రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
Published Fri, Aug 5 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
పర్వతగిరి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కల్లెడలో పీఏసీఎస్ నూతన కార్యాలయ భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ రై తు సంక్షేమమం కోసం సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను కడుతున్న ట్లు తెలిపారు. రైతులకు ఉదయం 9 గంట ల కరెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ పీఏసీఎస్‌ల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు అనేక ప్రయోజనాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పీఎసీఎస్ ఆవరణ లో మెుక్కలను నాటారు. అలాగే కల్లెడ బీసీకాలనీలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చే శారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు, ఎంపీపీ రంగు రజితకుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు మాదాసి శైలజా సు« దాకర్, సర్పంచ్ చినపాక శ్రీనివాస్, చైర్మన్ అశోక్‌రావు తదితరులు ఉన్నారు.
Advertisement