కొంది. వరుసగా మూడు సమావేశాలకు హాజరుకానట్లయితే అనర్హడుగా ప్రకటించవచ్చని సహకార చట్టంలో ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని సహకార శాఖ అధికారి పేర్కొన్నారు. మొత్తం మీద పాండురంగారావును చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి పిల్లల మర్రి శ్రీనివాస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం, న్యాయపరమైన అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ట్రిబ్యునల్ ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఏవిధమైన తుది తీర్పు ఇస్తుందో వేచిచూడాలి. -
సహకార బ్యాంకుల్లో రూ.184కోట్ల రుణాలు మాఫీ
గజ్వేల్: జిల్లాలోని సహకార బ్యాంకు ల ద్వారా రైతులకు రూ.184 కోట్ల రుణమాఫీ వర్తిస్తుందని, ఇందులో ఇప్పటివరకు పావువంతు రూ.44 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి తెలి పారు. శనివారం గజ్వేల్‌లోని సహకార బ్యాంకులో ఇద్దరు రైతులకు రుణమాఫీ చెక్కులు అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సహకార బ్యాంకుల్లో 56951 మంది రైతులు రుణాలు పొం దారని వారందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. ఈనెల 15లోగా రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకొని ‘జీరో’ వడ్డీని పొందాలని సూచిం చారు. గజ్వేల్ నియోజకవర్గంలో 5149మంది రైతు లు రుణాల పొందారని చెప్పారు. వీరికి రూ.13.7కోట్ల రుణమాఫీ వర్తిస్తుందన్నారు. జాతీయ బ్యాంకులకు దీటు గా తమ బ్యాంకు సేవలందిస్తుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జనరల్ మేనేజర్ శివకోటేశ్వర్‌రావు, గజ్వేల్ మండల సహకార సంఘం చైర్మన్ వెంకట్‌నర్సింహారెడ్డి, స్థానిక బ్రాంచ్ మేనేజర్ కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. కొండపాక: కొండపాక పీఏసీఎస్‌లో రుణాలు తీసుకున్న 826 మంది రైతులకు 2కోట్ల 56లక్షల రూపాయల రుణమాఫీ వచ్చిందని దేవేందర్‌రెడ్డి చెప్పారు. దీంట్లో 25 శాతం కింద రూ.61 లక్షలు పీఏసీఎస్‌కు చేరాయన్నారు. రైతులు ఈ నెల 15 వరకు తమ రుణాలను రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో రెండో విడత విడుదలయ్యే మాఫీ డబ్బులకు ఇబ్బందులెదురవుతాయన్నారు. రెన్యువల్ చేసుకుంటే జీరో శాతం వడ్డీ లేదంటే రైతులకు 13 శాతం వడ్డీ పడుతుందన్నారు. -
ప్లాన్ అదిరింది!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో అంతా ఒప్పంద రాజకీయమే నడుస్తోంది. ఎన్నికల ముందు ఒప్పందంలో భాగంగానే చైర్మన్ విజయేందర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చైర్మన్‌గా పీఠం దక్కించుకునేందుకు ముత్తవరపు పాండురంగారావు పావులు కదిపారు. ఇప్పుడా పదవి కోసం కొందరు డెరైక్టర్లతోనూ ‘ఒప్పందాలు’ జరిగాయి. బుధవారం జరగనున్న చైర్మన్ ఎన్నికలో పోటీ పడకుండా, పూర్తిస్థాయిలో సహకరించేందుకు చేతులకు మట్టి అంటకుండా లక్షలకు లక్షల రూపాయలు దోచిపెట్టే వ్యూహం పన్నారు. భువనగిరి, సూర్యాపేటలో డీసీసీబీ బ్రాంచ్‌ల బిల్డింగుల నిర్మాణం, కోదాడలో బ్యాంకుకు ప్రహరీ, టాయిలెట్ల నిర్మాణం, వాహన గ్యారేజీ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు. ఇదీ ... నేపథ్యం డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసిన యడవెల్లి విజయేందర్‌రెడ్డి గత నెల 15వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన చైర్మన్ పదవికి ఎన్నిక కోసం ముందే నిర్ణయం అయిన మేరకు సెప్టెంబరు 29వ తేదీన నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే, ఈ ఎన్నికను సాఫీగా ముగించేందుకు, పాలకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నేతలు పెద్ద వ్యూహమే రచించారు. విజయేందర్‌రెడ్డి రాజీనామా చేయగానే వైస్‌చైర్మన్‌గా ఉన్న ముత్తవరకు పాండురంగారావు ఇన్చార్జ్ చైర్మన్ అయ్యారు. ఈలోగా ఏం జరిగిందో ఏమో కానీ డీసీసీబీ సీఈఓ కోటి 38ల క్షల 75వేల రూపాయల విలువైన పనులకు సెప్టెంబర్ 23వ తేదీ టెండరు ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఓ దినపత్రికలో (సాక్షి కాదు) 26వ తేదీన అచ్చయ్యింది. మంగళవారంతో టెండరు షెడ్యూళ్ల కొనుగోలు గడువు ముగిసింది. ఈ ప్రకటన మేరకు భువనగిరిలో భవన నిర్మాణానికి రూ.60లక్షలు, సూర్యాపేట భవనానికి రూ.60.75లక్షలు, కోదాడలో ప్రహరీ, టాయిలెట్స్, గ్యారేజీ నిర్మాణానికి రూ.10లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ఇంతా చేస్తే, భువనగిరి పనికి 3, సూర్యాపేటకు 3, కోదాడ పనికి 5 చొప్పున మాత్రమే టెండరు దరఖాస్తులు అమ్ముడయ్యాయి. ఇదంతా ఓ పద్ధతి, ప్రణాళిక ప్రకారం నడిచిన వ్యవహారమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘ఢిల్లీ’ నేతకు గల్లీలో గడ్డుకాలం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కేంద్ర మంత్రిగా పనిచేసి ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వేణుగోపాలచారికి ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లా రాజకీయాలతోపాటు సొంత నియోజకవర్గంలో కూడా ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డిపై అవిశ్వాసం ఎపిసోడే ఇందుకు ఉదాహరణ. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టిన డీసీసీబీ వైస్‌చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డిని వెనకుండి నడిపించింది చారీనే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. తన అనుచరునికి డీసీసీబీ పదవి ఇప్పించుకుని తన ప్రభావాన్ని పెంచుకునేలా పావులు కదిపిన చారికి పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం చెక్ పెట్టింది. జిల్లా మంత్రి జోగు రామన్న చైర్మన్ దామోదర్‌రెడ్డికి అండగా నిలవడంతో ఈ అవిశ్వాసం అంశం అభాసుపాలైంది. ఇది చంద్రశేఖర్‌రెడ్డి కంటే చారి రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసిందనే అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లోకి రావడంతో సొంత నియోజకవర్గంలో కూడా ఆయనకు చెక్ పడినట్లయింది. నియోజకవర్గంలో అసలే నామమాత్రంగా ఉన్న ఆయన క్యాడర్ విఠల్‌రెడ్డి రాకతో చాలా మట్టుకు కనుమరుగవుతుందనే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తోంది. సీనియర్ నేతగా పేరున్న వేణుగోపాలచారికి టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో సన్నిహిత సంబంధాలున్నాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా అధినేతతో ఉన్న సంబంధాలతో క్యాబినేట్ స్థాయి పదవిని పొందగలిగారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యారు. జిల్లాకు వచ్చేసరికి మాత్రం తన ప్రభావాన్ని చూపకోలేకపోతున్నారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు ఆయన జిల్లా రాజకీయాలను శాసించేవారు. తన వర్గాన్ని పెంచుకునే పనిలో.. డీసీసీబీ ఎపిసోడ్.. విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లోకి రాక.. తదితర పరిణామాల నేపథ్యంలో జిల్లాలో తన పట్టును పెంచుకునే పనిలో వేణుగోపాలచారి పడినట్లు తెలుస్తోంది. ఇందు కోసం జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉంటున్నారు. మరోవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ ఓ అనుచరవర్గాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. పక్షం రోజుల క్రితం బెల్లంపల్లి నియోజకవర్గానికి వెళ్లిన చారి రోజంతా అక్కడే ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే రోజు మంత్రి రామన్న కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగంపై కూడా పట్టు సాధించేందుకు చారి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇటీవల ఆయన కొందరు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అయితే.. ఈ సమీక్షలకు మీరు ఎలా వెళతారని అధికార పార్టీలోని మరో వర్గం నేతలు అధికారులతో అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారు ఇరుకున పడుతున్నట్లు తెలుస్తోంది. -
ఢీసీసీబీ
సాక్షిప్రతినిధి, నల్లగొండ : సహకార చట్టాన్ని అపహాస్యం చేస్తూ.. దొడ్డిదోవన పదవి కట్టబెట్టిన అప్పటి కాంగ్రెస్ మంత్రులు చేసిన నిర్ణయానికి కాలం చెల్లింది. ఆరునెలల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన డీసీసీబీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి బుధవారం తిరిగి విధుల్లో చేరారు. అదీ ఇన్చార్జ్ చైర్మన్‌గా పాండురంగారావు స్థాని కంగా లేని సమయంలో. దీంతో సహకార ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందాలు చిత్తుకాగితాలే అయ్యాయి. విజయేందర్‌రెడ్డిపై ఒత్తిడి పెట్టి మరీ పంతంనెగ్గించుకున్న అప్పటి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి ఇప్పుడేం చేస్తారు..? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు చూస్తూ ఊరుకుంటారా...? అన్న విషయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. గత విషయాలను ఓసారి మననం చేసుకుంటే.., జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఆరునెలలు సెలవు పెట్టారు. అప్పటి జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పెట్టిన ఒత్తిడి వల్లే చైర్మన్ సెలవులో వెళ్లారన్న ప్రచారం కాంగ్రెస్‌లో జోరుగా సాగింది. రాజకీయ సమీకరణలో భాగంగా బ్యాంకు వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు చైర్మన్ బాధ్యతలను అప్పగించాలనే ఉద్దేశంతో విజయేందర్‌రెడ్డిని సెలవుపెట్టించారన్న వార్తలూ గుప్పుమన్నాయి. ఎన్నికల ముందు జరిగిన ఒప్పందాల గురించి అప్పటి మంత్రుల హోదాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సవివరంగా లేఖ రాశారు. గత ఏడాది సెప్టెంబరు 30వ తేదీతో ఉన్న ఈ లేఖలో ఇద్దరూ సంతకాలు చేశారు. ముందు చేసుకున్న ఒప్పందంలో భాగంగా, ఆయా కులాల సమీకరణాల నేపథ్యంలో ఈ మార్పు చేయనున్నామని, సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందించిన విజయేం దర్‌రెడ్డికి రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని కూడా ఆలేఖలో విన్నవించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఇక, పదవీత్యాగం చేసిన విజయేందర్‌రెడ్డికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇచ్చే అవకాశం ఎక్కడిది. దీంతో అధికారికంగా ఉన్న తన పదవిని ఎందుకు వదిలేసుకోవాలనుకున్నారేమో కానీ, విజయేందర్‌రెడ్డి ఈనెలాఖారు దాకా సెలువు ఉన్నా, బుధవారం తిరిగి చైర్మన్‌గా విధుల్లో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓ కులం ఓట్ల కోసమే ఇదంతా జరిగిందన్న సంగతి అందరికీ తెలిసిందే. విజయేందర్‌రెడ్డి ఇప్పుడు ఒకరకంగా అడ్డం తిరిగినట్లే. ఏరికోరి తన అనుచరుడి కోసం ఉత్తమ్ చేసిన ప్రయత్నాలు నిష్ఫలమైనట్లే కనిపిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానంతో దించివేయడం మినహా విజయేందర్‌రెడ్డి జోలికి ఎవరూ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అదీ రెండున్నరేళ్ల తర్వాతే అవిశ్వాసానికి ఆస్కారం ఉంటుంది. కానీ, ఇవేవీ జరగకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. జానారెడ్డితో ముందస్తుగా మాట్లాడి, భరోసాతోనే విజయేందర్‌రెడ్డి విధుల్లో చేరారని, ఇదంతా ముఖ్య నాయకులకు తెలిసే జరిగి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. కాగా, వైస్‌చైర్మన్ పాండురంగారావుకు చైర్మన్ పదవి ‘మూన్నాళ్ల ముచ్చట’గానే మిగిలిపోయింది. ఈ పరిణామాలు జిల్లా కాంగ్రెస్‌లో ఎలాంటి చిచ్చు రగిలిస్తుందో వేచి చూడాలి. -
చిట్యాల సొసైటీలో సిబ్బంది చేతివాటం
చిట్యాల, న్యూస్‌లైన్ : నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు చిట్యాల సొసైటీ ఉద్యోగులు. పంటల సాగుకోసం నిరుపేద రైతులకు అందించాల్సిన రుణాలు, మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన డబ్బును వారు పక్కదారి పట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఏటా మంజూరు చేస్తున్న స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు దుర్వినియోగమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. చిట్యాల సొసైటీలో పనిచేస్తున్న కార్యనిర్వాహక కార్యదర్శి మొగిలి, అటెండర్ రామనాథంలు ఈ ఏడాది మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన రూ. 3 లక్షలను స్వాహా చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా నిధులు దుర్వినియోగం చేసినందుకు పాలకవర్గం వారికి మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలో సొసైటీ చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డి, వైస్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ సమక్షంలో డెరైక్టర్లందరూ బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన డబ్బులు రూ.3 లక్షలను కాజేసిన కార్యనిర్వాహక కార్యదర్శి, అటెండర్‌ను విధుల నుంచి తొలగించాలని తీర్మానం చేసి డీసీసీబీ అధికారులకు పంపించడం గమనార్హం. కొనసాగుతున్న సస్పెన్షన్లు.. చిట్యాల సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులు అవినీతి కూపంలో మునిగి తేలుతున్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడాల్సిన ఉద్యోగు లు అక్రమాల పరంపరను కొనసాగిస్తున్నారు. బినామీ రైతులను సృష్టించి గతంలో రూ. 14 లక్షల పంట రుణాలు తీసుకున్నందుకు సీఈఓ లింగమూర్తితోపాటు సిబ్బంది మొగిలి, రాజేం దర్, రామనాథం, రాజిరెడ్డిని జిల్లా అధికారు లు సస్పెండ్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 14 లక్షలను రికవరీ చేశారు. ఇది లా ఉండగా, ఎరువు బస్తాల కోసం రైతుల నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ను ఉద్యోగులు ఇంతవరకు వారికి బస్తాలు ఇవ్వలేదు. ఈ విషయంలో ఇద్దరు అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. కాగా, సొసైటీ పరిధిలో లేని 26 మంది రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు చెల్లించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా రుణాలు చెల్లించినప్పటికీ వారి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన రూ.3 లక్షలను సీఈఓ మొగిలి, సబ్‌స్టాఫ్ రామనాథం స్వాహా చేయడం సొసైటీలో కలకలం రేపింది. డిఫాల్ట్ సంఘంగా గుర్తింపు.. చిట్యాల సొసైటీ.. జిల్లా సహకార సంఘంలో డిఫాల్ట్‌గా గుర్తింపు పొంది సభ్యత్వాన్ని కోల్పోయింది. సొసైటీ పరిధిలో రూ. 4 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో డీసీసీబీ చైర్మన్ ఎన్నికకు సొసైటీ చైర్మన్ ఓటు వేసే అర్హతను కూడా కోల్పోయారు. దీంతోపాటు రైతులకు ఇచ్చిన పంట రుణాలను వసూలు చేయడంలో ఈ సొసైటీ జిల్లాలో వెనకబడిపోయింది. ఈ విషయమై చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సొసైటీ అధికారుల పనితీరు అధ్వానంగా ఉందన్నారు. రైతులకు ఇచ్చిన పంట రుణాలను సిబ్బంది సక్రమంగా వసూలు చేయడం లేదని పేర్కొన్నారు.